• తాజా వార్తలు
  •  

మైక్రోసాఫ్ట్ మీ ద‌గ్గ‌ర నుంచి కొట్టేస్తున్న‌దేంటో ప‌సిగ‌ట్టే యాప్‌

టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అవుతున్న‌కొద్దీ ప్రైవ‌సీ త‌గ్గిపోతుంది. ఇంట‌ర్నెట్ పెనిట్రేష‌న్ పెరుగుతున్న‌కొద్దీ స్మార్ట్‌ఫోన్‌, కంప్యూట‌ర్ ఇలా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లోన‌యినా మ‌న ప్ర‌తి యాక్ష‌న్ ఎక్క‌డోచోట స్టోర‌యిపోతుంది. మ‌న సెర్చింగ్‌, ట్రాన్సాక్ష‌న్స్ అన్నీ బ్రౌజ‌ర్ స‌ర్వ‌ర్‌లో సేవ్ కాకుండా ప్రైవేట్ సెర్చ్‌లు, ఇన్‌కాగ్నిటో మోడ్‌లు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి.  పాస్‌వ‌ర్డ్‌లు ఎక్క‌డా స్టోర‌వ‌కుండా ఉండ‌డానికి వ‌ర్చువ‌ల్ కీ బోర్డులు వాడ‌మ‌ని ఎన్నో సైట్లు మ‌నల్ని హెచ్చ‌రిస్తుంటాయి. మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ విండోస్ 10 ఓఎస్‌లోనూ ఇలాంటి ప్రైవ‌సీ ప్రాబ్ల‌మ్ ఉంద‌ని కంప్ల‌యింట్స్‌రావ‌డంతో దీనికి విరుగుడుగా మైక్రోసాఫ్టే ఓ యాప్‌ను రిలీజ్‌చేసింది. 
విండోస్ డ‌యాగ్న‌స్టిక్ డేటా వ్యూయ‌ర్ 
 మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను లాంచ్ చేసిన‌ప్ప‌టి నుంచి అందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న కీ లాగ‌ర్ మీరు కీబోర్డులో టైప్ చేసిన ప్ర‌తి అక్ష‌రాన్ని, అంకెను కూడా సీక్రెట్‌గా ప‌సిగ‌ట్టేస్తుంద‌ని బోల్డ‌న్ని కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయి. యూజ‌ర్ల డేటా వినియోగాన్ని కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ ద్వారా ప‌సిగ‌డుతోంద‌ని కూడా చాలామంది యూజ‌ర్లు కంప్ల‌యింట్స్ చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో విండోస్ 10 యూజ‌ర్ల ప్రైవ‌సీని తాము దెబ్బ‌తీయ‌డం లేద‌ని నిరూపించుకోవ‌డానికి విండోస్ డ‌యాగ్న‌స్టిక్ డేటా వ్యూయ‌ర్ (Windows Diagnostic Data Viewer) అనే యాప్‌ను రిలీజ్ చేసింది.
నిజంగా ప‌నికొస్తుందా?
ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు కొంత‌సేపు సిస్టం వాడిన త‌ర్వాత మీ డేటాను విండోస్ ఎక్క‌డ‌యినా స్టోర్ చేస్తుందా లేదా తెలుసుకోవ‌చ్చు. ఈ యాప్ ఓపెన్‌చేస్తే చాలా కోడ్ నేమ్స్‌,  అంకెలు క‌నిపిస్తాయి.అంతే త‌ప్ప ఎక్క‌డా మీ మెసేజ్‌లు,  ఈ మెయిల్స్‌లో ఉన్న టెక్స్ట్‌గానీ, పాస్‌వ‌ర్డ్స్‌, యూజ‌ర్ నేమ్స్ గానీ క‌నిపించ‌వు. అయితే ఇది చాలా టెక్నిక‌ల్‌గా ఉంటుంది.  సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌, డెవ‌ల‌ప‌ర్లు, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 టీమ్‌లో మెంబ‌ర్లు మాత్ర‌మే దీన్నిడీకోడ్ చేయ‌గ‌లుగుతారు.అలా డీకోడ్ చేస్తేనే నిజంగా అందులో ఏముందో తెలుస్తుంది.అయితే ఇలా మైక్రోసాఫ్టే ఓ యాప్‌ను రిలీజ్ చేయ‌డం వల్ల  మ‌న ప్రైవసీకి విండోస్‌10తో ఎలాంటి ఇబ్బందీ లేదు అనే ఒక ఫీల్ మాత్రం ఉంటుంది.

జన రంజకమైన వార్తలు