మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ తన మొబైల్ యాప్‌కు కొత్త కొత్త ఫీచర్లతో దూసుకొస్తోంది. గత రెండు నెలల కాలంలో చాలా కొత్త ఫీచర్లు, అప్డేట్లను ఇచ్చింది. స్నాప్ చాట్ ఇటీవలే యాక్వైర్ చేసుకున్న సోషల్ మ్యాపింగ్ స్టార్టప్ Zenlyని బేస్ చేసుకుని స్నాప్ మ్యాప్ అనే మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నాప్‌చాట్ యూజర్ల గురించి తెలుసుకోవడానికి వీలయ్యే ఈ యాప్ గురించి తెలుసుకుందాం పదండి..
స్నాప్ మ్యాప్ ఫీచర్‌తో యూజర్లు తమ యాప్ మెయిన్ మెరా స్క్రీన్ ను జూమ్ చేస్తే ప్రపంచ మ్యాప్ కనిపిస్తుంది. దీని మీద వరల్డ్ వైడ్‌గా ఉన్న స్నాప్ చాట్ యూజర్లు తమ అవర్ స్టోరీ ఆప్షన్లో పోస్ట్ చేసిన స్టోరీలు, ఫొటోలు వంటివన్నీ చూడొచ్చు. మీ లొకేషన్‌ను ట్యాగ్ చేసి ఉంటుంది కాబట్టి మిగిలిన యూజర్లు కూడా మీ స్నాప్‌చాట్ అకౌంట్‌ను, స్టోరీ లైన్‌ను కూడా చూసే అవకాశం ఉంటుంది.
ప్రైవసీ కాపాడుకోవచ్చు
ఫస్ట్ టైం మీరు ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసేటప్పుడు మీ లొకేషన్‌ను షేర్ చేయొచ్చా లేదా అనే మెసేజ్ వస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ లొకేషన్‌ను మిగిలిన యూజర్లకు చూపిస్తుంది. అంతేకాదు మీరు ఘోస్ట్ మోడ్‌లో ఉండి మీ లొకేషన్‌ను షేర్ చేయకుండానే మిగిలిన యూజర్ల యాక్టివిటీని చూడొచ్చు. అంటే మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంటుంది.