• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్5 ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ యాప్స్ మీ కోసం

వాయిస్ అసిస్టెంట్లు వ‌చ్చాక మొబైల్‌లో ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం మ‌రింత ఈజీ అయిపోయింది. మీ వాయిస్‌ను రిక‌గ్నైజ్ చేసి మీ నోటిమాట‌తో ప‌నిచేసి పెట్టే వాయిస్ అసిస్టెంట్లు వ‌చ్చేశాయి. వీటిలో బెస్ట్ 5 ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ యాప్స్‌ను ఈ  ఆర్టిక‌ల్‌లో ప‌రిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి. 
కొర్టానా (cortana)
మైక్రోసాఫ్ట్‌కు చెందిన కొర్టానా.. ఆండ్రాయిడ్ బెస్ట్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ యాప్స్‌లో ఒకటి. వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా మీ ఫోన్లో కొన్ని టాస్క్‌ల‌ను ఆటోమేటిగ్గా నిర్వహిస్తుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌  చేసి ఓపెన్ చేసిన తర్వాత, మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్త‌యిన త‌ర్వాత రికార్డ్ బటన్‌ను ప్రెస్ చేసినట్లయితే వాయిస్ కమాండ్స్ ప్రారంభం అవుతాయి. ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్‌కు కొర్టానాను యాడ్ చేయవచ్చు. అంతేకాదు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌కుండానే యూజ్ చేసుకోవ‌చ్చు కూడా.  ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. వై-ఫైని ఎనేబుల్/డిసేబుల్ చేయడానికి ఇది సపోర్ట్ చేయదు.
అటోమెటిగ్గా చేసే పనులు:  జోక్స్, అద్భుత కథలు, టైం, డేట్, వెదర్ వివరాలు అడగవచ్చు.
* ప్రీ ఇన్‌స్టాల్ చేసి, డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌ను ఓపెన్ చేయొచ్చు. 
* ఫోన్ కాల్స్ చేయొచ్చు. మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపించవచ్చు.
* సెలూన్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కడున్నాయో వాటి లొకేష‌న్ కూడా తెలుసుకోవచ్చు.
జార్విస్ ( Jarvis)
 జార్విస్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ప‌నికొచ్చే మరొక ఫ్రీ బెస్ట్ వాయిస్ అసిస్టెంట్ యాప్.  కొర్టానా మాదిరిగానే ఈ యాప్ కూడా ఆటోమేటిగ్గా యాక్షన్స్ మొదలుపెడుతుంది. ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు వాయిస్ కమాండ్స్  ఇవ్వడానికి ఉపయోగించే ఫ్లాషింగ్ హెగ్జాగాన్ బటన్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేసిన తర్వాత ఎలాంటి యాక్షన్ చేయాలోజార్విస్ తో చెప్పవచ్చు.  అయితే ఈ యాప్ కమాండ్స్ లిమిటెడ్‌గానే ఉన్నాయి. 
ఏం చేయొచ్చ: * వాయిస్ కమాండ్స్ తో రిమైండర్లను సెట్ చేయవచ్చు.
* గూగుల్ క్యాలెండర్ కు ఈవెంట్లు యాడ్ చేయవచ్చు.
* ఫ్లాష్ లైట్ ఆన్,ఆఫ్ చేయవచ్చు.
* వెదర్ అప్‌డేట్ తెలుసుకోవచ్చు. ట్రెండింగ్ న్యూస్ చదవొచ్చు.
* వైఫైని ఎనేబుల్, డిసేబుల్ చేయడానికి  కూడా ఉపయోగించుకోవచ్చు.
లైరా (lyra)
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత, మీరు చాట్ లాంటి ఇంటర్ స్పేస్‌ను చూస్తారు. ఇక్కడ రికార్డ్ బటన్‌ను లైరాతో మాట్లాడటానికి ఉపయోగించవచ్చు. కొర్టానా, జార్విస్ మాదిరిగానే ఇది కూడా మీ ఫోన్లో ఆటోమేటిగ్గా పనిచేస్తుంది.   వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించకుండా యాక్షన్స్ చేయడానికి  మీ కమాండ్‌ను టైప్ చేయగ‌ల‌గ‌డం లైరాలో ఉన్న బెస్ట్ ఫీచర్స్‌లో ఒక‌టి.
లైరా యాక్షన్స్ 
* ట్విట్టర్లో నేరుగా ట్వీట్లను పోస్ట్ చేయవచ్చు. యాప్స్ ఓపెన్ చేయొచ్చు.
* మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ చేయవచ్చు.
* యూట్యూబ్ లో వీడియోలు ప్లే చేయొచ్చు.  వెబ్‌లోఏదైనా సెర్చ్ చేయవచ్చు.
రాబిన్ ( robin)
సింపుల్ వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ప‌నులు చేసుకోవ‌డానికి ప‌నికొస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్, నావిగేషన్ మొదలైన టాస్క్‌ల్లో ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
రాబిన్ వాయిస్ కమాండ్స్...
* ఏ దిశలో నుంచైనా కావాల్సిన స్థానాన్ని కనుగొనవచ్చు.
*  ఫోన్ కాల్స్ చేయొచ్చు. మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపించవచ్చు.
* వెదర్ అప్‌డేట్ తెలుసుకోవచ్చు. ట్రెండింగ్ న్యూస్ చదవొచ్చు.
స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్
ఆండ్రాయిడ్ కోసం ఉపయోగకరమైన మరొక యాప్ స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్. మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనులు నిర్వహిస్తుంది. మీకు ఎలాంటి కమాండ్స్ కావాలో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సోషల్ పోస్టులు, ఫేస్‌బుక్ వాల్ పోస్ట్‌లు వాయిస్ క‌మాండ్స్‌తో  ఓపెన్ చేయాలంటే ప్రో వెర్షన్ తీసుకోవాలి.
* వైఫై, బ్లూటూత్, ఆన్ చేయడం.
* ఎస్ఎంఎస్,ఫోన్ కాల్స్ చేయడం.
* యాప్స్ ఓపెన్ చేయడం
*  యాడ్, ఎడిట్, సేవ్, డిలిట్ నోట్స్ , బ్యాటరీ లెవల్ తెలుసుకోవడం, స్క్రీన్ వేక్ అప్‌, ఎలాంటి సర్వీసు అయినా నిలిపివేయడం లాంటి చర్యలకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 
 

జన రంజకమైన వార్తలు