• తాజా వార్తలు

గూగుల్ కొన్న స్టార్ట‌ప్‌.. మీ ఫోన్‌ను డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్‌గా మారుస్తుంద‌ట‌!

గూగుల్ ఇంటీవ‌ల Senosis Health అనే స్టార్ట‌ప్‌ను కొనుగోలు చేసింది. ఈ స్టార్ట‌ప్ రూపొందించిన Senosis health app (సెనోసిస్ హెల్త్ యాప్‌)..  స్మార్ట్‌ఫోన్‌ను  మెడిక‌ల్ డివైస్‌గా మారుస్తుంది.  లంగ్ హెల్త్‌, హీమోగ్లోబిన్ కౌంట్ వంటి స్టాటిస్టిక్స్‌ను క‌లెక్ట్  చేస్తుంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాక్సిల‌రో మీట‌ర్‌, మైక్రోఫోన్‌, ఫ్లాష్‌, కెమెరాల‌ను ఉప‌యోగించుకుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు హీమోగ్లోబిన్ కౌంట్ తెలుసుకోవాలంటే యాప్ ఫోన్ ఫ్లాష్‌ను ఉప‌యోగించుకుని యూజ‌ర్ ఫింగ‌ర్‌ను ఇల్యూమినేట్ (కాంతివంతం) చేస్తుంది.

 

యూనివ‌ర్సిటీ ఆఫ్ వాషింగ్ట‌న్ స్టూడెంట్ శ్వేత‌క్ ప‌టేల్ మ‌రో న‌లుగురితో క‌లిసి  Senosis Health కంపెనీని స్టార్ట్ చేశాడు. 2015లోనూ వీళ్లు

వ్యాలీహోమ్ సెన్స‌ర్‌ను త‌యారుచేశారు. వాతావ‌ర‌ణంలో మాయిశ్చ‌ర్‌, టెంప‌రేచ‌ర్‌, హ్యుమిడిటీల్లో వ‌చ్చే   మార్పుల‌ను గుర్తించే ఈ సెన్స‌ర్ టెక్నాల‌జీని  Sears అనే కంపెనీ కొనుక్కుంది.  ఇప్పుడు Senosis Health టెక్నాల‌జీని గూగుల్ సొంతం చేసుకుంది.

 

హెల్త్‌కేర్ టెక్నాల‌జీలో భారీ ఇన్వెస్ట్‌మెంట్

 గూగుల్.. హెల్త్‌కేర్ టెక్నాల‌జీలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తోంది.  గ‌త సంవ‌త్స‌రం DeepMind Health అనే ఇనీషియేటివ్‌ను లాంచ్ చేసింది. ఇది కొన్ని హెల్త్ యాప్స్‌ను ఒక్క‌చోటికి చేర్చి పేషెంట్ రిస్క్‌ను ఐడెంటిఫై చేయ‌డంలో డాక్ట‌ర్స్‌కు సాయ‌ప‌డుతుంది.  హెల్త్ కేర్ టెక్నాల‌జీలో మెషీన్ లెర్నింగ్‌, ఏఐ టెక్నాల‌జీతో మెడిక‌ల్ ప్రొవైడ‌ర్స్‌కు టూల్స్‌ను త‌యారుచేస్తోంది.  ఆప్త‌ల్మాలజీ, డిజిట‌ల్ పాథాల‌జీల్లో ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇలాంటి టైమ్‌లోనే Senosis Health  యాప్ గురించి తెలియ‌డంతో గూగుల్ దాన్ని వెంట‌నే కొనేసింది. త‌మ  హెల్త్ టెక్నాల‌జీ ఎక్స్‌పాన్ష‌న్ కోసం ఇలాంటి యాప్స్‌, టెక్నాల‌జీస్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని గూగుల్ చెబుతోంది.

 

జన రంజకమైన వార్తలు