• తాజా వార్తలు

ఆండ్రాయిడ్‌లో  డౌన్‌లోడ్ స్పీడ్ చాల‌ట్లేదా? అయితే ఈ  ఐడీఎమ్‌లు మీ కోస‌మే..

ఇండియ‌న్ మొబైల్ ఇండ‌స్ట్రీలో కంపెనీల ప్రైస్ వార్ పుణ్య‌మా అని మ‌న‌కు డేటా బాగా చౌక‌గా దొరుకుతుంది. నెల‌కు 150 రూపాయ‌లు ఖ‌ర్చుపెడితే రోజూ 1జీబీ ఫ్రీ డేటా వచ్చేస్తోంది. కానీ మొబైల్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్ లాంటివి మాత్ర‌మే చూసేవారు రోజంతా 300, 400 ఎంబీ డేటా కంటే ఎక్కువ వాడ‌డం లేదు. మిగిలిన డేటా త‌ర్వాత రోజుకు క్యారీ ఫార్వ‌ర్డ్ కాదు కాబ‌ట్టి మీకు న‌చ్చిన పాట‌లో, వీడియో క్లిప్స్‌, అదీ కాదంటే ఒక సినిమానో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. కానీ ఓ సినిమా డౌన్‌లోడ్ చేద్దామ‌ని పెడితే గంట‌ల కొద్దీ టైం తీసుకుంటుంది. అయితే ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో మీ డౌన్‌లోడ్ స్పీడ్ పెంచ‌డానికి ఇంట‌ర్నెట్ డౌన్‌లోడ్ మేనేజ‌ర్ (IDM )ల‌ను వాడుకోవచ్చు. మీ డివైస్‌లో ఇంట‌ర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెంచే బెస్ట్ ఐడీఎమ్ ల వివ‌రాలు ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకోండి..
ఐడీఎమ్ ఎలా ప‌ని చేస్తుంది?
ఐడీఎమ్ అంటే ఇంట‌ర్నెట్ డౌన్‌లోడ్ మేనేజ‌ర్‌. ఇది పెద్ద ఫైల్స్‌ను కొన్ని పార్ట్‌లుగా విడ‌గొడుతుంది.  ప్ర‌తి పార్ట్‌ను డిఫ‌రెంట్ క‌నెక్ష‌న్‌, స‌ర్వ‌ర్‌తో డౌన్‌లోడ్ చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు 1జీబీ ఫైల్‌ను డౌన్‌లోడ్‌చేస్తే ఐడీఎం దాన్ని 16 భాగాలుగా విభజించి డౌన్‌లోడ్ చేస్తుంది.  ఫైల్ సైజ్ త‌గ్గుతుంది కాబ‌ట్టి డౌన్‌లోడ్ స్పీడ్‌గా అవుతుంది.  అన్ని పార్ట్‌లూ డౌన్‌లోడ్ అయిపోయాక వాట‌న్నింటినీ క‌లుపుతుంది.దీంతో మ‌న‌కు ఒకే ఫైల్‌గా డౌన్‌లోడ్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ ఐడీఎమ్‌ల్లో మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి క‌నెక్ష‌న్ల సంఖ్య పెంచే కొద్దీ డౌన్‌లోడ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఫైల్‌ను మ‌ధ్య‌లో మ‌నం డౌన్‌లోడ్ చేయ‌డం ఆపేస్తే  అక్కడి నుంచే స్టార్ట‌య్యేలా రెజ్యూమ్ కూడా చేసుకోవ‌చ్చు.ఇక బెస్ట్ ఐడీఎమ్‌ల వివ‌రాలివీ..
1.అడ్వాన్స్‌డ్ డౌన్‌లోడ్ మేనేజ‌ర్ Advanced Download Manager (ADM)
ఆండ్రాయిడ్‌కు సంబంధించిన ఐడీఎంల్లో ఇది బెస్ట్‌.   ప్లే స్టోర్ నుంచి దాదాపు 5 కోట్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి. 
*ఏడీఎంతో మూడు ఫైల్స్ ఒకేసారి స్పీడ్ ఏ మాత్రం త‌గ్గ‌కుండా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 
* ఇది మీ ప్ర‌తి ఫైల్‌ను 9 పార్ట్‌లుగా డివైడ్ చేసి డౌన్‌లోడ్ చేస్తుంది.
* ఇది మీ బ్రౌజ‌ర్‌తో ఆటోమేటిగ్గా ఇంటిగ్రేట్ అవుతుంది. కాబ‌ట్టి మీరు డౌన్‌లోడ్ బ‌ట‌న్ నొక్క‌గానే ఏడీఎం యాక్టివేట్ అయిపోతుంది.
* ఏడీఎంతో మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. డౌన్‌లోడ్‌ను రెజ్యూమ్ చేసుకోవ‌చ్చు.
* 2జీబీ కంటే పెద్ద ఫైల్స్‌ను కూడా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వైఫై లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఏడీఎం ఉప‌యోగ‌ప‌డుతుంది.
2.డౌన్‌లోడ‌ర్ అండ్ ప్రైవేట్ బ్రౌజ‌ర్ Downloader And Private Browser (DPB)
 ప్లే స్టోర్‌లో Tools కేటగిరీలో ఇది దొరుకుతుంది.  ఈ డీపీబీతో వీడియో, మూవీస్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకుని మీరు మాత్ర‌మే దీన్ని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. మీ డౌన్‌లోడ్ ఫైల్స్‌ను ప్రైవేట్ ఫోల్డ‌ర్‌లో సేవ్‌చేసుకుని పాస్‌వ‌ర్డ్‌తో ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చు. యాప్‌లో ఉన్న వీడియో ప్లేయ‌ర్‌తో అక్క‌డే ఆఫ్‌లైన్‌లో వీడియో ప్లే చేసుకోవ‌చ్చు.అయితే యూట్యూబ్ వీడియోల‌ను డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోలేక‌పోవ‌డం దీనిలో మైన‌స్‌పాయింట్‌.
3.ఫాస్ట్ డౌన్‌లోడ్ మేనేజ‌ర్ (Fast Download Manager)
ఇది కూడా మంచి ఐడీఎమ్‌.ఒకేసారి  ఎన్ని ఫైల్స‌యినా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. డౌన్‌లోడ్‌ను రెజ్యూమ్ చేసుకోవ‌చ్చు. ఏ బ్రౌజ‌ర్‌తోనే ప‌ని చేయ‌డం, పెద్ద ఫైల్స్‌ను స‌పోర్ట్‌చేయ‌డం ఈ ఫాస్ట్ డౌన్‌లోడ్ మేనేజ‌ర్ స్పెషాలిటీలు.
ఇవే కాక డౌన్‌లోడ్ యాక్సిల‌రేట‌ర్ ప్ల‌స్ Download Accelerator Plus (DAP), డౌన్‌లోడ్ యాక్సిల‌రేటర్ (Download Accelerator) ల‌ను కూడా ట్రై చేయొచ్చు.

జన రంజకమైన వార్తలు