• తాజా వార్తలు
  •  

మీ ఏరియాలో బెస్ట్ నెట్‌వ‌ర్క్ ఏదో చెప్పే టిక్‌టిక్ యాప్‌

మ‌నం ఒక ఏరియాలో ఉంటే ఏది బెస్ట్ టెలికాం నెట్‌వ‌ర్కోనో చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే ఒక్కో నెట్‌వ‌ర్క్‌లో ఒక్కో ఇబ్బందులు ఉంటాయి.  మ‌నం వాడుతున్న కొద్దీ ఆ ప్రాబ్లమ్స్ మ‌న‌కు ఎదుర‌వుతూ ఉంటాయి. అందుకే మ‌నం ఏ నెట్‌వ‌ర్క్ ఉత్త‌మ‌మో చెప్ప‌డం క‌ష్టం.  అయితే మన‌కు అందుబాటులో ఉన్న ఉత్త‌మ‌మైన నెట్‌వ‌ర్క్ ఏదో  టెక్నాల‌జీ ద్వారా తెలుసుకుంటే! అదెలా సాధ్యం అంటారా?  టిక్ టిక్ యాప్‌తో సాధ్య‌మే!

ఉత్త‌మ‌మైంది ఏదో చెప్పేస్తుందిలా..
టిక్ టిక్ యాప్ ఏదో ఆకాశం నుంచి ఊడిప‌డి.. స‌మాచారం మ‌న‌కు అందించ‌దు మ‌న‌కు తెలిసిన‌, మ‌న‌కు  సంబంధించిన స‌మాచారాన్ని మొత్తం క్రోడిక‌రించి ఆ డేటా నుంచే మ‌న‌కు కావాల్సిన ఫ‌లితాన్ని అందిస్తుంది. టెలికాం రెగ్యుల‌రేట‌రి అథారిటీ ఆఫ్ ఇండియా విడుద‌ల చేసే నెట్‌వ‌ర్క్ స్పీడ్ వివ‌రాలు, క‌నెక్టివిటీ  లాంటి వివ‌రాల‌ను  బ‌ట్టి ఈ యాప్ ప‌ని చేస్తుంది. ట్రాయ్ వెలువ‌రించిన రిపోర్టుల ఆధారంగా ఫ‌లానా ఏరియాలో   ఏ నెట్‌వ‌ర్క్ స్పీడ్ ఎలా ఉందో అంచ‌నా వేసి.. దాన్ని బ‌ట్టి ఏ నెట్‌వ‌ర్క్ ఉత్త‌మ‌మైందో టిక్ టిక్ చెప్పేస్తుంది.  ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న‌వాళ్లు ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అందుకోసం మీకు కాంటాక్ట్స్‌, లొకేష‌న్, ఎస్ఎంఎస్‌, రీడ్ అండ్ మోడిఫై ఫైల్స్‌కు  ప‌ర్మిష‌న్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

ఉప‌యోగాలేంటంటే.. 
టిక్ టిక్ యాప్ స‌మ‌ర్థంగా ప‌ని చేయాలంటే కొన్ని వ‌న‌రులు కావాల్సి ఉంటుంది.  లొకేష‌న్ అందులో ముఖ్య‌మైంది. అంటే మీరు ఉండే లొకేష‌న్ ఎక్క‌డ ఉందో తె లియాంటే ఈ యాప్ మొబైల్ ద్వారానే గుర్తిస్తుంది. స్పామ్ కాల‌ర్స్‌, బాలెన్స్ క‌ట్స్ నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు మీకు ఎప్ప‌టిక‌ప్పుడు టోల్ ఫ్రీ ఎస్ఎంఎస్‌లు పంపిస్తుంది. మీ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన బెస్ట్ ఆఫ‌ర్ల‌ను కూడా తెలియ‌జేస్తుంది.  అప్ప‌టిక‌ప్పుడే యాప్ ఇన్‌సైట్స్‌ను  షేర్ చేస్తుంది. ఇదే కాక  కీలక‌మైన స‌మాచారాన్ని మీ మెయిల్ ఐడీకి పంపిస్తుంది.  కాంటాక్ట్స్‌, కాల్ లాగ్  ఫీచ‌ర్ మీరు ఎయిరో ప్లేన్ మోడ్‌లో ఉన్నా కూడా ప‌ని చేస్తుంది.        

జన రంజకమైన వార్తలు