• తాజా వార్తలు

మ‌ళ్లీ అటాక్ చేయ‌నున్న లాకీ రాన్స‌మ్‌వేర్ .. సేఫ్‌గా ఉండండిలా!

రాన్స‌మ్‌వేర్ .. ఈ పేరు వింట‌నేనే సాఫ్ట్‌వేర్ రంగం ఉలికిప‌డుతోంది. దీనికి సంబంధించిన వైర‌స్ వ్యాపించి ఎన్నో దేశాల్లో కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌ల‌కు దెబ్బ త‌గిలింది. డేటా ఇష్యూలు చాలా వ‌చ్చాయి. మ‌ళ్లీ అవ‌న్ని సెట్ చేసుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. డ‌బ్బు వృథా అయింది. ఈ నేప‌థ్యంలో లాకీ రాన్స‌మ్‌వేర్ వైర‌స్ మ‌ళ్లీ రాబోతోంద‌ట‌. ఈ వార్త టెకీల గుండెల్లో గుబులు రేబులు రేపుతోంది. మ‌రి ఈ వైర‌స్ బారి నుంచి కంప్యూట‌ర్‌ను  ర‌క్షించుకోవ‌డం ఎలా? మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..!

ఏంటి లాకీ రాన్స‌మ్‌వేర్‌?
రాన్స‌న్‌వేర్‌.. ఇదో పెద్ద వైర‌స్‌. మీ కంప్యూట‌ర్‌లోకి చొర‌బ‌డి డేటాను క‌బ‌ళించి.. వాట‌ని మీకు దూరం చేయ‌డ‌మే దీని ల‌క్ష్యం. ఆ డేటాను లాక్ చేసేసి మీకు ప‌నికి రాకుండా చేయ‌డం దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. ఆ డేటాను అన్‌లాక్ చేయ‌డం కూడా సాధ్యం కాదు. మీరు అన్‌లాక్ చేయాలంటే రాన్స‌మ్‌వేర్‌కు పెద్ద మొత్తంలోనే డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే అన్‌లాక్ కీ వివ‌రాలు మీకు అందుతాయి. ఇప్ప‌టికే 23 మిలియ‌న్ల ఈమెయిల్స్‌కు ఈ రాన్స‌మ్‌వేర్ వైర‌స్ వెళ్లిపోయింద‌ట‌.

ఎలా ప‌ని చేస్తుందంటే..
రాన్స‌మ్‌వేర్ మొద‌ట‌గా మ‌న కంప్యూట‌ర్‌లోకి వ‌చ్చేది ఈమెయిల్స్ ద్వారానే. జిప్ అటాచ్‌మెంట్ల ద్వారా మ‌న సిస్ట‌మ్‌లోకి వ‌చ్చి ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా సిస్ట‌మ్‌ను ఆధీనంలోకి తీసుకుంటుంది. డీఐఏబీఎల్‌వో6 లాంటి ఎక్స‌టెన్ష‌న్‌తో ఇది మెయిల్‌కు వ‌స్తుంది. విజువ‌ల్ బేసిక్ స్క్రిప్ట్‌లో ఇది ఉంటుంది.  ఈ అటాచ్‌మెంట్ల‌ను ఓపెన్ చేస్తే మీ ఖేల్ ఖ‌త‌మే. 

ఎంత మొత్తం చెల్లించాలి?
రాన్నమ్‌వేర్ ఎఫెక్ట్ అయిన కంప్యూట‌ర్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావాలంటే క‌చ్చితంగా భారీ మొత్త‌మే చెల్లించాల్సి ఉంటుంది. మ‌న ఫైల్స్‌ను అన్‌లాక్ చేయాలంటే ఆ కీ కోస‌మైనా క‌చ్చితంగా డ‌బ్బులు క‌ట్టాలి. ఇదంతా బిట్‌కాయిన్ రూపంలోనే జ‌రిగిపోతుంది. దాదాపు 0.5 బిట్ కాయిన్ (రూ.1.5 ల‌క్ష‌లు)  చెల్లించాల్సి ఉంటుంది. ఇది పే చేస్తేనే మీకు కీ వివ‌రాలు అందుతాయి.

కాపాడుకోండిలా..
1. రాన్స‌మ్ వేర్ నుంచి మీ కంప్యూట‌ర్‌ను కాపాడుకోవాలంటే . బ్యాక్ అప్ రెడీగా ఉంచుకోవాలి. 

2. యాంటీ వైర‌స్‌ను అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి.

3. అనుమానం క‌లిగిన ఈమెయిల్స్‌ను ఓపెన్ చేయ‌కూడ‌దు

4. కీల‌క‌మైన డేటాను ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాక్ అప్ చేసుకోవాలి

5. రాన్స‌మ్‌వేర్‌కు పే చేయ‌ద్దు. మీకు ద‌గ్గ‌ర్లోని టెక్ స్పెష‌లిస్ట్ ద‌గ్గర‌కు వెళ్లి స‌ల‌హా తీసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు