• తాజా వార్తలు

బ్లూ వేల్‌ను బ్యాన్ చేయ‌లేరు.. కానీ ప‌రిష్కారం ఉంది

బ్లూ వేల్‌.. ఇప్పుడు టీనేజ‌ర్ల‌ను ప‌ట్ట‌పీడిస్తున్న స‌మ‌స్య‌. ఈ యాప్‌కు బాగా అల‌వాటు ప‌డిన పిల్ల‌లు చివ‌రికి సూసైడ్ వ‌ర‌కు వెళ్లిపోడ‌డ‌మే ఈ యాప్‌ను డేంజ‌ర్ యాప్‌గా మార్చింది. ఈ గేమింగ్ యాప్ ఇప్పుడు పెద్ద ప్రాబ్ల‌మ్‌గా మారిపోయింది. బ్లూ వేల్ ఛాలెంజ్‌ను బ్యాన్ చేయ‌డానికి అధికారులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించ‌డం లేదు. భార‌త్ లాంటి దేశంలో ఇలాంటి యాప్  వ‌ల్ల యువ ప్రాణాలు కోల్పోవ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం. ఈ గేమింగ్ యాప్ మాయ‌లో ప‌డి ఇప్ప‌టిదాకా 100 మంది యువ‌తీ  యువ‌కులు ప్రాణాలు తీసుకున్నార‌ని కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. వీరిలో ఎక్కువ‌శాతం మంది అమ్మాయిలు, పిల్ల‌లే ఉన్నార‌ట‌.

ఏంటి.. బ్లూవేల్ గేమ్?
బ్లూ వేల్ యాప్‌ను భార‌త్‌లో బ్యాన్ చేయ‌డం సాధ్యం కాని విష‌యం. ఎందుకంటే ఇది ఒక గేమ్‌. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆడాల్సిన ఆట‌.  బ్లూ వేల్ ఛాలెంజ్‌లో క్యూరేట‌ర్ల పేరుతో పిలిచే వాళ్ల‌తో టీనేజ‌ర్లు ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తారు. టాస్క్‌ల‌న్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.  అయితే ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ టాస్క్‌ల వ‌ల్ల కిడ్స్ చాలా ఇబ్బందుల్లో ప‌డుతున్నారు. ప్రాణాల మీద‌కు తెచ్చ‌కుంటున్నారు. అయితే దీనికి ఎవ‌రు య‌జమాని.. దీన్ని న‌డిపించేదెవ‌రు ఎవ‌రికి తెలియ‌దు. ఇదే యాక్ష‌న్ తీసుకోవ‌డానికి పెద్ద అవ‌రోధంగా మారుతోంది.

1. చాలా ఏళ్ల నుంచి బ్లూ వేల్ ఛాలెంజ్ ఉంది. ఈ గేమ్ కార‌ణంగా భార‌త్‌లో సూసైడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 

2. కొన్ని ప్ర‌త్యేక‌మైన నిబంధ‌న‌లు ఈ గేమ్‌లో ఉంటాయి. వాటిని సోష‌ల్ మీడియా ద్వారా మాత్ర‌మే షేర్ చేస్తారు.

3. పిల్ల‌ల‌తో క‌మ్యునికేట్ చేసేట‌ప్పుడు హ్యాష్‌టాగ్‌, సైట్, యాప్ ఇలా ఏమి ఉప‌యోగించ‌ట్లేదు.

4. ఈ కార‌ణాల‌తో ఈ గేమ్‌ను బ్లాక్ చేయ‌డం, బ్యాన్ చేయ‌డం కుద‌ర‌ట్లేదు. ఇంట‌ర్నెట్‌ను బ్లాక్ చేయ‌డం త‌ప్.

5.  పాపుల‌ర్ సోష‌ల్ మీడియా సైట్ల‌ను పిల్ల‌లు వాడ‌కుండా చూస్తే చాలు. చాలా వ‌ర‌కు ఈ గే్మ్ జోలికి వెళ్ల‌కుండా అరిక‌ట్టొచ్చు

6 ఫిలిప్ బుడెకిన్ అనే 22 ఏళ్ల ర‌ష్యా కుర్రాడు ఈ బ్లూ వేల్ చాలెంజ్‌ను క‌నిపెట్టాడు. అత‌నే నేరుగా పిల్ల‌ల‌కు ఈ గేమ్ నిబంధ‌న‌ల‌ను ఇస్తున్నాడు.

జన రంజకమైన వార్తలు