• తాజా వార్తలు
  •  

మ‌న ప్రైవ‌సీని, డేటాని బ్లాక్ క్యాట్ కమాండోల్లా కాపాడే యాప్స్ మీ కోసం!

మ‌న ఫోన్లో లేదా కంప్యూట‌ర్‌లో ఉన్న డేటా ఎంత వ‌ర‌కు సేఫ్! ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా... ఎన్ని యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌లు ఉప‌యోగించినా మ‌న డేటా సుర‌క్షితం అని చెప్ప‌లేం. హ్యాక‌ర్లు ర‌క‌ర‌కాల మార్గాల్లో మ‌న డివైజ్‌ల‌లో చొర‌బ‌డి డేటా చౌర్యం చేస్తున్నారు. అయితే ఇలాంటి చౌర్యాన్ని ఆపి..మ‌న డేటాను ఎల్ల‌వేళ‌లా కాపాడే  యాప్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా..

స్టాండ‌ర్డ్ నోట్స్‌
ఇదో ప్రైవేటు నోట్  ప్యాడ్. ముఖ్యంగా మన స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో విష‌యాలు దాచుకుంటాం. కానీ ఇవ‌న్నీ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలో మ‌న‌కు తెలియ‌దు. అందుకే చాలామంది నోట్ పాడ్స్‌లో చాలా విష‌యాలు దాచుకుంటారు.  ఐతే ఇది అంత సేఫ్ అని చెప్ప‌లేం. అందుకే సింపుల్ న నోట్ అనే యాప్ ఉంది.   దీని సాయంతో మ‌నం డేటాను సుర‌క్షితంగా దాచుకోవ‌చ్చు. ఇది యాపిల్‌లో  నోట్స్ యాప్‌ను పోలి ఉంటుంది. విండోస్‌, మాక్‌, లిన‌క్స్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో కూడా దీన్ని వాడుకోవ‌చ్చు. దీనిలో టెక్ట్స్ మాత్ర‌మే దాచుకోవ‌చ్చు. ఇమేజ్‌లు, వీడియోల‌ను మ‌నం  దాచి ఉంచే అవ‌కాశం లేదు.

అనియ‌న్ షేర్‌
కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ల‌లో ఫైల్స్‌ను షేర్ చేయ‌డానికి  గూగుల్ డ్రైవ్‌, డ్రాప్ బాక్స్‌, వ‌న్‌డ్రైవ్  లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇంకా చాలా ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి కానీ అవ‌న్నీ ప్రైవేటువే.  అయితే హ్యాక‌ర్ల భ‌యం ఎక్కువైన త‌ర్వాత మ‌న  డేటా సుర‌క్షిత‌మా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.  అయితే  అనియ‌న్ షేర్ అనే యాప్ మీకు ఆ భ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తుంది. ఫైల్స్ సుర‌క్షితంగా ఉంచ‌డంలో దీని ప్ర‌త్యేకతే వేరు. 

ఓబీన్
ఇదో ప్రైవేటు క్లిప్ బోర్డ్ లాంటిది. సాధార‌ణంగా మ‌నం కంప్యూటర్‌లో ఏదైనా కాపీ చేస్తే అది క్లిప్‌బోర్డులోనే ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌నం మ‌న‌కు న‌చ్చిన చోట పేస్ట్ చేసుకుంటాం. కానీ కంప్యూట‌ర్‌లో అన్ని విలువైన స‌మాచారాన్ని దాచుకోలేం. అయితే మ‌న‌కు టెక్ట్‌తో పాటు ఇమేజ్‌లు దాచుకోడానికి ఓబీన్ అనే కొత్త యాప్ వ‌చ్చింది. దీంతో మ‌న టెక్ట్‌తో పాటు ఇమేజ్‌లు కూడా సేవ్ చేసుకుని దాచుకోవ‌చ్చు.

ఎదెర్ ప్యాడ్
గూగుల్ డాక్స్‌, గూగుల్‌షీట్స్‌ను  భ‌ద్రం చేసుకోవ‌డానికి ఎదెర్ ప్యాడ్, ఎదెర్ కాల్ అనే యాప్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సాదార‌ణంగా మీ స‌మాచారాన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో ఉంచుతాం. గూగుల్ డాక్స్‌, మైక్రోసాఫ్ట్ 365 ద్వారా  దాచుకున్న స‌మాచారాన్ని మ‌నం రియ‌ల్‌టైమ్‌లో ఉప‌యోగించుకుంటాం. కానీ ఇవి ఎంత‌వ‌ర‌కు సేఫ్ అనేది చెప్ప‌లేం. దీనికి ప్ర‌త్యామ్నాయంగా ఎదెర్ ప్యాడ్‌, ఎదెర్ కాల్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జన రంజకమైన వార్తలు