• తాజా వార్తలు

బెస్ట్ ఆండ్రాయిడ్ డయలర్ యాప్స్ మీకోసం

 

ప్రస్తుతం లభిస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో దాదాపుగా ఎక్కువశాతం నాణ్యమైన డయలర్ యాప్ లను కలిగి ఉంటున్నాయి. అయితే కొన్ని స్మార్ట్ ఫోన్ లు మాత్రం ఒక మంచి డయలర్ యాప్ లను తమ వినియోగదారులకు అందించలేకున్నాయి. అలాంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వారికోసమే ఈ ఆర్టికల్. మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో సరైన డయలర్ యాప్ లేదా? అయితే మీకోసం ఈ ఆర్టికల్ లో మొత్తం 12 రకాల డయలర్ యాప్ ల గురించీ వాటి ఫీచర్ ల గురించీ వివరించబోతున్నాము.

సింపుల్ గా ఉండే డయలర్ యాప్ లు

  1.  ఎక్స్ డయలర్  

ఆండ్రాయిడ్ యూజర్ లకు ఇది ఒక అద్భుతమైన డయలర్ యాప్ గ చెప్పుకోవచ్చు. చూడడానికి సింపుల్ గా ఉన్నప్పటికే ఇందులో కొన్ని అదనపు ఫీచర్ లు కూడా ఉంటాయి.

ఫీచర్ లు

సింపుల్ మరియు స్మూత్ ఇంటర్ ఫేస్

వన్ టచ్ కాలింగ్ మరియు మెసేజింగ్ ల కోసం ఇన్ బిల్ట్ జెస్చర్ లు

మీరు కాల్స్ ను కనెక్ట్ లేదా డిస కనెక్ట్ చేసినపుడు వైబ్రేషన్ ఆప్షన్

జియో కోడర్ లాంటి థీమ్స్ మరియు ప్లగ్ ఇన్ లు అందుబాటులో ఉండడం

  1. సింపుల్ డయలర్

పేరుకు తగ్గట్లే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక టిపికల్ డయలర్ యాప్ లో ఉండే ప్రతీ ఫీచర్ ఇందులో ఉంటుంది.

ఫీచర్ లు

కాల్ బ్లాకింగ్ మరియు గ్రూప్ టెక్స్టింగ్

ఆకర్షణీయమైన కాంటాక్ట్ మేనేజ్ మెంట్ ,మెర్జింగ్, డూప్లికేట్ ఫైండింగ్

ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ కాంటాక్ట్స్ బ్యాక్ అప్

స్మార్ట్ T9 డయలర్ మరియు స్మార్ట్ క్లీన్ అప్ ఆప్షన్స్

  1. రాకెట్ డయల్ డయలర్

అనేకమంది యూజర్ లు ఉపయోగిస్తున్న ఈ యాప్ రెగ్యులర్ గా అప్ డేట్ అవుతూ ఉంటుంది. సింప్లిసిటీ తో పాటు మంచి ఫీచర్ లు కూడా ఇందులో ఉంటాయి.

ఫీచర్ లు

వన్ టచ్ బ్యాక్ అప్ రీ స్టోర్

కాలర్ ఐడి మరియు ఇన్ కాల్ నోట్ టేకింగ్

T9 సెర్చ్ మరియు కాల్ కన్ఫర్మేషన్

గ్రూప్ మేనేజ్మెంట్

  1. కాంటాక్ట్స్+

ఫీచర్ లు

మీ స్టోర్డ్ కాంటాక్ట్ లను సురక్షంగా ఉంచుతుంది.

ఇన్ బిల్ట్ కాలర్ ఐడి మరియు కాల్ బ్లాకింగ్ ఇంజిన్స్

డీప్ ఇంటిగ్రేషన్ విత్ వాట్స్ అప్,మెసెంజర్, డ్యుయో etc

 

ఫీచర్ లు ఎక్కువగా ఉండే డయలర్ యాప్ లు

  1. డ్రూప్

ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్

ఇన్ కమింగ్ నెంబర్ లను గుర్తించడానికి కాలర్ ఐడి ట్రాకర్

కాంటాక్ట్ లకు GIF స్టిక్కర్ లను సెట్ చేసుకునే అవకాశం

వాట్స్ అప్, డ్యుయో లాంటి వాటికీ మల్టిపుల్ ఎకౌంటు ఇంటిగ్రేషన్

  1. జెన్ UI డయలర్

అన్ వాంటెడ్ కాల్ లను బ్లాక్ చేయడానికి ఇన్ బిల్ట్ ఫీచర్

కాంటాక్ట్ లిస్టు మరియు కాల్ లాగ్ లకోసం పాస్ వర్డ్ ప్రొటెక్షన్

మెర్జింగ్ మరియు డూప్లికేట్ ఫైండింగ్ లాంటి కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఫీచర్ లు

థీమ్స్ మరియు కస్టమైజేషన్ లు ఉపయోగించుకునే అవకాశం

  1. ట్రూ కాలర్ : కాలర్ ఐడి మరియు డయలర్

స్పాం కాల్స్ మరియు టెలి మార్కెటింగ్ కాల్స్ ను బ్లాక్ చేసుకునే అవకాశం

ఇన్ కమింగ్ కాల్ వచ్చిన నెంబర్ యొక్క వివరాలు తెలుసుకునే అవకాశం

కాల్ బ్లాకింగ్

థీమ్ సపోర్ట్ మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్

  1. OS9 ఫోన్ డయలర్

వాట్స్ అప్ మరియు ఇతర IM ఎకౌంటు లతో అత్యుత్తమ ఇంటిగ్రేషన్

కాల్ బ్లాకర్ మరియు కాలర్ ఐడి హైడింగ్

డ్యూయల్ సిమ్ మేనేజ్మెంట్ మరియు స్పీడ్ డయల్

సులభంగా ఉపయోగించగలిగే T9 సెర్చ్ ఎనేబుల్డ్ డయల్ ప్యాడ్

 

కాంటాక్ట్ మేనేజ్ మెంట్ ఫీచర్ లతో కూడిన ఆండ్రాయిడ్ డయలర్ యాప్ లు

  1. Eyecon డయలర్

దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లతో ఇంటిగ్రేషన్

నావిగేట్ చేయడానికి సులువుగా ఉండే విజువల్ బేస్డ్ డిజైన్

స్పామ్స్ ను దూరంగా ఉంచే కాలర్ ఐడి ఫీచర్ లు

గ్లోబల్ అడ్రెస్ బుక్ ను ఎడిట్ చేసుకునే అవకాశం

  1. కాంటాక్ట్స్ అడ్రస్ బుక్

    వాట్స్ అప్ మరియు ఇతర IM ఎకౌంటు లతో అత్యుత్తమ ఇంటిగ్రేషన

    స్టేట్ అఫ్ ది ఆర్ట్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్

ఫేస్ బుక్ ద్వారా కూడా కాంటాక్ట్ లను సింక్ చేసుకునే అవకాశం

తక్కువ పరిమాణంలో ఉండే యాడ్ లు

  1. మెట్రో ఫోన్ డయలర్

డార్క్ థీమ్స్ కు సరిపోయే మెట్రో UI డిజైన్

స్టాండర్డ్ మరియు అడ్వాన్స్డ్ కాంటాక్ట్ ఆపరేషన్స్

12 కలర్ బేస్డ్ థీమ్ సెలక్షన్

పూర్తిగా ఉచితం

  1. ట్రూ ఫోన్ డయలర్                                                                                                                      

పవర్ ఫుల్ కాంటాక్ట్ మేనేజర్

డ్యూయల్ సిమ్ మరియు థీమ్స్ కోసం ఎక్స్టెండ్ చేసిన సపోర్ట్

రీసెంట్ కాల్ సెక్షన్ కు స్మార్ట్ గ్రూపింగ్

T9 సెర్చ్ మరియు బెటర్ నావిగేషన్ కంట్రోల్ లు

 

జన రంజకమైన వార్తలు