• తాజా వార్తలు
  •  

అదిరిపోయే ఫీచర్లతో ‘ట్రూకాలర్’..

స్మార్టు జనరేషన్ కు ‘ట్రూ కాలర్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫోన్ బుక్ లో నంబరు లేకపోయినా మ్యాగ్జిమమ్ కేసెస్ లో అన్ నోన్ నంబర్ ఎవరిదో చెప్పేసే యాప్ ఇది. ఇప్పుడీ యాప్‌లో మ‌రిన్ని సౌక‌ర్యాలు రానున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ జోరును తానూ అందుకోవాలని ట్రూకాలర్ అనుకుంటోంది. అందులో భాగంగానే భార‌త్‌లో పెరుగుతున్న న‌గ‌దురహిత లావాదేవీల దృష్ట్యా ఈ యాప్‌లో ఇక‌పై బ్యాంకింగ్ సేవ‌లు ప్రారంభించనున్నారు.
రీ ఛార్జి చేసుకోవచ్చు
అంతేకాదు, వీడియో కాల్స్‌, మొబైల్ రీఛార్జ్ వంటి సేవ‌ల‌ను కూడా తీసుకురానున్నారు. ఇందు కోసం తాము ఇప్ప‌టికే ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం చేసుక‌ున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సౌక‌ర్యం ద్వారా యూపీఐ ఐడీ, భీమ్ యాప్‌తో అనుసంధానమై ఉన్న అన్ని మొబైల్ నెంబర్లకు న‌గ‌దు పంపుకోవ‌చ్చు.
ఎస్ఎంఎస్ ఫెసిలిటీ కూడా..
మరోవైపు మెసేజ్ ఇన్‌బాక్స్‌ను పూర్తిగా యాక్సెస్ చేయగలిగేలా ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా త‌మ యాప్‌లో తీసుకువ‌స్తున్నారు. ఈ ఫీచ‌ర్‌తో మెసేజ్‌లు సెండ్ చేయ‌డం, స్పామ్ మెసేజ్‌ల‌ను గుర్తించ‌డం వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే నెట్ కనెక్షన్ లేకుండానే త‌మ యూజ‌ర్ల‌ మొబైల్‌కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఎయిర్‌టెల్‌తో కలిసి ‘ఎయిర్‌టెల్ ట్రూ కాలర్ ఐడీ’ ఆప్షన్‌ను కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచ‌నుంది. మొత్తానికి ట్రూ కాలర్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేవలం టెలికాం రిలేటెడ్ మాత్రమే కాకుండా పేమెంట్ బ్యాంకింగ్ సేవలకూ సిద్ధమవుతోందన్నమాట.

జన రంజకమైన వార్తలు