• తాజా వార్తలు

వాడిన ఫోన్ కొంటున్నారా. ఐతే ఎవరు చెప్పని ఈ స్కామ్ గురించి తెలుసుకోవాల్సిందే!

వేలకు వేలు పోసి ఫోన్లు కొనుక్కోవ‌డం కొంత‌మందికి ఇష్టం ఉండ‌దు.  పాత ఫోన్లు కొనుక్కుంటే త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తాయి. అంతేకాక ఈఎంఐ లాంటి గొడ‌వ‌లు ఉండ‌వు. పైగా డ‌బ్బు ఆదా అవుతుంది అని అంద‌రూ అనుకుంటారు. కానీ పాత ఫోన్లు కొనుగోలు చేయ‌డం కూడా ఇప్పుడు ప్ర‌మాద‌క‌రమే. త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మీరు భారీ మూల్య‌మే చెల్లించాల్సి రావొచ్చు. కార‌ణం.. ఆ  కొన్న పాత ఫోన్ కొట్టేసింది కావ‌డ‌మే. ఎక్క‌డో కొట్టేసిన ఫోన్‌ను మ‌రో చోట అమ్ముతుంటారు కొంత‌మంది ఆ ఫోన్‌ను కొనుగోలు చేసిన మ‌నం ఇరుకున ప‌డిపోతాం.

కొన్న కొన్ని రోజుల‌కే..
భ‌లే మంచి చౌక బేర‌మ‌ని మరిసిపోతూ త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుంద‌ని పాత ఫోన్ కొనేస్తుంటారు చాలామంది. కొనేముందు క‌నీసం ఏమి ఆలోచించ‌రు. అస‌లు ఈ ఫోన్ ఎప్పుడు కొన్నారు.. ఎన్ని రోజులు వాడారు? ఒరిజిన‌ల్ ఓన‌ర్ ఎవ‌రు? ఇవ‌న్నీ మ‌న‌కు అన‌వ‌స‌రం. ఫోన్ చేతిలో ప‌డిందా లేదా అనేది ముఖ్యం. అయితే ఆ ఫోన్ కొట్టేసిందో లేదా ఎవ‌రైనా పోగొట్టుకుందో అయితే మాత్రం మీరు ఇబ్బందుల్లో చిక్కుకున్న‌ట్లే.  మనం ఫోన్ కొని దాన్ని ఆన్ చేసి సిమ్ వేసిన త‌ర్వాత కొన్ని రోజులు బాగానే ప‌ని చేస్తుంది.  అయితే ఫోన్‌కు అస‌లు ఓన‌ర్ ఈ విష‌యాన్ని క‌నిపెట్టి.. బ్లాక్ చేయిస్తే అంతే ఫోన్ ప‌ని చేయ‌డం ఆగిపోతుంది. అంతేకాదు పోలీసు కేసుల్లో చిక్కుకునే ప్ర‌మాదం కూడా ఉంది. అంటే డ‌బ్బులు పోతాయి...ఇటు పోలీసు కేసులు లాంటి చిక్కుల్లో ప‌డ‌తారు. చిన్న ఫోన్ అయితే వ‌దిలేయ‌చ్చు.. .అదే ఏ ఐఫోన్ లాంటివి కొంటేనే ఇంకా ఇబ్బంది. ఇదే యూజ్డ్ ఫోన్ స్కామ్‌.

స్కామ్‌లో ఎలా చిక్కుకుంటారంటే.
యూజ్డ్ ఫోన్ స్కామ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కొన్ని ప్ర‌త్యేక ముఠాలు ఈ ఫోన్ల అమ్మ‌కాల పేరుతో మార్కెట్లో మాటు వేశాయి.  అమాయ‌కులు దొర‌క‌గానే వెంట‌నే త‌మ ఉచ్చులో బిగిస్తాయి. నిజానికి వీళ్లు అమ్మే అన్ని ఫోన్లు దొంగిలించిన‌వే. ఖ‌రీదైన ఐఫోన్లు లాంటివి కొట్టేసిన ఈ దొంగ‌లు వాటిని త‌క్కువ రేట్ల‌కు మార్కెట్లో అమ్ముతారు.  వీలైనంత బేరం ఆడ‌తారు.  లాభానికి అమ్ముకుని ఆ త‌ర్వాత మాయం అయిపోతారు.  ఒక‌టి రెండు రోజులు ఆ ఫోన్లు వాడిన వినియోగ‌దారుల‌కు అస‌లు విష‌యం నెమ్మ‌దిగా తెలుస్తుంది. కానీ అప్ప‌టికే దొంగలు జారుకుంటారు. ఫోన్లు కూడా బ్లాక్ అయిపోతాయి. మీరు అన్ని విధాలా న‌ష్ట‌పోతారు. అందుకే యూజ్డ్ ఫోన్లు కొనేముందు అన్ని వివ‌రాలు క‌నుక్కోవాలి. ఎవ‌రు వాడారో క్షుణ్నంగా తెలుసుకోవాలి. అమ్మే వాళ్ల వివ‌రాలు ప‌క్కాగా తీసుకోవాలి. లేక‌పోతే నేరాల్లో చిక్కుకునే ప్ర‌మాదం  పొంచి ఉంది. చెక్ఎంఎండ్ లాంటి స‌ర్వీసులు ఫోన్ల హిస్ట‌రీని కూడా చెప్పేస్తున్నాయి. వాటిని యూజ్ చేసుకుని ఫోన్‌ను కొనుక్కోవాలి. 

జన రంజకమైన వార్తలు