• తాజా వార్తలు

ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేకున్నా ప‌ని చేసే ఐదు జీపీఎస్ యాప్‌లు తెలుసా?

మీరు ఎక్కడికైనా దూ ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు ఇంట‌ర్నెట్ స‌మ‌స్య ఉంటుంది. మారుమూల ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు అస‌లు మీ ఫోన్‌కు సిగ్న‌ల్స్ కూడా రావు. అంతేకాక అనుకోకుండా మీ ఇంట‌ర్నెట్ డేటా కూడా అయిపోవ‌చ్చు. ఈ స్థితిలో మ‌న‌కు ఇంట‌ర్నెట్ అత్య‌వ‌స‌రం అయితే! ఏదైనా యాప్‌ల‌తో ప‌ని ప‌డితే! నెట్ లేకుండా యాప్‌లు ఇంకేం ప‌ని చేస్తాయి అనుకుంటున్నారా? ..కానీ ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేకుండానే మీ ప‌నులు చేసిపెట్టే జీపీఎస్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మ‌రి ఆ యాప్‌లు ఏమిటో తెలుసుకుందామా!

మ్యాప్స్‌.మి
మీ మొబైల్ ఫోన్లో మ్యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ అప్లికేషన్ పేరే మ్యాప్స్‌.మి. ముందుగా మ‌నం దీన్ని ఫోన్లో డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే ఆఫ్‌లైన్ ద్వారా త‌ర్వాత ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనిలో కొన్ని ఆఫ‌ర్లు పొందాలంటే పెయిడ్ వెర్ష‌న్‌ను ఎంచుకోవాలి. మ్యాప్స్‌.మీ యాప్ ద్వారా మంచి ఉప‌యోగం ఏంటంటే స్పీడ్, ఫ్లూడిటీ. దీని కోసం ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదు. ప్ర‌పంచంలోని అన్ని మ్యాప్‌ల‌ను అందిస్తుంది. దీనిలో ఉన్న ప్ర‌ధాన‌మైన ఉప‌యోగం వేగం, ఫ్రీజ్ కాక‌పోవ‌డం. 

గెలిలియో యాప్‌
ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో చురగ్గా ఉండేవాళ్ల కోసం ఈ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా సైక్లిస్ట్‌లు, ట్రావెల‌ర్స్ లాంటి వాళ్ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ యాప్‌లో యూజ‌ర్లు త‌మకు కావాల్సిన రూట్ల‌ను, ప్లేస్‌ల‌ను సేవ్ చేసుకోవ‌చ్చు. పెయిడ్ వెర్ష‌న్ ద్వారా ఆఫ్‌లైన్‌లో ముందుగానే సేవ్ చేసుకునే అవ‌కాశం ఉంది. రియ‌ల్ టైమ్‌లో మీకు ఈ గెలిలియో యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వేగం, డిస్టెన్స్ క‌వ‌రేజ్ ఆక‌ట్టుకునే అంశాలు.

హియ‌ర్ మ్యాప్స్‌
నోకియా డెవ‌ల‌ప‌ర్ చేసిన హియ‌ర్ మ్యాప్స్ కూడా ట్రెవ‌లింగ్‌లో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్ ఫోన్ల‌లో దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ యాప్‌ను ఉప‌యోగించాలంటే త‌ప్ప‌కుండా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని వ‌ల్ల అన్ని దేశాల‌కు సంబంధించిన మ్యాప్‌ల‌ను ఇన్‌స్టంట్‌గా పొందొచ్చు. 

వేజ్‌
మీరు ఒక కారుని అద్దెకు ఇవ్వాలంటే ఈ యాప్ మీ కోస‌మే. మీరు వెళ్లే దారుల గురించి, మూమెంట్స్ గురించి... మ‌ధ్య‌లో ఎదుర‌య్యే అవ‌రోధాల గురించి కూడా ఈ యాప్ రియ‌ల్ టైమ్‌లో మీకు తెలియ‌జేస్తుంది. యాక్సిడెంట్స్ స‌మాచారాన్ని కూడా యూజ‌ర్లు షేర్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఇది శాటిలైట్ టెక్నాల‌జీ ద్వారా ప‌ని చేస్తుంది. 

సిజిక్‌
మ‌నం వెళ్లే రూట్స్ గురించి... ప్ర‌త్యామ్నాయ రూట్ల గురించి ఇది తెలియ‌జేస్తుంది. మీరెళ్లే రూట్ల‌లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వివ‌రాల‌ను కూడా మీకు ఎప్ప‌టిక‌ప్పుడు వెళ్ల‌డిస్తుంది. రాడార్ టెక్నాల‌జీ ద్వారా ప‌ని చేసే ఈ యాప్‌...పేమెంట్ వెర్ష‌న్‌లో బాగుంటుంది. దీనిలో వాయిస్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్లు మీకు దారి చూపిస్తాయి. రియ‌ల్ టైమ్‌లో స్పీడ్ లిమిట్స్‌, క‌న్స‌ల్ట్ ట్రాఫిక్ లాంటి ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు