• తాజా వార్తలు

చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

సోషల్ మీడియాలో సెల్ఫీల హావా తగ్గి...జిఫ్ కల్చర్ బాగా పెరిగింది. మనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం జిఫ్ లే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. మీరూ అలాంటి జిఫ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా..సింపుల్. మీరు సొంతగా జిఫ్ లను క్రియేట్ చేసుకునేందుకు 6 ఉచిత యాప్స్ అందిస్తున్నాం. ఈ యాప్స్ తో ఎంచక్కా రకరకాల జిఫ్ లను క్రియేట్ చేసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

1. జిఫ్ ఎక్స్(gif x. Ios, free)

జిఫ్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకునేందుకు జిఫ్ ఎక్స్ యాప్ చాలా సులభంగా ఉంటుంది. ఈ యాప్ ఆన్ లైన్లో ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. కెమెరా రోల్ నుంచి వీడియోను సెలక్ట్ చేసుకున్నాక...ట్వీకింగ్ క్లిప్ ను ఉపయోగించి స్టార్ట్ చేయండి. ఈ వీడియోకు మీకు నచ్చిన ఎఫెక్ట్స్ తోపాటు మాస్క్ లు కూడా యాడ్ చేసుకోవచ్చు. గిఫి నుంచి జిఫ్ లను ఇంపోర్ట్ చేయాలనుకుంటే....దానికి ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు కావాల్సిన సందర్భాల్లో జిఫ్ కాకుండా ఇమేజ్ ఫైల్ గా  వాడుకోవచ్చు.

2. జిఫి క్యామ్ ( giphy cam. Ios/android, free)

జిఫి క్యామ్. జిఫ్ సెర్చ్ ఇంజిన్లో ఇది చాలా పెద్ద యాప్. జిఫ్ లను క్రియేట్ చేయడానికి సొంతంగా యాప్ ను కూడా కలిగి ఉంది. జిఫి క్యామ్ టూల్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

ఈ యాప్ వీడియో, ఇమేజ్ లను జిఫ్ లుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇమేజ్ లకు సిల్లీ స్టిక్కర్స్, టెక్ట్స్, ఫ్రేమ్స్ యాడ్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఈ యాప్ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది.

3. జిఫ్ మేకర్ (GIF MAKER IOS,FREE)

జిఫ్ మేకర్... ఈ యాప్ ఆన్ లైన్లో ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. దీనితో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫోటోలతో పర్సనల్ జిఫ్ లుగా క్రియేట్ చేసుకుని షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. బర్త్ డే మెసేజేస్, క్యూట్ థింగ్స్, ఫన్నీ జిఫ్ లను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. అయితే ఈ యాప్ మిగతా జిఫ్ మేకింగ్ యాప్స్ వలే ప్రాక్టికల్ గా ఉండదు. ట్వీకింగ్ ఫ్రేమ్ స్పీడ్ గా ఉండటంతోపాటు...చాలా ఫిల్టర్లను యాడ్ చేసుకోనేందుకు ఆప్షన్స్ కూడా ఉంటాయి.

4. జిఫ్ మేకర్-జిఫ్ ఎడిటర్ ( GIF MAKER-GIF EDITOR , Android,free)

జిఫ్ మేకర్-జిఫ్ ఎడిటర్ పేరు తేడాగా ఉన్నప్పటికీ ఈ యాప్ లో ఎలాంటి గందరగోళం ఉండదు. ఈ టూల్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీడియోలను కట్, క్రాప్ కూడా చేయవచ్చు. అంతేకాదు స్టాటిక్ ఇమేజ్ సిరీస్ నుంచి జిఫ్ లను కూడా క్రియేట్ చేయవచ్చు. ఈ రెండు పద్దతులు చాలా సులభంగా ఉంటాయి. మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ తోపాటు ఫ్రేమ్ స్పీడ్ ను సర్దుబాటు చేసుకోవచ్చు. కలర్ ఎఫెక్ట్స్, డిఫరెంట్ ఫాంట్స్ యాడ్ చేయవచ్చు. ఇలా క్రియేట్ చేసుకున్న జిఫ్ లను సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.

5. కెమెరా ఎంఎక్స్ ( camera mx, android,free)

ఈ యాప్ ద్వారా కార్టూన్లు, వీడియోల నుంచి జిఫ్ లను క్రియేట్ చేయవచ్చు. లైవ్ షాట్ ఫంక్షన్ తోపాటు...ఐఫోన్లలో ఉండే లైవ్ ఫోటో ఫీచర్ ను పోలి ఉంటుంది. లైవ్ షాట్స్ ను జిఫ్ లుగా మార్చుకోవచ్చు.

6. పిక్సెల్ యానిమేటర్ , జిఫ్ మేకర్ ( pixel animator, gif maker, android free)

పైన ఉన్న యాప్స్ అన్నీ కూడా ఫోటోలు లేదా వీడియోలను ఉపయోగించి జిఫ్ లు క్రియేట్ చేయవచ్చు. కానీ పిక్సెల్ యానిమేటర్ అనేది మరింత ప్రయోగాత్మకంగా ఉంటుంది. మీరు ప్రతి సింగిల్ పిక్సెల్ తో ఒక జిఫ్ క్రియేట్ చేయవచ్చు. ఫిప్ బుక్ లో డ్రాయింగ్స్ ను గీస్తున్నట్లయితే...చిన్న స్ర్పిట్స్ క్రియేట్ చేయడానికి మీకు సహాయపడుతుంది. మీరు 15ఫ్రేమ్ జిఫ్ ను క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు బక్స్ కోసం అన్ లిమిటెడ్ ఫ్రెమ్స్ ను అన్ లాక్ చేయవచ్చు.

 

జన రంజకమైన వార్తలు