• తాజా వార్తలు

వాయిస్ కాలింగ్ ఫీచర్ తో ఇండియాలో రిలీజ్ అయిన ఫేస్ బుక్ మెసేంజర్ లైట్

    ఫేస్ బుక్ మెసేంజర్ లైట్ వెర్షన్ యాప్ ఎట్టకేలకు ఇండియాలో లాంఛ్ అయింది.  తక్కువ వేగం ఉన్న ఇంటర్నెట్ ఉన్నా కూడా పనిచేసేలా ఇది ఉపయోగపడుతుంది. ఫేస్ బుక్ లైట్ వెర్షన్ మాదిరిగానే ఇది కూడా వేగంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే సింపుల్ వెర్షన్. 
    ఫేస్ బుక్ లైట్ మాదిరిగానే ఇది కూడా తక్కువ స్పేస్ తో పనిచేస్తుంది. ఫొటోస్, టెక్స్ట్ కు సంబంధించిన ప్రధాన ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. ఎమోజీలు, స్టిక్టర్లు వంటి ప్రధాన యాప్ లో ఉండే ఫీచర్లూ ఇందులో ఉన్నాయి.  ఫోన్లో ఇది 10 ఎంబీ కంటే తక్కువ సైజ్ తీసుకుంటుంది. అలాగే బూటింగ్ కు కూడా తక్కువ సమయం తీసుకుంటుంది.
    మరోవైపు ఇందులో ఫేస్ బుక్ లో ఉండే కాంటాక్ట్స్ ను చూసుకోవడం.. వాటి ఆధారంగా వాయిస్ కాల్స్ చేయడం కూడా వీలవుతుంది. 
    కాగా మూణ్నెళ్ల కిందటే జపాన్, వియత్నాం, జర్మనీ, పెరూ, టర్కీ, నెదర్లాండ్స్, నైజీరియా, పెరూల్లో దీన్ని రిలీజ్ చేశారు. మరోవైపు 2015లోనే వచ్చిన ఫేస్ బుక్ లైట్ యాప్ ఇప్పుడు 150 దేశాల్లో వాడుతున్నారు. అదేమాదిరిగా ఫేస్ బుక్ మెసేంజర్ లైట్ యాప్ ను కూడా త్వరలోనే అన్ని దేశాలకూ విస్తరించనున్నారు.
 

జన రంజకమైన వార్తలు