• తాజా వార్తలు
 •  

మనం అర్జెంటు గా డిలీట్ చేయవలసిన 22 డేంజరస్ యాప్స్ ఇవే

 వారం రోజుల క్రితం ప్రముఖ యాప్ స్టోర్ అయిన గూగుల్ ప్లే స్టోర్ ఒక మాల్ వేర్ ఎటాక్ కు గురయ్యింది. ఈ మాల్ వేర్ గురించి పసిగట్టిన గూగుల్ దీని గురించి పరిశోధన చేయగా ఇది అప్పటిజే 60 గేమింగ్ యాప్ ల లోనికి ప్రవేశించిందని తేలింది. వీటిలో కిడ్స్ మరియు అడల్ట్ గేమింగ్ యాప్ లు కూడా ఉన్నాయి. ఇలా ఎఫెక్ట్ చేయబడిన యాప్ లు ఓపెన్ చేసినపుడు పోర్నోగ్రఫిక్ యాడ్ లను డిస్ప్లే చేస్తాయి. వీటినుండి తప్పించుకోవడానికి కొన్ని ఫేక్ సెక్యూరిటీ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవలసిందిగా అడుగుతాయి. అలాగే కొన్ని ప్రీమియం సర్వీస్ లను కూడా ఆప్ట్ చేసుకోవలసిందిగా అడుగుతాయి. గూగుల్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ యాప్ లు ఇప్పటివరకూ 3 నుండీ 7 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ చేయబడ్డాయి. గూగుల్ ఇప్పటికే తన ప్లే స్టోర్ నుండి వీటిని తొలగించి అక్కడ వార్నింగ్ మెసేజ్ ను ఉంచింది. ఈ నేపథ్యం లో వీటిలో అత్యంత ప్రమాదకరమైన 22 యాప్ లను ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కనీసం 5000 ల సార్లు డౌన్ లోడ్ చేయబడినవే.

 1. ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్
 2. మెక్ క్వీన్ కార్ రేసింగ్ గేమ్
 3. యాడ్ ఆన్ పిక్సెల్ మాన్ ఫర్ MCPE
 4. కూల్ క్రాఫ్ట్ PE
 5. ఎక్స్ ప్లోరేషన్ ప్రో వరల్డ్ క్రాఫ్ట్
 6. డ్రా కవాలి
 7. శాన్ ఆండ్రియాస్ సిటీ క్రాఫ్ట్
 8. సబ్ వే బనానా రన్ సర్ఫ్
 9. ఎక్స్ ప్లోరేషన్ లైట్ : వింటర్ క్రాఫ్ట్
 10. యాడ్ ఆన్ GTA ఫర్ మైన్ క్రాఫ్ట్ PE
 11. యాడ్ ఆన్ స్పాంజ్ బాబ్ ఫర్ MCPE
 12. డ్రాయింగ్ లెసన్స్ యాంగ్రీ బర్డ్స్
 13. టెంపుల్ క్రాష్ జంగల్ బందికూట్
 14. డ్రాయింగ్ లెసన్స్ లెగో స్టార్ వార్స్
 15. డ్రాయింగ్ లెసన్స్ చిబి
 16. గర్ల్స్ ఎక్స్ ప్లోరేషన్ లైట్
 17. డ్రాయింగ్ లెసన్స్ సబ్ వే సర్ఫర్స్
 18. పా పప్పీ రన్ సబ్ వే సర్ఫ్
 19. ఫ్లాష్ స్లితర్ స్కిన్ IO
 20. ఇన్ విజిబుల్ స్కిన్ IO
 21. డ్రాయింగ్ లెసన్స్ లెగో నింజాగో
 22. డ్రాయింగ్ లెసన్స్ లెగో చిమా  

జన రంజకమైన వార్తలు