• తాజా వార్తలు

    ఫస్ట్ టైం లావా నుంచి ల్యాప్ టాప్... ధర కూడా రీజనబుల్

    ఇంతవరకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల తయారీకే పరిమితం అయిన దేశీయ కంపెనీ లావా తొలిసారిగా ల్యాప్ టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ భాగస్వామ్యంతో తన తొలి ల్యాప్‌ట్యాప్‌ హీలియం 14ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
    దీని ధర రూ.14,999... ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, కోయంబత్తూరు, హైదరాబాద్‌, బెంగళూరుల మల్టి-బ్రాండు అవుట్‌ లెట్లలో జూలై తొలివారం నుంచి విక్రయానికి పెడతారు. 

ఇవీ స్పెసిఫికేషన్లు    
* 14.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* విండోస్‌ 10 హోమ్‌ ఎడిషన్‌ 
* ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌
* 2జీబీ ర్యామ్‌
*  32జీబీ బిల్ట్‌-ఇన్‌ స్టోరేజ్‌
* ఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.
* 10,000ఎంఏహెచ్‌ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు