• తాజా వార్తలు
  •  

ప్ర‌స్తుతం బాగా అమ్ముడ‌వుతున్న బ‌డ్జెట్ ల్యాప్‌టాప్స్ ఇవీ..

 ల్యాప్‌టాప్ అంటే 40, 50 వేలు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌ని లేదు.  20 వేల రూపాయ‌ల్లోపు కూడా బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి కూడా టాప్ బ్రాండ్స్‌వే. మీ అవ‌స‌రాల్ని బ‌ట్టి ఏది కావాలో ఎంచుకోండి. 

హెచ్‌పీ 15 బీజీ008ఏయూ (HP 15-BG008AU)
ల్యాప్‌టాప్‌ల త‌యారీలో ఫేమ‌స్ అయిన హెచ్‌పీ కంపెనీ చౌక ధ‌ర‌లో అందిస్తు్న ల్యాపీ ఇది.  ఫ‌స్ట్ టైమ్ యూజ‌ర్ల‌కు బాగా ప‌నికొస్తుంది. 
 స్పెసిఫికేష‌న్స్‌: 14 ఇంచెస్ ఎల్ఈడీ బాక్‌లిట్ డిస్‌ప్లే,  1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో వ‌స్తుంది.  AMD క్వాడ్ కోర్   E2-7110 ప్రాసెస‌ర్‌, 1.8 గిగా హెర్ట్జ్   Radeon R2 గ్రాఫిక్స్ ,  4 జీబీ   DDR3L-1600 SD ర్యామ్,  5400 rpm SATA storage ఇంట‌ర్న‌ల్ స్టోరేజి, 3.0 యూఎస్‌బీ పోర్ట్ ఒక‌టి, 2.0  యూఎస్‌బీ పోర్ట్‌లు రెండు, ఒక వీజీఏ పోర్ట్‌, ఒక హెడ్‌ఫోన్ జాక్‌,  RJ-45 ఎథ‌ర్నెట్ పోర్ట్ ఉన్నాయి.   41 Wh లిథియం అయాన్ బ్యాట‌రీలు నాలుగు ఉన్నాయి.  ఇవి దాదాపు ఏడు గంట‌ల బ్యాక‌ప్ ఇస్తాయి.  DVD/CD-RW drive కూడా ఉన్న ఈ ల్యాప్ టాప్ విండోస్ 10 హోమ్ తో వ‌స్తుంది. వీడియోకాలింగ్‌కు హెచ్‌పీ వీజీఏ కెమెరా, మంచి సౌండ్ సిస్ట‌మ్ ఉన్నాయి.  
ప్రైస్‌:19,990 
 
లెనోవో ఐడియా ప్యాడ్ 110 (Lenovo IdeaPad 110 80T70015IH)

ల్యాప్‌టాప్‌ల త‌యారీలో మ‌రో పెద్ద కంపెనీ లెనోవో ఈ  మోడ‌ల్‌ను రిలీజ్ చేసింది.  చౌక ధ‌ర‌లో అందిస్తు్న ల్యాపీ కావాల‌నుకునేవారికి మంచి ఆప్ష‌న్‌.  
స్పెసిఫికేష‌న్స్‌: 14 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే,  1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో వ‌స్తుంది. ఇంటెల్ పెంట్యూమ్‌  N3710  ప్రాసెస‌ర్‌, 2.56 గిగా హెర్ట్జ్  క్లాక్ స్పీడ్‌, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. బ్రౌజింగ్‌,  రైటింగ్‌,  అప్లికేష‌న్స్ ర‌న్నింగ్ వంటి సాధార‌ణ యూసేజ్‌కు ఇది చాలు.  4 జీబీ   DDR3 ర్యామ్,  1 టీబీ హార్డ్‌డ్రైవ్ ఉన్నాయి. క‌నెక్టివిటీ కోసం 3.0 యూఎస్‌బీ పోర్ట్ ,  బ్లూటూత్ 4.1, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు పెట్టారు 24 Wh బ్యాట‌రీలు మూడు ఉన్నాయి.  కంటిన్యుయ‌స్‌గా నాలుగు గంట‌ల వీడియో ప్లే బ్యాక్ స‌రిప‌డా   బ్యాక‌ప్ ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది.   
ప్రైస్‌:18,990 

 
ఆసుస్ ఎక్స్ 541ఎన్ఏ (Asus X541NA-GO017)

నోట్‌బుక్స్ బిజినెస్‌లో బాగా ఫేమ‌స్ అయిన ఆసుస్ నుంచి బేసిక్ టాస్క్ ఈజీగా చేసుకోగ‌ల బడ్జెట్   ల్యాప్‌టాప్ ఇది.  
స్పెసిఫికేష‌న్స్‌: 15.6 ఇంచెస్ హెచ్‌డీ ఎల్ఈడీ  డిస్‌ప్లే,  1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో వ‌స్తుంది.  64 బిట్ ఇంటెల్ సెలెరాన్ డ్యూయ‌ల్‌కోర్  N3350  ప్రాసెస‌ర్‌తోపాటు గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ ఉన్నాయి.  4 జీబీ   DDR3 ర్యామ్,  500 జీబీ SATA  స్టోరేజి ఉన్నాయి. క‌నెక్టివిటీ కోసం 3.0 యూఎస్‌బీ పోర్ట్ ,  రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు,  హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ఆర్‌జే 45 పోర్ట్‌, ఒక హెడ్‌ఫోన్ జాక్‌తో మ‌ల్టీ కార్డ్ రీడ‌ర్ కూడా అమ‌ర్చారు.  బిల్ట్ ఇన్ వైఫై, బ్లూటూత్ ఇచ్చారు.   36WHr బ్యాట‌రీలు మూడు  మంచి బ్యాట‌రీ  బ్యాక‌ప్ ఇస్తాయి. DOSతో రన్న‌య్యే ఈ ల్యాపీలో  విండోస్‌ను కూడా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. 
ప్రైస్‌:19,695
 
యాస‌ర్ ఏస్పైర్ ఈఎస్‌1- 132 (Acer Aspire ES1-132)

విండోస్ 10 హోం ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో మార్కెట్లోకి వ‌చ్చిన యాస‌ర్ ఏస్పైర్ ల్యాపీ కూడా బ‌డ్జెట్ రేంజ్‌లో మంచి ఆప్ష‌న్‌. అయితే స్క్రీన్ సైజ్ త‌క్కువ‌గా ఉండ‌డం మైన‌స్‌.
స్పెసిఫికేష‌న్స్‌: 11.6 ఇంచెస్ హెచ్‌డీ ఎల్ఈడీ  డిస్‌ప్లే,  1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో వ‌స్తుంది.  64 బిట్ ఇంటెల్ సెలెరాన్ డ్యూయ‌ల్‌కోర్  N3350  ప్రాసెస‌ర్‌తోపాటు గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నాయి.  2 జీబీ  ర్యామ్,  500 జీబీ హెచ్‌డీడీ హార్డ్ డిస్క్ ఉన్నాయి. క‌నెక్టివిటీ కోసం రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు అమ‌ర్చారు. మూడు లిథియం అయాన్ బ్యాట‌రీలు నాన్‌స్టాప్‌గా నాలుగు గంట‌ల‌ బ్యాక‌ప్ ఇస్తాయి. స్టాండ‌ర్డ్ ఫుల్ సైజ్ కీ బోర్డ్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ స్టీరియో స్పీక‌ర్స్ ఉన్నాయి.
ప్రైస్‌:18,588
 
డెల్ ఇన్‌స్పిరాన్ 15.6 3552 (Dell Inspiron 15.6 3552 )
 బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌ల రేస్‌లో డెల్ తీసుకొచ్చిన  మోడ‌ల్ ఇది. బ‌డ్జెట్ రేంజ్‌లో ల్యాపీ కావాల‌నుకుంటే మంచి ఆప్ష‌న్‌.
స్పెసిఫికేష‌న్స్‌: 15.6 ఇంచెస్ హెచ్‌డీ ఎల్ఈడీ  డిస్‌ప్లే,  1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో వ‌స్తుంది.   ఇంటెల్ సెలెరాన్ N3540 ప్రాసెస‌ర్‌తోపాటు గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ కార్డ్ , 4 జీబీ   DDR3 ర్యామ్,  500 జీబీ SATA  స్టోరేజి ఉన్నాయి. క‌నెక్టివిటీ కోసం 3.0 యూఎస్‌బీ పోర్ట్ ,  రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు,  హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ఆర్‌జే 45 పోర్ట్‌, ఒక హెడ్‌ఫోన్ జాక్‌తో మైక్రో ఎస్డీ కార్డ్‌ రీడ‌ర్ కూడా అమ‌ర్చారు.  బిల్ట్ ఇన్ వైఫై, బ్లూటూత్ ఇచ్చారు.   40WHr బ్యాట‌రీలు నాలుగు ఉండ‌డంతో మంచి బ్యాట‌రీ  బ్యాక‌ప్ ఇస్తాయి. Ubuntu Linux 14.4 ఓఎస్‌తో రన్న‌య్యే ఈ ల్యాపీ విండోస్‌కు మంచి ఆల్ట‌ర్నేటివ్ అని చెప్పొచ్చు.  
ప్రైస్‌:19,999 
 

జన రంజకమైన వార్తలు