• తాజా వార్తలు
  •  

2017 లో జరిగిన టాప్ సైబర్ ఫ్రాడ్ ల లిస్టు మీకోసం

2018 వ సంవత్సరం లోనికి ప్రవేశించి అప్పుడే 5 రోజులైంది. ఎప్పుడైనా సరే ఈ డిజిటల్ ప్రపంచం లో మనం దృష్టి కేంద్రీకరించవల్సిన అంశాలలో ఆన్ లైన్ నేరాలు అనేవి ముఖ్యమైనవి. ఆన్ లైన్ బ్యాంకింగ్ కు సంబందించిన నేరాలు గానీ మరే ఇతర నేరాలు గానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. 2017 వ సంవత్సరం లో జరిగిన 5 అతి పెద్ద ఆన్ లైన్ సంబందిత మోసాల గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. అసలు దానికంటే ముందు ఈ సంవత్సరం లో జరిగిన ఆన్ లైన్ మోసాల సరళి ని ఒక్కసారి పరిశీలిద్దాం.

మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి ?        

రాజ్య సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్న కు సమాధానం ఇస్తూ కేంద్ర ఐటి శాఖామంత్రి అయిన శ్రీ రవి శంకర్ ప్రసాద్ డిసెంబర్ 21, 2017 వరకూ మొత్తం 25,800 ఆన్ లైన్ మోసాల తరహా కేసులు నమోదయినట్లు తెలిపారు. ఈ కేసుల కు సంబంధించి సుమారుగా రూ 179 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ నెట్ బ్యాంకింగ్ మరియు డెబిట్/క్రెడిట్ కార్డు లకు సంబందించినవే. రోజురోజుకీ వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక్క డిసెంబర్ త్రైమాసికం లోనే సుమారు 10,220 కేసులు నమోదు కాగా వీటివలన నష్టం సుమారు రూ 111. 85 కోట్లు గా ఉన్నది.

 ఈ ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందుండగా హర్యానా, కర్ణాటక, తమిళనాడు మరియు ఢిల్లీ తర్వాతి స్థానాలలో ఉన్నాయి.

2017 లో జరిగిన టాప్ డిజిటల్ నేరాలు

రూ 3700 కోట్ల ఆన్ లైన్ స్కాం

ఈ సంవత్సరం జరిగిన ఆన్ లైన్ మోసాల లో ఇది అతి పెద్దది. సోషల్ ట్రేడ్ పేరుతో ఒక పేరుమోసిన కంపెనీ సుమారు 7 లక్షల మంది ప్రజలను మోసం చేసిన ఈ స్కాం కు సంబందించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నది.

ICICI బ్యాంకు కు సంబందించిన ఆధార్ స్కాం                  

బ్యాంకు ఖాతాదారుల ఆధార్ లింకింగ్ పేరిట వారి వద్దనుండి OTP ని తస్కరించి అనేక మందినీ, కొన్ని కోట్ల రూపాయలను మోసం చేసిన ఇది తర్వాతి స్థానం లో నిలుస్తుంది.

LIC తో ఆధార్ స్కాం      

దీనిని స్కాం అనే కంటే హెచ్చరిక అనాలేమో . కానీ LIC కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దీనిని కూడా ఈ జాబితా లో చేర్చవలసి వచ్చింది. ప్రభుత్వం ఆదార్ లింకింగ్ ను తప్పనిసరి చేసాక కొంతమంది నేరగాళ్ళు మోసపూరితమైన వెబ్ సైట్ లు తయారు చేసి కస్టమర్ లను మోసం చేయాలని చేసిన ప్రయత్నమే ఇది..

బ్యాంకు ల తో ఆధార్ స్కాం

ఇది మరొక ఆదార్ సంబందిత స్కాం. అంతగా పరిజ్ఞానం లేని కస్టమర్ లను సులభంగా బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టిన స్కాం ఇది. అందుకే మేము ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు కూడా చెబుతున్నాము దయచేసి మీ OTP ని ఎవరికీ చెప్పవద్దు.

 

 

జన రంజకమైన వార్తలు