• తాజా వార్తలు

  మీ క్రెడిట్ కార్డ్‌ను ఎవ‌రైనా స్కిమ్ చేస్తే మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేసే యాప్

 

 

క్రెడిట్ కార్డ్‌ను హ్యాక్ చేసి ఆన్‌లైన్లో జ‌రిగే క్రైమ్సే ఎక్కువ‌గా వెలుగులోకి వ‌స్తుంటాయి. కానీ ఫిజిక‌ల్‌గా క్రెడిట్ కార్డ్ ఉప‌యోగించే చోట (పెట్రోల్ బంకులు, షాప్‌లు వంటి చోట‌) కూడా వాటిని హ్యాక్ చేసి మీ కార్డ్‌లో ఉన్న మ‌నీని కొట్టేసేవి చాలానే జ‌రుగుతుంటాయి. దీన్ని స్కిమ్మింగ్ అంటారు.  పీవోస్ మిష‌న్ల‌లో స్కిమ్మ‌ర్ల‌ను పెట్టి మీ కార్డ్ డిటెయిల్స్‌ను ట్రాప్ చేసి డ‌బ్బులు కొట్టేసే మోస‌గాళ్లుంటారు.

స్కిమ్మ‌ర్ చాలా చిన్న‌గా ఉండే ఎల‌క్ట్రానిక్ డివైస్‌.  అది పీవోఎస్‌లో లేదా స్వైప్ చేసే మిష‌న్‌లో ఉంటుందని మీరు గుర్తించ‌లేరు. అంతేకాదు స్కిమ్మ‌ర్‌ను చాలా ఈజీగా కొన్ని సెక‌న్ల‌లోనే అమ‌ర్చేయ‌వ‌చ్చు.  తీసేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి మీకు ఎలాంటి అనుమానం కూడా రాదు. 

స్కిమ్మ‌ర్ స్కాన‌ర్ యాప్

ఇలాంటి చోరీల‌ను అడ్డుకోవ‌డానికి స్కిమ్మ‌ర్ స్కాన్ అనే యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. దీన్ని వైట్ హేట్ హార్డ్‌వేర్ హ్యాక‌ర్స్ క్రియేట్ చేశారు. మీ కార్డ్ వివ‌రాల‌ను స్కిమ్మ‌ర్‌తో స్కాన్ చేస్తుంటే ఇది అడ్డుకుని అల‌ర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ, లాఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఈ యాప్‌ను ఎక్కువ‌గా వాడ‌తాయి. ఆండ్రాయిడ్ డివైస్ కంపాటబులిటీ ఉన్న స్కిమ్మ‌ర్ స్కాన‌ర్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ కార్డ్‌ను స్కిమ్ కాకుండా కాపాడుకోవ‌చ్చు.  అయితే ఐవోఎస్ వెర్ష‌న్ ఇంకా రాలేదు.

జన రంజకమైన వార్తలు