• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్లలో చెత్త పోగవకుండా ఉండాలంటే ఈ యాప్ వేసుకోవడం బెటర్


    ఆండ్రాయిడ్ ఫోన్లలో జంక్ పేరుకుపోవడం, క్యాచీ ఫైల్స్, టెంపరరీ ఫైల్స్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల అనవసరంగా మెమొరీ ఆక్యుపై అయి స్టోరేజీ తగ్గిపోతుంది. తక్కువ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉన్న డివైస్ లకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. క్లీనింగ్ యాప్స్ ఎన్నో ఉన్నప్పటికీ యూజర్ ఫ్ఱెండ్లీగా లేకపోవడం... అందులో వచ్చే యాడ్స్ వల్ల చాలా మంది వటిని వాడేందుకు వెనుకాడుతున్నారు. 
    అయితే, తాజాగా వచ్చిన మరో క్లీనింగ్ యాప్ యూజర్లను ఆకట్టుకుంటోంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉందంటున్నారు. రాకెట్ క్లీన్ (Rocket Clean)  పేరిట  ప్లేస్టోర్లో ఉన్న ఈ నూతన యాప్ ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.  రాకెట్ క్లీన్ యాప్ ద్వారా యూజర్లు తమ డివైస్‌లో పేరుకుపోయిన టెంపరరీ, జంక్ ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. 

లాభాలేంటి...
* రెగ్యులర్ గా ఈ యాప్ వాడితే డివైస్‌లో స్టోరేజ్ పెరుగుతుంది. ఫోన్ వేగంగా కూడా పనిచేస్తుంది. 
* ఇందులో ఉండే ఫోన్ బూస్టర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్‌ను క్లోజ్ చేయవచ్చు. 
* దీంతో ర్యామ్ సైజ్ పెరిగి కొత్త అప్లికేషన్లు వేగంగా ఓపెన్ అవుతాయి. 
* ఈ యాప్‌లో ఉన్న బ్యాటరీ పవర్ సేవర్ టూల్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వినియోగించుకోకుండా ఉండేలా నిరోధించవచ్చు. దీంతో బ్యాటరీ సేవ్ అవుతుంది.
 

జన రంజకమైన వార్తలు