• తాజా వార్తలు

3జి కాయిన్ - నయా సైబర్ క్రైమ్ 18 లక్షలు మోసపోయిన హైదరాబాద్ టెకీ

3జి కాయిన్ - 'నయా' సైబర్ క్రైమ్

18 లక్షలు మోసపోయిన హైదరాబాద్ టెకీ

          ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను 18 లక్షల రూపాయలకు మోసం చేసిన ఉదంతం లో సైబరాబాద్ పోలీసులు బెంగళూరు కి చెందినా ఒక సైబర్ మోసగాడిని అరెస్ట్ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతొ ఆన్ లైన్ లో డబ్బులు పెట్టుబడులు పెట్టించి ఇతను మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సదరు బాదితుడు జూలై 11 న దీనిపై ఫిర్యాదు చేశాడు.

వర్చ్యువల్ మైనింగ్ లో పెసిఅల్ అయిన 3 జి కాయిన్ క్రిప్తో కరెన్సీ అనే కంపెనీ కి ఇతను ఏజెంట్. ఇతను సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేత ఆన్ లైన్ లో 18 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించాడు. ఈ కంపెనీకి www.3gcoin.eu అనే URL తో ఒక వెబ్ సైట్ ఉన్నది. ఈ వెబ్ సైట్ 30 యూరో లు పెట్టి ఒక 3 జి కాయిన్ కొనుగోలు చేస్తే వారు రెండు సంవత్సరాల లో దానికి 180 రెట్ల ఎక్కువ మొత్తాన్ని పొందుతారని ఈ కంపెనీ నమ్మబలుకుతుంది. అంతేగాక ఎవరైనా కొత్త ఇన్వెస్టర్ ను కంపెనీకి పరిచయం చేస్తే 20 శాతం డబ్బు అదనం గా ఇస్తామని కూడా చెబుతారు.అంతేగాక నెలనెలా కమీషన్ కూడా ఉంటుందని చెబుతారు. ఈ మాటలను జనాలు ఆ కంపెనీలో 30 యూరో లకు విలువైన భారతీయ కరెన్సీ ని పెట్టుబడులు పెట్టి మోసపోతూ ఉంటారు. ఇక్కడ మన సదరు బాదితుడు కూడా అచ్చం ఇలాగె మోసపోయాడు. నెలనెలా కమిషన్ రాకపోయే సరికి అనుమానం వచ్చిన ఆ బాదితుడు సైబరాబాద్ పోలేస్సులకు ఫిర్యాదు చేశాడు.

          రంగం లోనికి దిగిన సైబెరాబాద్ సైబర్ నేర పరిశోధన విభాగం ఈ కంపెనీ యొక్క తీగ లాగితే డొంక అంతా కదిలింది. బండారం బట్టబయలు అయింది. బెంగళూరు కి చెందినా BM జగదీశ అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా గుర్తించిన సైబరాబాద్ పోలీసులు అతనిని అరీస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. విచారణ లో పోలీసులకు దిమ్మ తిరిగి పోయే నిజాలు వెల్లడయ్యాయి. కొన్ని కల్పిత పేర్ల తో ఈ వెబ్ సైట్ ను రిజిస్టర్ చేశారు. వీరిలో ఒక చనిపోయిన వ్యక్తి కూడా ఉండడం విశేషం. ఈ చని పోయిన వ్యక్తి పేరు మీదా ICICI మరియు ఆక్సిస్ బ్యాంకు లలో రెండు ఎకౌంటు లను కూడా క్రియేట్ చేశారు.అతని క్రింద ఇప్పుడు 500 మంది ఏజెంట్ లు పనిచేస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు