• తాజా వార్తలు

లా బ్రేక్ చేసేవారికి సింహ‌స్వ‌ప్నం.. ఈ ఏఐ అనేబుల్డ్ స్మార్ట్ ఐ

రోడ్డు మీద వెళుతూరూల్స్ బ్రేక్ చేస్తున్నారా? ఎవ‌రూ చూడడం లేదు క‌దా అని ట్రాఫిక్ రూల్స్ వ‌య‌లేట్ చేస్తున్నారా?  రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌, నో పార్కింగ్‌లో పార్కింగ్ లాంటివి చేస్తున్నారా? ఇలాంటివి చేస్తే మిమ్మ‌ల్ని ప‌ట్టిచ్చేయ‌డానికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో ప‌నిచేసే స్మార్ట్ కెమెరాలు వ‌చ్చేస్తున్నాయి. ఇండియాలోని కొన్ని సిటీస్‌లో ప్ర‌యోగాత్మకంగా వ‌చ్చే నెల‌లోనే స్టార్ట్ చేయ‌బోతున్నారు. కాబ‌ట్టి ట్రాఫిక్ రూల్స్ వ‌య‌లేట్ చేసేవారు జాగ్ర‌త్త‌. ఇక చైన్ స్నాచ‌ర్లు, దారి దోపిడీ దొంగ‌ల‌క‌యితే ఈ స్మార్ట్ ఐ స్ సింహ‌స్వ‌ప్నం కావ‌డం ఖాయం. 
ఏంటి స్పెష‌ల్‌? 
ఏఐ అనేబుల్డ్ స్మార్ట్ కెమెరాల‌ను స్మార్ట్ ఐ స్ అంటున్నారు.  బ్రెజిలియ‌న్ సెక్యూరిటీ కంపెనీ పోల్‌సెక్ వీటిని త‌యారుచేస్తుంది. వీటిని వ‌చ్చే నెల‌లో ముంబ‌యి, ఢిల్లీ, ఆగ్రాల్లో ప్ర‌వేశ‌పెట్టబోతున్నారు.  ప్ర‌యోగాత్మ‌కంగా  ఒక్కో న‌గ‌రంలోని వీధుల్లో 100 చొప్పున వీటిని పెడ‌తారు.  ఇవి సాధార‌ణ సీసీ కెమెరాల్లా బిగించిన వైపే రికార్డ్ చేసి ఊరుకోవు ఈ కెమెరాలు 360 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతుంటాయి.  ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయ‌డం,  ఏదైనా వయొలెన్స్, క్రైమ్ లాంటివి జ‌రిగితే వెంట‌నే రియాక్ట‌యి ఇమేజెస్ తీస్తుంది. వాటిని ఇమీడియెట్‌గా పోలీస్  కంట్రోల్ రూమ్‌కు షేర్ చేస్తుంది. కాబ‌ట్టి పోలీసులు వెంట‌నే అల‌ర్ట‌యి క్రైమ్ చేసిన‌వాళ్ల‌ను నిమిషాల్లోనే ప‌ట్టుకోవ‌చ్చు. 
ఐదేళ్ల‌లో 10 ల‌క్ష‌ల కెమెరాలు
వ‌చ్చే ఐదేళ్ల‌లో ఇండియాలో 10 ల‌క్ష‌ల స్మార్ట్ ఐ స్‌ను ఇన్‌స్టాల్ చేయ‌బోతున్నారు. ఒక్కో కెమెరా కాస్ట్ 17,950 రూపాయ‌లు. ఇవి స్మార్ట్ కెమెరాలు కాబ‌ట్టి ప్రైవ‌సీ ఇష్యూ అనుకుంటే ఫేస్‌లు బ్ల‌ర్ చేస్తుంది. కావాలంటే వాటిని రివీల్ చేసే సౌక‌ర్యం ఉంది.  సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా వీటిని కొనుక్కోవ‌చ్చు. అమెజాన్లో  డీప్ లెన్స్ , గూగుల్ గూగుల్ క్లిప్స్ పేరిట ఇవి దొరుకుతున్నాయి. ధ‌ర 16వేల వ‌ర‌కు ఉంటుంది.  

జన రంజకమైన వార్తలు