• తాజా వార్తలు
  •  

మీ ఫ్రెండ్స్ గురించి ర‌హ‌స్యంగా రివ్యూ చేసే యాప్ టీబీహెచ్‌

మ‌న స్నేహితుల గురించి మ‌న‌కు తెలుసు. మ‌రి వారు మ‌నం వారి ముందు లేన‌ప్పుడు ఎలా ఉంటారు? అస‌లు వారి ఒరిజిన‌ల్ బిహేవియ‌ర్ ఏమిటి? .. వాళ్ల ఇష్టా ఇష్టాలు ఏమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌లు ప్ర‌తి ఒక్క‌రికి ఉంటాయి.  మీ స్నేహితుల గురించి ర‌హ‌స్యంగా శోధించి మీకు వివ‌రాలు అందించే యాప్ ఒక‌టి పుట్టుకొచ్చింది. దాని పేరే టీబీహెచ్ (టూ బీ హానెస్ట్‌)! మ‌రి ఏంటి యాప్‌.. ఇది ఎలా ప‌ని చేస్తుంది?

పోల్స్ ద్వారా..
సాధార‌ణంగా ఆన్‌లైన్ స‌ర్వేలు, పోలింగ్‌ల ద్వారా ఎన్నిక‌ల ఫ‌లితాల వివ‌రాలు లెక్కేస్తూ ఉంటారు. అలాగే టీబీహెచ్ యాప్ కూడా ఈ పోల్ సర్వేల ద్వారానే మ‌న స్నేహితుల గురించి మ‌న‌కో ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.  స్నేహితుల‌ను రివ్యూ చేసి వారికో రేటింగ్ కూడా ఇస్తుంది. అయితే విశేషం ఏమిటంటే ఇలా ఇచ్చే రివ్యూల‌న్ని దాదాపు పాజిటివ్‌గానే ఉంటాయి. ఎందుకంటే ఈ రివ్యూల ద్వారా మ‌ళ్లీ స్నేహితుల మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు రాకుండా చూసుకోవ‌డం కోసమే ఈ యాప్‌ను అలా డిజైన్ చేశారు.  అయితే త‌మ స్నేహితుల్లో ఉన్న చెడ్డ గుణాల‌ను గుర్తించి వారిని స‌రిచేసే అవ‌కాశం ఈ యాప్ ద్వారా క‌లుగుతుంది. అంతేకాదు త‌మ స్నేహితుల‌కు ఇష్ట‌మైనవి తెలుసుకుని వారిని స‌ర్‌ప్రైజ్ చేసే అవ‌కాశాన్ని కూడా ఈ యాప్ మ‌న‌కు క‌లిగిస్తోంది. 

13 ఏళ్ల పైన ఉంటేనే..
ఈ యాప్‌ను వాడాలంటే 13 ఏళ్ల పైన వ‌య‌సు ఉండాలి. త‌మ స్నేహితుల గురించి పూర్తి వివ‌రాలు తెలిసి ఉండాలి. దీనిలో స్నేహితులను జెమ్ స్టోన్స్ రూపంలో పోలుస్తారు. మీరు మరిన్ని ప్ర‌శ్న‌లు అడ‌గాలంటే కొంత వ‌ర్చువ‌ల్ క‌రెన్సీని ఖ‌ర్చు పెట్టి అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది.  మీరు అడిగే ప్ర‌శ్న‌ల‌ను బ‌ట్టే యాప్ కూడా బిహేవ్ చేస్తుంది. మ‌న స్నేహితుల వివ‌రాల‌ను మ‌నం అందించి ప్ర‌శ్న‌లు అడుగుతూ ముందుకెళ్లాలి. సారా యాప్ కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. దీనిలోనూ రివ్యూ పోర్ట‌ల్స్ ఉన్నాయి. అయితే సైబ‌ర్ నేరాల‌కు అవ‌కాశం ఉండ‌డ‌మే దీనిలో ఉన్న పెద్ద లోపం.  ప్ర‌స్తుతానికి ఈ యాప్ యునైటెడ్ స్టేట్స్‌లో మాత్ర‌మే ల‌భ్యం అవుతోంది. 

జన రంజకమైన వార్తలు