• తాజా వార్తలు

ఏమిటీ ఫ్రీ మిల్క్ మాల్ వేర్‌?  దీని నుండి సేఫ్‌గా ఉండ‌డం ఎలా? 

మీ ఈ మెయిల్ కన్వ‌ర్సేష‌న్స్ సేఫ్‌గా ఉన్నాయ‌ని మీరు అనుకుంటున్నారా?  అలా అని భ్ర‌మ‌ప‌డొద్దంటున్నారు సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు. ఫ్రీ మిల్క్ మాల్‌వేర్ మీ ఈ మెయిల్ క‌న్వ‌ర్సేష‌న్‌లోకి చొర‌బ‌డి మీ సిస్టంలో ఉన్న కాన్ఫిడెన్షియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ మొత్తాన్ని కొట్టేస్తుంది. అది కూడా మీకు ఏ మాత్రం అనుమానం రాకుండానే.. కాబ‌ట్టి బీకేర్‌ఫుల్ అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. 
ఈ మెయిల్ క‌న్వ‌ర్సేష‌న్‌తోనే చొర‌బాటు
ఫ్రీ మిల్క్ అనేది మాల్ వేర్‌ను మీ సిస్టంలోకి ఎంట‌ర్ చేసి ఇన్ఫ‌ర్మేష‌న్ మొత్తం దొంగిలిస్తుంది. ఈ ఏడాది మేలో పాలో ఆల్టో నెట్‌వ‌ర్క్ రీసెర్చ‌ర్లు ఈ మాల్‌వేర్‌ను ఐడెంటిఫై చేశారు. వాళ్లే దీనికి ఫ్రీమిల్క్‌వేర్ అనిపేరుపెట్టారు.  ఈ మాల్‌వేర్‌ను ఎంట‌ర్ చేయాల‌నుకునే హ్యాక‌ర్లు అన్‌గోయింగ్ ఈమెయిల్ క‌న్వ‌ర్సేష‌న్‌ను జ‌రుగుతున్న మెయిల్ ఊడీల‌ను గుర్తిస్తారు.  ఈమెయిల్ అకౌంట్‌ను కంట్రోల్లోకి తీసుకుని కొత్త మెయిల్‌ను ఆ క‌న్వ‌ర్సేష‌న్‌లోకి పంపిస్తారు. ఇది వేరే వ్య‌క్తి నుంచి వ‌చ్చింద‌ని మెయిల్ రిసీవ్ చేసుకున్న‌వాళ్ల‌కు తెలియ‌దు. ఇలా వ‌చ్చిన థ‌ర్డ్‌పార్టీ మెయిల్‌లో బాడీ ట్రాప్డ్ ఫైల్స్ ఉంటాయి. ఫ్రీమిల్క్‌వేర్ సిస్టంలోకి ఎంట‌ర‌యితే పూ మిల్క్‌, ఫ్రీన్కిన్ అనే రెండు పేలోడ్స్ ఉంటాయి. ఇవి మాలిషియ‌స్ కోడ్స్ ద్వారా కంప్యూట‌ర్‌ను ఇన్‌ఫిల్ట‌రేట్ చేస్తాయి. కాన్ఫిడెన్షియ‌ల్ డేటాను దొంగిలిస్తాయి. ఈ ప్రాసెస్ జ‌రుగుతున్న‌ట్లు యూజర్‌కు ఏ మాత్రం తెలియ‌దు.   ఇండియ‌న్ కంప్యూట‌ర్స్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ తీసుకోవు. యాంటీ వైర‌స్‌ను పెద్ద‌గా అప్డేట్ కూడా చేసుకోవు.  కాబ‌ట్టి వీటికి ఫ్రీమిల్క్‌వేర్‌తో  ప్ర‌మాదం ఎక్కువే.
ఎలా అడ్డుకోవాలి?  
* లేటెస్ట్ ఓఎస్‌ను వాడండి 
* ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను అనేబుల్ చేసుకోండి.  రెగ్యుల‌ర్‌గా వాటిని డౌన్‌లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోండి.
* నెట్‌వ‌ర్క్ బేస్డ్ ఎటాక్స్ నుంచి కాపాడుకోవ‌డానికి ఫైర్‌వాల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి.  
* తెలియ‌ని ఈ మెయిల్స్ నుంచి వ‌చ్చిన స్ట‌ఫ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయ‌కండి.  
* లేటెస్ట్ / అప్‌డేటెడ్ యాంటీవైర‌స్‌ను వాడండి.  
* లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌ను వాడుకోండి.  
* పైరేటెడ్ / అన్‌ప్యాచ్డ్ /  అవుట్ డేటెడ్ డివైసెస్‌ను తీసేయండి.  
* మీరు కంపెనీ లేదా సంస్థ‌లో ఉంటే ఎంప్లాయిస్ అంద‌రికీ దీని గురించి చెప్పి అవేర్ చేయండి.  

జన రంజకమైన వార్తలు