• తాజా వార్తలు

ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ - 100 మంది వినియోగదారులకు - నష్టం

ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్
100 మంది వినియోగదారులకు నష్టం

మీకు ఫ్రీ ఛార్జ్ వాలెట్ గురించి తెలుసు కదా! అవును, ఇది ఒక మొబైల్ వాలెట్. మన ఫోన్ లకూ మరియు DTHలకూ ఈ వాలెట్ ను ఉపయోగించి మనం రీఛార్జి చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ ఛార్జ్ వాలెట్ పై ఈ మధ్యే ఒక సైబర్ అటాక్ జరిగింది. చెన్నై, ముంబై, హైదరాబాదు, ఢిల్లీ లాంటి నగరాలలో ఉన్న సుమారు 100 మంది ఈ ఫ్రీ ఛార్జ్ కస్టమర్ ల ఎకౌంటుల నుండి రూ. 8,000 - 10,000ల చొప్పున డబ్బు తస్కరణకు గురి అయింది. ఫిషింగ్ అటాక్ ద్వారా ఇది జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది. ఈ సంవత్సరం జూన్, ఆగష్టు నెలల మధ్య కాలంలో ఈ సంఘటన జరిగింది.

ఫిషింగ్ అంటే ఏమిటి?

అధికారిక వెబ్ సైట్ ల నుండి మెసేజ్ ఇస్తున్నట్లుగా భ్రమింప జేసి వినియోగదారుల యొక్క యూసర్ నేమ్ లూ, పాస్ వర్డ్ లు, బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాలు తదితరాలను తెలుసుకోవడం ద్వారా వారి ఎకౌంటులలోని డబ్బును తస్కరించడాన్నే ఫిషింగ్ అంటారు.

ఇది ఇక్కడ ఎలా జరిగింది?

అంటే అచ్చం ఫ్రీ ఛార్జ్ యొక్క అధికారిక వాలెట్ నుండి ఇస్తున్నట్లుగా అనేక మందికి మెసేజ్ లు పంపారు. వారికి ఎదో గిఫ్ట్ కూపన్ లు వచ్చినట్లు, ఆ గిఫ్ట్ కూపన్ లను బ్యాంకు ఎకౌంటుల ద్వారా రెడీం చేసుకోమన్నట్లుగా మెసేజ్ లు అందాయి. సాధారణంగా గిఫ్ట్ లు అంటే ఎవరికైనా ఆశే కదా! అదికూడా ఫ్రీ ఛార్జ్ నుండి వచ్చేసరికి చాలా మంది వీటి వలలో పడిపోయి వాటిని రెడీం చేసుకునే పనిలో పడ్డారు. ఇదే అవకాశంగా భావించిన మన సైబర్ నేరగాళ్ళు వినియోగదారుల యూసర్ ID మరియు పాస్ వర్డ్ లను తస్కరించి వారి ఎకౌంటు లలో డబ్బు కాజేసారు.

తర్వాత ఏమి జరిగింది?

తమ ఎకౌంటు లలో డబ్బు మాయం అవడాన్ని గమినించిన వినియోగదారులు ఫ్రీ ఛార్జ్ కూ, మరియు సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఆగష్టు 19వ తేదీకల్లా ఈ ఫ్రీ ఛార్జ్ జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ మోసపోయిన వారి అకౌంట్ లలో డబ్బు జమ చేసింది. ఈ విధంగా రూ. 2.9 లక్షల రూపాయలను జమ చేసింది.

 

జన రంజకమైన వార్తలు