• తాజా వార్తలు
  •  

జీఎస్టీ సొల్యూషన్స్ కోసం హెచ్‌పీ నుంచి స్పెష‌ల్ ల్యాప్‌టాప్

గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అతి త్వ‌ర‌లోనే ఇండియాలో అమ‌ల్లోకి రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప‌న్ను వేసుకునేవి. ఇది ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా ఉండ‌డంతో వ‌స్తువుల రేట్ల‌లో మార్పులు ఉంటున్నాయి. వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి దేశ‌మంతా ప్ర‌తి వ‌స్తువు లేదా స‌ర్వీస్ మీద యూనిఫామ్ ట్యాక్స్ ఉండేలా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌ను జీఎస్టీని అమ‌ల్లోకి తీసుకురాబోతోంది.
60 ల‌క్షల బిజినెస్ సంస్థల కోసం
జీఎస్టీ రానున్న నేప‌థ్యంలో హెచ్‌పీ సంస్థ దీనికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేపీఎంజీతో కలిసి కొత్త ల్యాప్‌ట్యాప్‌ను తీసుకొచ్చింది. జీఎస్టీ సొల్యూషన్స్‌ పేరుతో జూన్ 5 నుంచి దీన్ని సేల్ చేయ‌బోతోంది. దీని ధ‌ర 33,990 రూపాయ‌లు. జీఎస్టీతో ఎఫెక్ట్ అయ్యే 60 ల‌క్షల మంది స్మాల్‌, మీడియం బిజినెస్ సంస్థల జీఎస్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని త‌యారుచేశామ‌ని హెచ్‌పీ చెప్పింది. కొత్త ట్యాక్స్ ప్రకారం వ్యాపారులు ట్రాన్సాక్ష‌న్ల‌ను ఫైల్ చేసుకోవ‌డానికి దీనిలో ఏర్పాట్లు చేశారు.
హెల్ప్‌లైన్‌ను కాంటాక్ట్ చేయ‌వ‌చ్చు
ఈ ల్యాప్‌టాప్‌లు కొన్న‌వారు జీఎస్టీ ట్రాన్సాక్ష‌న్ల ఫైలింగ్‌లో ఏమైనా స‌మ‌స్య‌లు, సందేహాలుటే తీర్చేందుకు హెచ్‌పీ హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలు, చాట్‌ల ద్వారా ట్యాక్స్ ఎక్స్‌ప‌ర్ట్‌లు మీ సందేహాలు తీరుస్తారు. రెండు సంవ‌త్స‌రాల‌పాటు ఈ హెల్ప్‌డెస్క్ ప‌ని చేస్తుంది. అంతేకాదు ఈ ల్యాప్‌టాప్ కొనుక్కునేవారి కోసం హెచ్‌పీ స్టోర్లలో, వెబ్‌సైట్‌లో ట్రైనింగ్ కూడా ఉంది.

జన రంజకమైన వార్తలు