• తాజా వార్తలు
  •  

డ్రైవింగ్ చేసేవారికి మోస్ట్ వాంటెడ్ యాప్స్ ఏంటో తెలుసా? 

ఉద‌యం అలారం కొట్టే ద‌గ్గ‌ర నుంచి రాత్రి గుడ్‌నైట్ మెసేజ్ పెట్టేవర‌కు ప్ర‌తి క్ష‌ణం స్మార్ట్‌ఫోన్‌తో పెన‌వేసుకుపోయింది మ‌న‌జీవితం. కానీ డ్రైవింగ్ చేసేట‌ప్పుడు స్మార్ట్‌ఫోన్ యూజ్ చేయ‌డం క‌రెక్టే కాదు సేఫ్ కాదు కూడా. అయితే స్మార్ట్‌ఫోన్‌ను చేత్తో పట్టుకుని ఆప‌రేట్ చేయ‌క్క‌ర్లేకుండానే మీ డ్రైవింగ్ నీడ్స్ అన్నింటికీ ప‌నికొచ్చే యాప్స్ ఉన్నాయి. అవేంటో చూడండి. 
1.గ్యాస్‌బుడ్డీ GasBuddy
గ్యాస్‌తో న‌డిచే వెహిక‌ల్స్ ఇప్పుడు మ‌నదేశంలోనూ పెరుగుతున్నాయి. అయితే పెట్రోల్‌బంకుల మాదిరిగా గ్యాస్ స్టేష‌న్లు ఎక్క‌డబ‌డితే అక్క‌డ లేవు. మీ స్మార్ట్‌ఫోన్‌లో గ్యాస్‌బుడ్డీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ద‌గ్గ‌ర‌లో ఉన్న గ్యాస్ స్టేష‌న్లు, వాటిలో ఏ గ్రేడ్ గ్యాస్ ఎంత ధ‌ర‌కు దొరుకుతుందో చూపిస్తుంది. మీరు ఆ స్టేష‌న్‌ను సెలెక్ట్ చేస్తే రూట్ డైరెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా తెలియ‌ని ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు ఇది బాగా ఉప‌యోగ‌పడుతుంది.  
2.ప్ల‌గ్ షేర్ PlugShare
ఎలక్ట్రిక్  వెహిక‌ల్స్‌కు ప‌నికొచ్చే యాప్ ఇది.  ద‌గ్గ‌ర‌లో ఎక్క‌డ ఛార్జింగ్ స్టేష‌న్లు ఉన్నాయో చూపిస్తుంది. డీజిల్‌, గ్యాస్ కార్ల‌తో పోల్చితే  ఎల‌క్ట్రిక్ కార్ల సంఖ్య ప్రపంచ‌వ్యాప్తంగా కూడా త‌క్కువే. దానికి త‌గ్గట్టే ఛార్జింగ్ స్టేష‌న్లు కూడా త‌క్కువ ఉంటాయి కాబ‌ట్టి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ ఉన్న‌వారు క‌చ్చితంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉంచుకోవాల్సిన యాప్ ఇది. 
3.స్పీడ్ కెమెరా అండ్ ట్రాఫిక్ Speed Camera and Traffic
 స్పీడ్‌గా వెళ్లి ట్రాఫిక్ లైన్ క్రాస్ చేస్తే లేదా ఏ డివైడ‌ర్‌నో డీకొడితే ఇంకేముంది ట్రాఫిక్ పోలీసులొచ్చి ఫైన్ బాదేస్తారు.  అలా పొర‌పాటున‌ ట్రాఫిక్ లైన్ దాటేసినా ప‌ట్టుబ‌డ‌కుండా ఉండాలంటే స్పీడ్ కెమెరా అండ్ ట్రాఫిక్ చాలా యూజ్‌ఫుల్‌.  దీనిలో బెస్ట్ రాడార్ డిటెక్ట‌ర్స్ చుట్టుప‌క్క‌ల ట్రాఫిక్ పోలీసు బ‌లగం ఉందో లేదో వార్న్ చేస్తుంటాయి.  
4. గ్రీన్ మీట‌ర్  GreenMeter
ఐపాడ్ ట‌చ్‌, ఐఫోన్ల‌లో మాత్ర‌మే యాక్సెస్ అయ్యే యాప్ ఇది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ  వాహ‌నం ఎంత ఫ్యూయ‌ల్ యూజ్ చేస్తోంది. మీరు డ్రైవింగ్ ఎంత స్పీడ్‌లో చేస్తే ఎంత ఫ్యూయ‌ల్ బర్న్ అయి  ఎన్విరాన్‌మెంట్‌ను ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చూపిస్తుంది. దాన్ని బ‌ట్టి మీ వెహిక‌ల్ స్పీడ్‌ను  మీరే నిర్ణ‌యించుకోవ‌చ్చు.

5. డైనోలిషియ‌స్ Dynolicious

మీ కారు పెర్‌ఫార్మెన్స్‌ను  అంచ‌నా వేసే సూప‌ర్ యాప్ ఇది. సున్నా నుంచి 60 కిలోమీట‌ర్ల స్పీడ్ అందుకోవ‌డానికి ఎంత టైం తీసుకుంటుంది?  హార్స్‌ప‌వ‌ర్‌, క్వార్ట‌ర్ మైల్ ఎలాప్స్‌డ్ టైం .. ఇలా వెహిక‌ల్ పెర్‌ఫార్మెన్స్ పారీమీట‌ర‌ల్న్నీ మెజ‌ర్ చేస్తుంది. ఐఫోన్‌లోని ఇన్‌బిల్ట్ యాక్సిల‌రోమీట‌ర్ ద్వారా  వీటిని  మెజ‌ర్ చేయ‌గ‌లుగుతుంది. 

జన రంజకమైన వార్తలు