• తాజా వార్తలు

ఫోటోల‌ను క‌దిలించ‌గ‌ల శ‌క్తివంత‌మైన యాప్ ప్లాటోగ్రాఫ్‌!

స్మార్ట్‌ఫోన్ ఉందంటే ఊరికే ఉండం.. ఏదో ఒక ఫొటోలు తీసుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా సెల్ఫీల‌కు అయితే లెక్కే లేదు. అలా లెక్క‌లేన‌న్ని ఫొటోలు తీసుకున్న త‌ర్వాత వాటిలో ఉత్త‌మ‌మైన వాటిని ఎన్నుకుని వాటిని ముస్తాబు చేస్తాం. అంటే ఫిల్ట‌ర్ చేయ‌డం.. వాటికి ర‌క‌ర‌కాల ఫేస్‌లు త‌గిలించ‌డం, బ్యాక్‌గ్రౌండ్ ఛేంజ్ చేయ‌డం ఎలా ఎన్నో ర‌కాలుగా ఫొటోల‌ను మారుస్తుంటాం. అయితే కేవ‌లం ఫొటోల‌ను ఫిల్ట‌ర్ చేయ‌డం, లేదా జీఐఎఫ్‌లుగా చేయ‌డం మాత్ర‌మే కాదు వాటిని క‌దిలించ‌గ‌లిగితే!  అంటే మీ ఫొటోకు ఒక మంచి రూపంతో పాటు వాటికి క‌ద‌లిక‌లు తేగ‌లిగితే! అది ప్లాటోగ్రాఫ్ యాప్‌తో సాధ్యం. 

ఏమిటీ ప్లాట్‌గ్రాప్‌?
ఫొటోల ఎడిటింగ్ కోసం చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫొటోల‌ను ఎడిట్ చేసి వాటిని మూవ్ చేయ‌గ‌లిగే  యాప్‌లు చాలా అరుదు. ప్లాట్‌గ్రాఫ్ అదే కోవ‌కు చెందుతుంది.  అంటే ఒక ఫొటోల‌ను తీసుకుని దాన్ని మార్చిన త‌ర్వాత‌.. యానిమేష‌న్ ద్వారా ఆ పిక్చ‌ర్‌ను క‌దిలేలా చేయ‌డ‌మే ఈ ప్లాట్‌గ్రాఫ్ ప్ర‌త్యేక‌త‌. అయితే ఇదేదో కార్టూన్ క‌దిలిన‌ట్లుగా కాకుండా నిజమైన ఫీలింగ్ క‌లిగేలా చేయ‌డ‌మే ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. 96.6 ఎంబీ మెమ‌రీ ఉండే ఈ యాప్‌ను ఐఓఎస్ డివైజ్‌ల‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇది ఫ్రీ యాప్ కాదు. దీన్ని కొనుక్కోవాలి. దీని ధ‌ర రూ.400. ధ‌ర ఎక్కువ‌గానే ఉన్నా దాని ప‌ని తీరు మ‌రింత గొప్ప‌గా ఉంటుంది. 

ఏంటి దీని ప్ర‌త్యేక‌త‌?

1, ప్లాట్‌గ్రాఫ్ ప్ర‌త్యేక‌తలు చాలా ఉన్నాయి. బేసిక్ ఫిల్ట‌ర్ల‌తో పాటు సాట‌రేష‌న్ ఛేంజ్ చేయ‌డం, పిక్చ‌ర్స్‌కు స్టిక్క‌ర్ల‌ను యాడ్ చేయ‌డం దీంతో చేసుకోవ‌చ్చు.

2. ఒక పిక్చ‌ర్ రూపు రేఖ‌లు మార్చి పూర్తిగా కొత్త పిక్చ‌ర్‌గా చేసుకోవ‌చ్చు.  ఆరంభంలో ఈ యాప్‌ను యూజ్ చేయ‌డం ఇబ్బందిగా అనిపించినా అల‌వాటు అయిన త‌ర్వాత దీన్ని ఉప‌యోగించ‌డం పెద్ద క‌ష్టం కాదు.

3. ఈ హైఎండ్ ఫొటో ఎడిటింగ్ యాప్ ద్వారా ఫొటో నాచురాలిటీ ఏం మాత్రం చెడిపోకుండా స‌హ‌జంగా ఉంచ‌డ‌మే ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. ఈ యాప్‌లో ఉండే డైరెక్ష‌న్స్‌కు త‌గ్గ‌ట్టు ముందుకు వెళితే చాలు. మీకు ఒక మంచి యానిమేటెడ్ ఫొటో సొంతం అవుతుంది. 

జన రంజకమైన వార్తలు