బెంగళూర్ కు చెందిన రిట్జో హెల్త్ కేర్ అనే ఒక స్టార్ట్ అప్ రిట్జో అనే ఒక యాప్ ను లాంచ్ చేసింది. మన యొక్క హెల్త్ రికార్డు అంటే మన ఆరోగ్య వివరాలు , పాత హెల్త్ రికార్డు లను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. కేవలం మీది మాత్రమే గాక మీ కుటుంబ సభ్యులందరి హెల్త్ రికార్డు లను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.ఈ కంపెనీ చెబుతున్న దాని ప్రకారం మీయొక్క హెల్త్ రికార్డు లను మేనేజ్ చేయడం , షేర్ చేయడం, మరియు ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం లాంటి వాటికీ యాక్సెస్ చేసే ఒక ఫ్లాట్ ఫాం ను ఇది కల్పిస్తుంది.
ఈ పోర్టల్ ను ఉపయోగించి మీ ఆరోగ్య సమాచారానికి సంబంధించి అలెర్ట్ లు మరియు నోటిఫికేషన్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారునికి ఒక సంపూర్ణ హెల్త్ మేనేజ్ మెంట్ సిస్టం లాగా పూర్తీ ఉచితంగా లభించనుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.
ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లలో అందుబాటులో ఉండనుంది.
మీ మెడికల్ రికార్డు ల యొక్క పిక్చర్ లను ఒక్క క్లిక్ ద్వారా క్యాప్చర్ చేసి లేదా ఆయా డాక్యుమెంట్ లను మీ డివైస్ కు అప్ లోడ్ చేసి మీ రిట్జో ఎకౌంటు లో దానిని సేవ్ చేసుకోవాలి. డాక్టర్ విజిట్ లు, ప్రిస్క్రిప్షన్ లు, బిల్స్, రిపోర్ట్ , ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు, మెడికేషన్, రిమైండర్ లు మొదలైన వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.