• తాజా వార్తలు

మెసేజింగ్ యాప్‌లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ మైక్రోసాఫ్ట్ ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ 

టెక్నాల‌జీని కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో మైక్రోసాఫ్ట్ ముందంజ‌లో ఉంటుంది. తాజాగా ఆ సంస్థ మెసేజింగ్ యాప్‌లో ఒక విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌కు తెర తీసింది. ఆండ్రాయిడ్ ఫోన్లో మెసేజింగ్‌ను ఒక తాటి పై తీసుకురావ‌డానికి మైక్రోసాఫ్ట్ ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ అనే కొత్త ఆవిష్క‌ర‌ణ చేసింది. దీంతో మ‌న‌కు మెసేజింగ్ చాలా చాలా సుల‌భం కానుంది.  ఈ ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్‌ను ఉపయోగించ‌డం చాల సుల‌భం.  దీనిలో ఉన్న ఫీచ‌ర్లేమిటో చూద్దామా..

ఓటీపీ డిటెక్ష‌న్‌
ఏదైనా వెబ్‌సైట్‌కు లాగిన్ అయిన‌ప్పుడు టూ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ అవ‌స‌రం. ఆ సైట్ మ‌న మొబైల్ నంబ‌ర్‌కు ఓ వ‌న్ టైమ్ పాస్ వ‌ర్డ్ పంపిస్తుంది.  సాధార‌ణంగా మీరు మెసేజ్ ఓపెన్ చేసి ఆ పాస్‌వ‌ర్డ్‌ను కాపీ చేసి చేసి మీకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకుంటారు.  కానీ ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ ఈ ప్రాసెస్‌ను చాలా సుల‌భం చేస్తుంది. మ‌న టెక్ట్ మెసేజ్‌లో ఏమైనా ఓటీపీ ఉంటే ఇది డిటెక్ట్ చేసి నేరుగా కాపీ చేస్తుంది. దీని వ‌ల్ల మీరు ఆ మెసేజ్ ఓపెన్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

గూగుల్ డ్రైవ్ ఇంటిగ్రెష‌న్‌
మైక్రోసాఫ్ట్ ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ చేసే మ‌రో మేలు ఏంటంటే... మీ ఎస్ఎంఎస్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గూగుల్ డ్రైవ్‌లో బ్యాక్ అప్ చేయ‌డం. దీని వ‌ల్ల మీరు మాన్యువ‌ల్‌గా చేసే ఇబ్బంది కూడా త‌ప్పుతుంది. మీరు  ఫోన్ మారిస్తే క్లౌడ్ నుంచి ఆ చాట్స్‌ను, మెసేజ్‌లు రీస్టోర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇంటిలిజెంట్ మెసేజ్ సార్టింగ్‌
మీ మెసేజ్‌ల‌ను క్యాట‌రిరీ వారిగా డివైడ్ చేసి ఉంచ‌డం ఈ యాప్ మ‌రో ప్ర‌త్యేక‌త‌. అంటే ట్రాన్సాక్ష‌న్స్‌, ప్రొమోష‌న‌ల్‌, బ్లాక్డ్ ఇలా కేట‌గిరీ వారిగా మెసేజ్‌లు స‌ప‌రేట్ చేస్తుందీ యాప్‌. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల కోసం ఫీచ‌ర్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ప్రొమోష‌న‌ల్ మెసేజ్‌లు ఒకేచోట ఉండ‌డం వ‌ల్ల కూడా వాటిని మ‌నం అవ‌స‌ర‌మైతేనే ప‌ట్టించుకోవ‌చ్చు. 

ఈమెయిల్ లైక్ ఫిల్ట‌ర్స్‌
ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్‌లో ఉన్న మ‌రో ఫీచ‌ర్ ఈమెయిల్ లైక్ ఫిల్ట‌ర్స్‌. మెసేజ్ మీద ట్యాప్ చేసి ఉంచితే ఫిల్ట‌ర్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అంటే ఒక‌రికి పంపిచే మెసేజ్‌లు ఆటోమెటిగ్గా ఆ ఫోల్డ‌ర్‌లోనే సేవ్ అవుతాయి. 

స్మార్ట్ రిమైండ‌ర్స్‌
మీ టెక్ట్ మెసేజ్‌ల‌లో డ్యూ డేట్‌లు ఉంటే వాటికి సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను కూడ పంపించ‌డం ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ మ‌రో స్పెషాలిటీ. ఉదాహ‌ర‌ణ‌కు మీ క్రెడిట్‌కార్డు బిల్లు డ్యూ డేట్ స‌మీపిస్తుంటే ఇది మ‌నల్ని అలెర్ట్ చేస్తుంది.

ఫ్రీ ఎంఎస్ఎస్‌
ఎస్ఎంఎస్ ఆర్గ‌నైజ‌ర్ ద్వారా ప్ర‌తి నెలా 30 ఉచిత మెసేజ్‌లు కూడా పొందొచ్చు. భారత్లో ఎక్కడికైనా   ఈ సందేశాలు పంపుకునే అవకాశం ఉంది.

 

జన రంజకమైన వార్తలు