• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్స్‌లో రియ‌ల్‌టైం బ‌స్ ఇన్ఫ‌ర్మేష‌న్ చెప్పే కొత్త ఫీచ‌ర్ ఇండియాలో మొద‌లయింది..





మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఉంటే మీకు దారి చూపిస్తుంది. రెస్టారెంట్‌, సినిమా హాల్ ఎక్కడుందో అక్క‌డికి తీసుకుపోతుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది.  ఏ బ‌స్సు ఎక్క‌డుందో చెప్పే రియ‌ల్ టైం బ‌స్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను ఇవ్వ‌బోతోంది. ఇండియాలో తొలిసారిగా   కోల్‌క‌తాలో ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ ప్ర‌వేశ‌పెట్టింది.  ఇందుకోసం వెస్ట్ బెంగాల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (WBTC)తో టైఅప్ పెట్టుకుంది. 
 కోల్‌క‌తాతో మొద‌లు 
ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ డివైస్ లు రెండింటిలోనూ ఈ ఫీచ‌ర్ ప‌ని చేస్తుంది. WBTC కీ రూట్స్‌లో ఈ ఫీచ‌ర్‌ను మంగ‌ళ‌వారం గూగుల్ ప్రారంభించింది.  ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ డివైస్‌లో గూగుల్ మ్యాప్‌ను  ఓపెన్ చేసి మీ డెస్టినేష‌న్ యాడ్ చేయాలి. గెట్ డైరెక్ష‌న్స్ ఐకాన్‌ను టాప్ చేసి త‌ర్వాత ట్రామ్‌లా క‌నిపించే transit ఐకాన్‌ను టాప్ చేస్తే టైమింగ్స్‌, బ‌స్‌/  రైల్ నెంబ‌ర్లు, రూట్స్ క‌నిపిస్తాయి. రియ‌ల్ టైం ఇన్ఫో గ్రీన్ క‌ల‌ర్‌లో హైలైట్ గా క‌నిపిస్తుంది. రిక‌మండెడ్ రూట్‌పైన టాప్ చేస్తే ఆ రూట్‌లో న‌డుస్తున్న బ‌స్‌ల ఇన్ఫో వ‌స్తుంది. బ‌స్టాప్‌ను టాప్ చేస్తే అక్క‌డికి వ‌చ్చే బ‌స్సులు, టైమింగ్స్ డిస్‌ప్లే అవుతాయి. రియ‌ల్ టైం ఇన్ఫో గ్రీన్ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. 
స‌క్సెస్ అయితే మిగిలిన స్టేట్స్‌లో
గూగుల్ ఇలా రియ‌ల్‌టైం ట్రాన్సిట్ ఇన్ఫో ఇవ్వ‌డం ఇండియాలోఇదే తొలిసారి.  క‌ల‌క‌త్తాలో  ఇది స‌క్సెస్ అయితే మిగిలిన స్టేట్స్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయ‌డానికి గూగుల్ ప్లాన్ చేస్తోంది. 
 

జన రంజకమైన వార్తలు