• తాజా వార్తలు
  •  

మీ ఫోన్ అవుటాఫ్ స్టోరేజా?  ఫైల్స్‌ గో యాప్ వాడండి..  

 

 ఫోన్‌లో స్టోరేజి స్పేస్ అయిపోవ‌డం ఆండ్రాయిడ్ యూజ‌ర్లంద‌రికీ అనుభ‌వ‌మే.  ఫోన్‌లో స్టోరేజి నిండిపోతే కొత్త యాప్స్ కానీ ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేయ‌లేం. అలా అని ఉన్న వాటిలో ఏది డిలిట్ చేయాలో తేల్చుకోలేం.  అందుకే గూగుల్ ఫొటోల కోసం అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజిని తీసుకొచ్చింది. కానీ మిగ‌తా ఫైల్స్ మాటేమిటి?  దానికీ ఓ సొల్యూష‌న్ తెచ్చింది. అదే గూగుల్ ఫైల్స్ గో.. 
 ఏంటీ గూగుల్ ఫైల్స్ గో?
ఇదొక స్మార్ట్ యాప్‌. గూగుల్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసింది. ఇది  ఫ్రీ యాప్‌. మీ స్టోరేజ్ ప్రాబ్ల‌మ్‌కు సొల్యూష‌న్ చూపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్న‌వుతుంది.  స్టోరేజినీ ఎప్ప‌టిక‌ప్పుడు మానిటర్ చేసి సొల్యూష‌న్స్ చెబుతుంది.
ఇలా ప‌ని చేస్తుంది..
* స్టోరేజీ ఆల్‌మోస్ట్ ఫుల్ అయిపోయింద‌నుకున్న‌ప్పుడు  రిమైండ‌ర్స్ పంపిస్తుంది. 
* మీరు గ‌త నెల రోజుల్లో ఒక్క‌సారి కూడా వాడని యాప్స్‌ను పాయింట్ అవుట్ చేసి చూపిస్తుంది. దీంతో మీరు వాటిని రివ్యూచేసుకుని అవ‌స‌ర‌మైతే అన్ ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీంతో స్పేస్ ఆదా అవుతుంది.
* మీ ఫైల్స్  డౌన్‌లోడ్  పూర్త‌యితే అల‌ర్ట్ చేస్తుంది. 
* ఎక్కువ స్పేస్ ఆక్ర‌మిస్తున్న మీడియా ఫైల్స్‌ను హైలైట్ చేసి చూపిస్తుంది. 
*డూప్లికేట్ ఫైల్స్ ఉంటే చూపిస్తుంది. 

జన రంజకమైన వార్తలు