• తాజా వార్తలు
  •  

షియోమి ఎంఐ నోట్‌బుక్ ప్రో..  యాపిల్ మాక్‌బుక్  ప్రోను స‌వాల్ చేసేంతంటి ప్రొడ‌క్టా? 

మిగ‌తా చైనీస్ కంపెనీల్లా  స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌కే ప‌రిమిత‌మైపోకుండా ట్యాబ్‌లు, వేర‌బుల్స్, ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ లాంటి ఇత‌ర ప్రొడ‌క్ట్‌ల‌ను కూడా త‌యారుచేస్తూ మార్కెట్ పెంచుకుంటోంది చైనీస్ దిగ్గ‌జం షియోమి.  కంపెనీ తాజాగా షియోమి ఎంఐ నోట్‌బుక్ ప్రో ( Xiaomi Mi Notebook Pro)ని రిలీజ్ చేసింది.  విండోస్ 10 ఐవోఎస్‌తో వ‌చ్చిన నోట్‌బుక్ లైన్ అప్‌లో ఇదే టాప్ మోడ‌ల్‌.  యాపిల్ మ్యాక్ బుక్ ప్రో కి ఇది డైరెక్ట్ కాంపిటీట‌ర్ అంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు.  దీనిలో  ఫీచ‌ర్లు చూస్తే యాపిల్ మ్యాక్ బుక్ ప్రో తో  పోటీప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 

హై సియెర్రా ప‌వ‌ర్డ్ ల్యాప్‌టాప్ డిజైన్‌తో ఇన్‌స్పైర్ అయి షియోమి ఈ నోట్ బుక్ ప్రోని డిజైన్ చేసింది. మెగ్నీషియం అల్లాయ్ ఛాసిస్ తో ఉండ‌డంతో రోజువారీ యూసేజ్‌లో పొర‌పాటున కింద ప‌డినా త‌ట్టుకోగ‌ల‌దు. అంతేకాదు ఇప్ప‌టివ‌ర‌కు ఎం ఐ నోట్‌బుక్స్‌లో ఇదే పెద్ద‌ది.  15.6 ఇంచెస్ డిస్‌ప్లేతో  వ‌చ్చిన ఈ  నోట్ బుక్‌కు  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్ ఉంది.
 ఫీచ‌ర్స్ 
 Intel’s latest 8th జ‌న‌రేష‌న్ చిప్, Intel Core i7 కాఫీ లేక్‌ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్  
*  NVidia GeForce MX150 గ్రాఫిక్ కార్డ్ 
* 8 జీబీ/16 జీబీ  DDR4 ర్యామ్ 
 * 2,400MHz డ్యూయ‌ల్ ఛాన‌ల్ రామ్  
* సిస్టం టెంప‌రేచ‌ర్‌ను కూల్ చేయ‌డానికి సిమ్మెట్రిక‌ల్ సూప‌ర్ కూలింగ్ సిస్టం   
* ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్  
* డాల్బీ అట్మాస్ బిల్ట్ ఇన్ స్పీక‌ర్స్ 
* 1ఎంపీ  హెచ్ డీ వెబ్‌కాం
* 1.95 కిలోల బ‌రువు
 
క‌నెక్టివిటీ సూప‌ర్ 
* 7 ఇంటిగ్రేటెడ్ పోర్ట్‌లున్నాయి. 3-in-1  ఎస్డీ స్లాట్‌, డేటా యూస్‌బీ టైప్ సీ, ఫుల్ ఫంక్ష‌న్ యూఎస్‌బీ టైప్‌సీ, హెచ్‌డీఎంఐ పోర్ట్‌, రెండు యూఎస్‌బీ  పోర్ట్‌లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. 60Wh లాంగ్‌లైఫ్ బ్యాట‌రీతోపాటు  1సీ క్విక్ ఛార్జి ఆప్ష‌న్ ఉంది.  

మూడు వేరియంట్స్
షియోమి ఎంఐ నోట్‌బుక్ ప్రో స్పేస్ గ్రే క‌ల‌ర్‌లో దొరుకుతుంది.  మూడు వేరియంట్ల‌తో వ‌చ్చింది. 
స్టాండ‌ర్డ్ వేరియంట్  ఇంటెల్  కోర్ ఐ5 కాఫీ లేక్ ప్రాసెస‌ర్ 8జీబీ ర్యామ్  .. ప్రైస్ 54,900 
8th gen ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస్ విత్ 8జీబీ ర్యామ్ వేరియంట్‌.. ప్రైస్  62,690  
8th gen ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస్ విత్ 16 జీబీ ర్యామ్ వేరియంట్‌.. ప్రైస్  68,575 

అదే యాపిల్ మ్యాక్ బుక్ ప్రోలో క‌నీస ధ‌ర ల‌క్ష‌పైనే ఉంది. కాబ‌ట్టి షియోమి ఎంఐ నోట్‌బుక్ మంచి కాంపిటీట‌రే.

జన రంజకమైన వార్తలు