• తాజా వార్తలు

ఏమిటీ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్‌? అన్ని యాప్స్ దారి వీటి వైపేనా?

ఇండియాలో పెద్ద ఈకామ‌ర్స్ సైట్ల‌లో ముందుండే పేరు ఫ్లిప్‌కార్ట్‌.  2015లో ఫ్లిప్ కార్ట్  మొబైల్ యాప్ మీదే దృష్టి పెట్టింది. ఒకానొక టైంలో వెబ్ ఫ్లాట్‌ఫాంను కంప్లీట్‌గా ష‌ట్ డౌన్ చేయాల‌నుకుంది. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్  యూజ‌ర్ల‌లో అత్య‌ధిక శాతం మంది మొబైల్ యాప్ వాడేవారే. అయితే  మొబైల్ యాప్‌.. వెబ్ ఫ్లాట్‌ఫాం అంత మంచి ఎక్స్‌పీరియ‌న్స్‌ను యూజ‌ర్స్‌కు ఇవ్వ‌డం లేద‌ని ఫ్లిప్‌కార్ట్ గుర్తించింది. ఈ ప‌రిస్థితిలో  అమ‌ర్ న‌గ‌రం, ఆయ‌న టీమ్ క‌లిపి మొబైల్ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు.  కొన్ని నెల‌ల‌పాటు మార్కెట్ ట్రెండ్‌, యూజ‌ర్ ఇంట్ర‌స్ట్‌లు, యాప్‌లో లేనివేంటి, వెబ్‌లో ఉన్న‌వేంటి రీసెర్చ్ చేసి మొబైల్ వెబ్‌పేజెస్‌ను రూపొందించారు. ఇది  వెబ్‌పేజీయే కానీ మొబైల్ వెబ్‌సైట్‌.  మొబైల్ మెమ‌రీకి స‌రిప‌డే స్థాయిలో ఉంటుంది. కానీ యూజ‌ర్‌కు వెబ్‌పేజీలో ఉన్నంత  కంఫ‌ర్ట్ ఉంటుంది.  దీన్నే ఇప్పుడు ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ ( PWA) అని ఇంకా సులువుగా చెప్పాలంటే ఫ్లిప్‌కార్ట్ లైట్ అని పిలుస్తున్నారు. 
 
సూప‌ర్ హిట్ట‌యింది 
ఈ ఫ్లిప్‌కార్ట్ లైట్ ఇప్పుడు ఈ కంపెనీ ట్రాన్సాక్ష‌న్లలో మొబైల్ యాప్ త‌ర్వాత సెకండ్ లార్జెస్ట్ ఛాన‌ల్ గా నిలిచింది.  ఫ్లిప్ కార్ట్ ఆండ్రాయిడ్ యాప్  10 ఎంబీ సైజ్‌లో ఉంటే ఈ మోబైల్ వెబ్ యాప్ జ‌స్ట్ 100 కేబీ ఉంటుంది. అంటే  ఆండ్రాయిడ్ యాప్ క‌న్నా 100 రెట్లు చిన్న‌ది.  ఇక ఐవోఎస్‌తో పోల్చితే 300 రెట్లు త‌క్కువ మెమ‌రీతో  మొబైల్ వెబ్ యాప్ ప‌నిచేస్తుంది.   ఫ్లిఫ్‌కార్ట్ కొత్త కస్ట‌మ‌ర్ల‌లో 70% మంది టౌన్స్‌, చిన్న సిటీల వారే. వీళ్లు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచే నెట్ యాక్సెస్ చేస్తారు. అందుకే మొబైల్‌లోనే త‌క్కువ మెమ‌రీ తో వెబ్‌పేజీఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే ఈ మొబైల్ వెబ్‌పేజీల‌ను డిజైన్ చేశారు. 
 
ఇంత‌కీ ఏమిటీ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్  
ఇండియాలో ఓ చిన్న టౌన్‌ను తీసుకోండి. అక్క‌డ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ అంత సూప‌ర్‌గా ఉండ‌దు. అందులోనూ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ ఉండే చిన్న ప‌ట్ట‌ణాల్లో ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ యాప్స్ న‌డ‌వ‌డం కొద్దిగా క‌ష్టం. ఈ రెండింటికీ స‌మాధానంగానే ఈ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ (PWA)ను క్రియేట్ చేశారు. త‌క్కువ స్పేస్ తీసుకుంటుంది. సైజ్ త‌క్కువ కాబ‌ట్టి సాదాసీదా నెట్ స్పీడ్‌లోనూ న‌డుస్తుంది.  
అవ‌స‌ర‌మేంటి?
మ‌న దేశంలో 80% ప్ర‌జ‌లు ఇంట‌ర్నెట్‌ను మొబైల్ ద్వారానే యాక్సెస్ చేయ‌గ‌లుగుతున్నారు.  అదీ లోకాస్ట్  ఆండ్రాయిడ్ ఫోన్ల మీదే ఎక్కువ‌. అందుకే PWAల‌ను అన్ని కంపెనీలు యాక్వైర్ చేసుకొంటున్నాయి. యాప్ లైక్ ఎక్స్‌పీరియ‌న్స్‌, వెబ్ నోటిఫికేష‌న్స్‌, హోం స్క్రీన్ ఐకాన్స్‌, లాగిన్స్‌, సైట్ స్పీడ్ ఆప్టిమైజేష‌న్ ఇవ‌న్నీ ఈ PWAల్లో వెబ్ సైట్ స్థాయిలో ఉండ‌డంతో ఇవి గేమ్ ఛేంజ‌ర్లు అవుతున్నాయ‌ని జాబ్ పోర్ట‌ల్ లింక్‌డిన్ ఆఫీస‌ర్ దత్తా చెప్పారు.  ఓలా, బుక్ మై షో, మింత్రా, ట్విట్ట‌ర్‌, లింక్డిన్ లాంటి పాపుల‌ర్ సైట్ల‌న్నీ ఇప్పుడు ఈ PWAల బాట ప‌ట్టాయి. ఫ్లాట్‌ఫాం ఏదైనా కానీ యూజ‌ర్‌ను ఆకట్టుకోవాల‌న్న‌దే వాటి సూత్రం. అందుకే PWAలు ముందు ముందు మ‌రింత హిట్ట‌వ‌డం ఖాయ‌మంటున్నారు.

జన రంజకమైన వార్తలు