• తాజా వార్తలు
  •  

సైబర్ క్రైమ్ కు గురవుతున్నారని డౌటా? మీకోసం ఇన్సూరెన్స్ వచ్చేసింది

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు అందరికీ అలవాటవుతున్నాయి.  డీమానిటైజేషన్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరగడం, స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్తో  మన కీలక సమాచారం అంతా టెక్నాలజీతో ముడిపడి పోయింది. దీంతో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. డేటా హ్యాక్ చేయడం, మన ఆన్ లైన్ అకౌంట్ల క్రెడెన్షియల్స్ సంపాదించి మన అకౌంట్ల నుండి మనకు. తెలియకుండానే డబ్బులు కొట్టేయడం వంటివి పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ ఉన్నా ఇప్పటివరకు అది కంపెనీలు, సంస్థలకే అందుబాటులో ఉంది. బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ  ఫస్ట్ టైమ్ వ్యక్తులకు కూడా సైబర్ సేఫ్టీ పాలసీని తీసుకొచ్చింది.

ఈ పాలసీ డివైస్ స్పెసిఫిక్ కాదు. ఇల్లు లేదా ఆఫీస్ లో మీరు వాడుకునే డివైస్లన్నింటికీ కలిపి ఒక పాలసీ సరిపోతుంది.  లక్ష నుండి కోటి రూపాయల వరకు పాలసీ తీసుకోవచ్చు. సైబర్ క్రైమ్ వల్ల మనీ పోతే ఇన్సూరెన్స్ కవరవుతుంది. మీసోషల్ మీడియా అకౌంట్స్ ను ఎవరైనా హ్యాక్ చేసి కామెంట్లు, పోస్ట్ ల ద్వారా మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు లీగల్ గా ప్రొసీడ్ కావడానికి అయ్యే ఖర్చు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ఇస్తుంది

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు