ఏదైనా ఓ ప్రశ్నకు సమాధానం కావాలి. కోరా లాంటి పబ్లిక్ ఫోరమ్స్ చాలా ఉన్నాయి. వాటలో ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ ఫోరమ్‌లోనే సమాధానాలిస్తారు. అయితే ఇలా పబ్లిక్ ఫోరమ్స్‌లో ప్రశ్నలడగడం అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే అందులో మన ఐడెంటిటీ తెలిసిపోతుంది. అలా కాకుండా అజ్ఞాతంగా ఉంటూనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్లే స్టోర్‌లో ఓ యాప్ ఉంది. దాని పేరు యే నే (Yea Nay). ఈ యాప్‌లో మీరు ప్రశ్నలడిగితే ఎవరైనా సమాధానం చెబుతారు. అలాగే ఎవరయినా అడిగిన ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే మీరు కూడా సమాధానం ఇవ్వచ్చు. ఇదంతా మీ ఐడెంటిటీ బయటపెట్టకుండానే చేయగలడం యే నే యాప్ ప్రత్యేకత.
స్వైప్ చేస్తే ఆన్సర్
ఈ యాప్ హోం పేజీ చాలా ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉంటుంది. స్టార్టర్ ప్రశ్నతో యాప్ డిస్క్రిప్షన్ అర్ధమైపోతుంది. రైట్‌కు స్వైప్ చేస్తే పాజిటివ్ అని, లెఫ్ట్‌కు స్వైప్ చేస్తే నెగిటివ్ అని ఆన్సర్ ఇచ్చినట్లు. ఒక్కసారి మీరు ఆన్సర్ ఇచ్చాక, ఆ ప్రశ్నకు ఎంతమంది నెగిటివ్ , ఎంతమంది పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారో టోటల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. హోం పేజీలో కింద ఉన్న + బటన్‌ను క్లిక్ చేసి మీ సొంత ప్రశ్నను కూడా సబ్మిట్ చేయొచ్చు. అది కూడా మీ ఐడెంటిటీ చెప్పక్కర్లేకుండానే..
ఆప్షన్లు ఇవీ
యాప్ సెకండ్ పేజీలోకి వెళితే బ్లాక్ అండ్ వైట్ ఇంటర్ఫేస్తో బోల్డన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. వీటికి మీరు లెఫ్ట్ లేదా రైట్‌కు స్వైప్ చేస్తే ఆన్సర్ నమోదవుతుంది. పేజీ టాప్‌లో మూడు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
1. ప్రొఫైల్ ఆప్షన్: ఇది ఫస్ట్ ఆప్షన్. మీరు అడిగిన ప్రశ్నలేంటో చూపిస్తుంది. ఆ ప్రశ్నకలకు వచ్చిన రెస్పాన్స్, దానికి ఎంత మంది నెగిటివ్ ఆన్సర్, ఎంత మంది పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారో అనలిటిక్స్ కూడా కనిపిస్తాయి.
2. షో ఆప్షన్: రెండో ఆప్షన్ మీకు ప్రశ్నకు జవాబివ్వడానికి లేదా ఇప్పటికే ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు చూడడానికి అవకాశం కల్పిస్తుంది.
3. ఆస్క్ ఏ క్వశ్చన్: మూడో ఆప్షన్ మిమ్మల్ని కొత్త ప్రశ్న అడగడానికి అవకాశం కల్పిస్తుంది.+ గుర్తుతో ఉంటుంది.
మీరెవరో తెలియకుండా ప్రశ్నలు అడగడం, దాని మీద జనాల వ్యూ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ యాప్ బాగా పనికొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఇంటర్ ఫేస్ కావడంతో బ్యాటరీ కూడా పెద్దగా ఖర్చవదు.