ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని.. అందులోనూ ఇలాంటి వేసవి కాలంలో అయితే మన పని అయిపోయినట్టే. అందుకే, పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలోని స్మార్టు ఫోన్ తోనే ఎంచక్కా మీరు కోరుకున్నట్లుగా ఉండే అద్దె ఇంటిని పట్టేయొచ్చు. చేయాల్సిందల్లా అద్దె ఇళ్లకు సంబంధించిన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవడమే. ఇలాంటి యాప్స్ చాలా ఉన్నప్పటికీ కొన్ని మాత్రం అచ్చంగా మనకు కావాల్సిన అన్ని ఆప్షన్లతో నచ్చినట్లు ఉన్న ఇంటిని మనకు చూపించడంతో సూపర్ హిట్ అయినవి. అవేంటో చూద్దాం.
1) No broker (నో బ్రోకర్)
పేరులో ఉన్నట్లే మధ్యవర్తి అవసరం లేకుండా మంచి ఇంటిని పట్టుకోవడానికి సాయం చేసే యాప్ ఇది. ఇంటి యజమానులే ఇందులో ‘టు లెట్’ బోర్డులు పెడతారు. వారి కాంటాక్టు డీటెయిల్స్ ఉంటాయి. మనమే నేరుగా వారిని సంప్రదించి మాట్లాడుకుని, ఇంటిని చూసి అందులో చేరాలో వద్దో నిర్ణయించుకోవచ్చు.
ఇది కేవలం అద్దె ఇళ్లకే కాకుండా ఇళ్ల కొనుగోలుకూ సహాయపడుతుంది. హాస్టళ్లు వెతుక్కోవాలన్నా, రూంమేట్ ను వెతుక్కోవాలన్నా కూడా ఇది పనికొస్తుంది.
2) common floor (కామన్ ఫ్లోర్)
బెంగుళూరు వంటి నగరాల్లో కామన్ ఫ్లోర్ బాగా యూజ్ ఫుల్ యాప్ గా మారిపోయింది. ఇంటిని అద్దెకిచ్చేవారు, అద్దెకు తీసుకునేవారూ దీనిపైనే ఆధారపడతారు. ఇందులో ఓనర్, బ్రోకర్ లిస్టింగులు వేర్వేరుగా ఉంటాయి. ఇందులో చాలా ప్రాపర్టీలను 3డీ విధానంలో చూడొచ్చు. అప్పుడు ఇంకా కరెక్టుగా తెలుస్తుంది.
3) Housing.com (హౌసింగ్.కామ్)
ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన రెంటల్, ప్రాపర్టీ మార్కెట్ ప్లేస్ యాప్స్ లో ఇది కూడా ఒకటి. 2015 వరకు ఇందులో రెంటల్ ఆఫ్షన్ ఉన్నప్పటికీ ఆ తరువాత ఆ సర్వీసు ఆపేశారు. ఇటీవలే మళ్లీ అద్దె ఇళ్ల ఆప్షన్ కూడా పెట్టారు. ప్రతి లిస్టింగుకూ పెద్ద సంఖ్యలో ఫొటోలో యాడ్ చేయడం దీని ప్రత్యేకత. ఇంటిలోని బాత్రూం నుంచి బాల్కనీ వరకు అన్ని ప్రాంతాలు, గదుల ఫొటోలు మేగ్జమమ్ ఇందులో ఉంటాయి.
4) 99acres (99 యాకర్స్)
రియల్ ఎస్టేట్, రెంటల్ రిలేటెడ్ యాప్స్ , వెబ్ సైట్లలో ఇది తొలి తరానిది. ఇందులో ఫిల్టర్లు ఎక్కువగా ఉండడంతో తక్కువ సమయంలోనే మనకు కావాల్సిన ఇల్లు ఉన్నదీ లేనిదీ చూసుకోవచ్చు. ఇందులో నేవిగేషన్ కూడా ఈజీగా ఉంటుంది. 99 యాకర్స్ వెబ్ సైట్ కాస్త పాత పద్ధతుల్లో కనిపించినా యాప్ మాత్రం మంచి వేగం, యూజర్ ఫ్రెండ్లీనెస్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.
5) makaan.com (మకాన్)
మిగతా అన్ని రెంటల్ యాప్స్ లో ఉన్న ఫీచర్లతో పాటు ఇందులో చాటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కావడంతో దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. అయితే.. ఓనర్ లిస్టింగ్ బాగా తక్కువగా ఉంటోందని యూజర్లు చెబుతున్నారు.
6) Nestoria (నెస్టోరియా)
ఇది నిజానికి సొంతంగా ఏమీ లిస్ట్ అవుట్ చేయదు. ఇందులో కనిపించే ప్రాపర్టీపై క్లిక్ చేయగానే థర్డ్ పార్టీ సైట్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ విరాలు చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్న మకాన్, హౌసింగ్.కామ్, 99 యాకర్స్, నో బ్రోకర్, కామన్ ఫ్లోర్ యాప్స్ లో ఉండే లిస్టింగులోనే అన్నీ కలిపి ఇది ఒకే చోట చూపిస్తుంది.