• తాజా వార్తలు
  •  

ఆధార్‌, అమెజాన్‌.. 2.4 ల‌క్ష‌ల రూపాయ‌ల లూటీ క‌థ‌

ఆధార్ కార్డ్ లింక్ చేయండి.. ఈ మాట అన‌ని కంపెనీ కానీ, సర్వీస్ ప్రొవైడ‌ర్ గానీ క‌న‌బ‌డితే ఒట్టు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆధార్‌కార్డ్‌, మొబైల్ నెంబ‌ర్ అన్నింటికీ ఆధార్ లింక్ చేయ‌మ‌న్న సూచ‌న‌లే.  ఆద‌మ‌రుపుగా ఉంటే ఇలాంటి వాటిని అడ్డుపెట్టుకుని ఫేక్ కాల్స్‌తో మీ జేబులు గుల్ల చేసేస్తారు జాగ్ర‌త్త‌. ఎందుకంటే ముంబ‌యిలో ఇలాగే కొంత‌మందిని ఆధార్ కార్డ్ నెంబ‌ర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలంటూ మోసం చేసి  2 ల‌క్ష‌ల 40 వేల రూపాయ‌లు అకౌంట్లోంచి కొట్టేశారు. 

ఎలా జరిగింది? 

ముంబ‌యిలోని డోంబీవాలీ ఏరియాకు చెందిన స‌త్య‌నారాయ‌న్ కుల‌క‌ర్ణికి ఓ కాల్ వ‌చ్చింది. తాము బ్యాంక్ రిప్రంజెంటేటివ్స్ అని, మీ ఆధార్ నెంబ‌ర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక‌ప్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబ‌ర్‌, డెబిట్ కార్డ్ నెంబ‌ర్ చెప్ప‌మ‌ని అడిగారు. పేరు, బ్యాంకు అడ్ర‌స్ అన్నీ క‌రెక్ట్‌గానే చెప్ప‌డంతో కుల‌క‌ర్ణి ఈ వివ‌రాలు చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఆ డెబిట్ కార్డ్ డిటెయిల్స్ ఉప‌యోగించి అకౌంట్‌తో లింక్ అయిన ఫోన్ నెంబ‌ర్ మార్చేశారు. దీంతో ఓటీపీ మోస‌గాళ్ల దగ్గ‌రున్నమొబైల్‌కు వ‌చ్చింది. వాళ్లు దాన్ని నుంచి 33వేలు కొట్టేశారు. అలాగే ఇదే ఏరియాలో ఉన్న 8 మంది అకౌంట్ల నుంచి దాదాపు 2ల‌క్షల 40 వేల రూపాయ‌లు కొట్టేశార‌ని పోలీసుల‌కు కంప్ల‌యింట్లు అందాయి. అందుకే ఎవ‌రు ఫోన్ చేసి మీ ఆధార్ నెంబ‌ర్ చెప్ప‌మ‌న్నా చెప్పొద్దంటున్నారు పోలీసులు. ఇక్క‌డ  ఆధార్ కార్డ్  వ‌ల్ల మోసం జ‌ర‌క్క‌పోయినా ఆధార్ లింకేజి పేరు చెప్పి బ్యాంక్ డిటెయిల్స్ క‌నుక్కునే ఫ్రాడ్‌స్ట‌ర్స్ ఎక్కువ‌య్యారు కాబ‌ట్టి బీ కేర్‌ఫుల్‌.  

అమెజాన్ అడుగుతోంది..

ఇటీవ‌ల అమెజాన్ కూడా ఎవరైనా క‌స్ట‌మ‌ర్ త‌న‌కు ఆర్డ‌ర్ పెట్టిన ఐట‌మ్ రాలేద‌ని కంప్లయింట్ చేస్తే ఆధార్ నెంబ‌ర్ అడుగుతోంది. ఆధార్ నెంబ‌ర్ ఇవ్వ‌క‌పోతే మీ ఆర్డ‌ర్‌ను ట్రాక్ చేయ‌డం డిలే అవుతుంది లేదంటే అస‌లు ట్రాక్ చేయ‌లేక‌పోవ‌చ్చు కూడా అని చెబుతున్నారు.  ఇలాగే త‌న‌కు జ‌రిగింద‌ని కోల్‌క‌తాకు చెందిన శ్ర‌ద్ధా కొసారియా చెప్పారు.  ఇన్‌డైరెక్ట్‌గా ఆధార్ డిటెయిల్స్ ఇమ్మ‌ని ఫోర్స్ చేయ‌డ‌మే. అయితే ఆర్డ‌ర్ గురించి అడిగే వ్య‌క్తి జెన్యూనా కాదా తెలుసుకోవ‌డానికే ఆధార్ అడుగుతున్నామని అమెజాన్ స‌మ‌ర్థించుకుంటోంది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు