• తాజా వార్తలు
  •  

స్టైల‌స్ పెన్‌తో తొలి నోట్‌బుక్‌.. శాంసంగ్‌ నోట్‌ బుక్‌ 9 ప్రో

ట‌చ్‌స్క్రీన్ ఫోన్ల‌పై రాసుకునేందుకు, ఆప‌రేట్ చేసుకునేందుకు వ‌చ్చే స్టైల‌స్ పెన్ తెలుసుగా.. ఒక‌ప్పుడు ఎల్‌జీ, నోకియా, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు హై ఎండ్ మోడ‌ల్స్‌లో ఈ స్టైల‌స్‌ను కూడా ఇచ్చేవి. శాంసంగ్ ఇప్పుడు తొలిసారిగా త‌న నోట్‌బుక్‌కు కూడా స్టైల‌స్ పెన్ అందిస్తోంది. త‌న కొత్త శాంసంగ్‌ నోట్‌బుక్‌ 9 ప్రో తోపాటు స్టైల‌స్‌ను కూడా ఇస్తుంది. దీన్ని పెట్టుకునేందుకు నోట్‌బుక్‌లోనే స్పేస్ ఇచ్చింది. దీనితో డ్రాయింగ్స్‌ చేసుకోవచ్చు. ఈ స్టైలస్‌కు ఛార్జింగ్‌ అక్కర్లేదు.
నోట్‌బుక్‌, ట్యాబ్ కూడా..
శాంసంగ్‌ నోట్‌బుక్‌ 9 ప్రో రెండు వేరియంట్లలో దొరుకుతుంది. 13.3 ఇంచెస్ స్క్రీన్ తో వ‌చ్చే నోట్‌బుక్‌ 8జీబీ ర్యామ్ తో న‌డుస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో వ‌చ్చే రెండో వేరియంట్‌లో స్క్రీన్ సైజ్ 16 ఇంచెస్‌. 15 అంగుళాల స్క్రీన్‌ సైజుతో విడుదల చేసింది. 360 డిగ్రీల యాంగిల్‌లో స్క్రీన్‌ను తిప్పుకోవ‌చ్చు. కాబ‌ట్టి నోట్‌బుక్‌లా, ట్యాబ్‌లా కూడా వాడుకునే ఫెసిలిటీ ఉంది. టచ్‌స్క్రీన్ దీనికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ కోసం హ‌లో కెమెరా అనే ఆప్ష‌న్‌ను ఫ్రంట్ ఫేసింగ్‌లో అమ‌ర్చింది. ఈ ఏడాది చివ‌రిలో రానున్న ఈ నోట్‌బుక్ ధ‌ర ఇంకా తెలియ‌లేదు.
స్పెక్స్ ఇవీ..
* ఫుల్ హెచ్‌డీ ట‌చ్ స్క్రీన్ విత్ 1920×1080 రిజల్యూషన్‌ * విండోస్‌ 10 హోమ్‌ * ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ * 256 జీబీ హార్డ్‌ డిస్క్‌ * రెండు యూఎస్‌బీ స్లాట్‌లు, హెచ్‌డీఎంఏ పోర్ట్‌, ఎక్స్ ట్రా స్టోరేజ్ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ * యూఎస్‌బీ -సీ పోర్టు ద్వారా వేగవంతమైన ఛార్జింగ్‌కు అవకాశం

జన రంజకమైన వార్తలు