• తాజా వార్తలు

ఐ యాక్సెప్ట్ అనే బ‌ట‌న్ క్లిక్ చేసే ముందు ఈ ఆర్టిక‌ల్ ఓసారి చ‌దవండి

కొత్త‌గా ఏదైనా వెబ్‌సైట్‌లోకి ఎంట‌రైతే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్ కింద I accept అని క‌న‌ప‌డ‌గానే వెన‌కా ముందూ చూడ‌కుండా చ‌టుక్కున క్లిక్ చేసేస్తున్నారా? అయితే దాని వెనుక ఉన్న అస‌లు క‌థ చ‌దవాల్సిందే. 
డేటా బ్రోక‌ర్స్ 
ఇంట‌ర్నెట్‌లో మీ యాక్టివిటీస్‌ను ప‌సిగ‌ట్టి మీ డేటా, పేరు, అడ్ర‌స్‌, ఫోన్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ, మీ షాపింగ్ హ్యాబిట్స్‌ను మీ ఇష్టాయిష్టాలు, మీ ఫైనాన్షియ‌ల్ స్టేట‌స్‌, మీ స్పెండింగ్ నేచ‌ర్ అన్నీ చాలా ఈజీగా తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది.  ఇలా డేటా క‌లెక్ట్ చేసి కావ‌ల్సిన కంపెనీలు, సైట్ల‌కు అమ్మేసే డేటా బ్రోకర్లు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నారు.  ఐ యాక్సెప్ట్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే అందులో ఉండే కండిషన్ల‌లో మీ డేటా ఒక‌వేళ బ‌య‌టికి వెళ్లినా త‌మ‌కు బాధ్య‌త లేద‌ని ఆ కంపెనీ లేదా వెబ్‌సైట్ రూల్ పెట్టి ఉండొచ్చు. మ‌నం అవేమీ చూడ‌కుండా యాక్సెప్ట్ బ‌ట‌న్ నొక్కేస్తే రేపు మన సెన్సిటివ్ డేటా బ‌య‌ట‌కు వెళ్లినా ఎవ‌రిమీదా యాక్ష‌న్ తీసుకోలేం.   ఆధార్ కార్డు కోసం మ‌న వివ‌రాల‌న్నీ బ‌యోమోట్రిక్ ప‌ద్ధ‌తిలో నిక్షిప్తం చేశారు. ఇందులో ప‌ర్స‌న‌ల్‌, ఫ్యామిలీ, ప్రొఫెష‌న‌ల్ డేటాతో స‌హా అన్నీ ఉన్నాయి. కాబ‌ట్టి మ‌న డేటా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. 
స్కోరింగ్ 
మెషీన్ లెర్నింగ్‌.. ఇప్పుడు కొత్త టెక్నాల‌జీ. మీ ఇంట‌ర్నెట్ యూసేజ్ ఆల్గ‌రిథ‌మ్స్‌, బిగ్ డేటా ఎన‌లిటిక్స్‌తో సింక్ చేసి మీ గుట్టు చెప్పేస్తుంది. దీనిలో అన్‌స్ట్ర‌క్చ‌ర్డ్ డేటాను ఉప‌యోగించి మీకు సంబంధించిన డేటాకు 1 నుంచి 5 వ‌ర‌కు, ఎల్లో నుంచి గ్రీన్ వ‌ర‌కు ర్యాంకింగ్‌లు ఇస్తారు.  ఇప్ప‌టికే ఇన్సూరెన్స్‌, జాబ్ రిక్రూట్‌మెంట్స్ ఇలా చాలా అంశాల్లోకి మెషీన్ లెర్నింగ్ అడుగుపెట్టేసింది. ఇదంతా మంచిదే. కానీ మీ డిజిట‌ల్ ట్రేసెస్‌ను ఉప‌యోగించి డేటాను క‌లెక్ట్ చేసి అన్‌వాంటెడ్ ప‌ర్స‌న్స్ చేతిలో పెడితే అది మీకు ప్ర‌మాద‌మే. బ‌యాస్ ఫీడ్‌బ్యాక్‌తో మిమ్మ‌ల్ని ఇబ్బందిపెట్టే అవ‌కాశాలున్నాయి. 
ఆల్గ‌రిథ‌మ్ ఫోడ‌ర్  
ఫేస్‌బుక్‌లాంటి సోష‌ల్ సైట్స్‌, యూట్యూబ్ లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో మీకు ఎన్నో స‌జెష‌న్స్, పోస్ట్‌లు, నోటిఫికేష‌న్లు, వీడియోలు ఇవ‌న్నీ మీ ఇష్టాయిష్టాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వే వ‌స్తుంటాయి. కావాలంటే చూడండి. మీకు మీ ప‌క్క వ్య‌క్తికి  సేమ్ నోటిఫికేష‌న్లు రావు. ఇవ‌న్నీ ఆయా సైట్ల‌కు ఎలా తెలుస్తాయి?  వాటికీ స‌మాధానం ఆల్గరిథ‌మ్సే. ఇవేకాదు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే త‌ర్వాత సారి మీరు ఆ సైట్ ఓపెన్ చేసిన‌ప్పుడు మీకు అలాంటి ప్రొడ‌క్ట్‌లే ముందు చూపిస్తాయి. ఓలా, ఉబెర్ లాంటి టాక్సీ స‌ర్వీస్ కంపెనీలు మీ రైడ్స్ డిటెయిల్స్ స్టోర్ చేస్తాయి.  ఇవన్నీఇల్లీగ‌ల్ ఏమీ కాదు కానీ మ‌నం ప‌దేప‌దే అవే చూస్తున్నప్పుడు ఆ ప్రొడ‌క్ట్ అంటే మ‌న‌కిష్టం, మ‌నం క్యాబ్‌లో ఆ రూట్లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తామ‌ని తెలిస్తే వాటి రేట్లు పెంచేసే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌.  ఫేస్‌బుక్ వంటి సైట్లు మ‌న‌కు న‌చ్చిన వీడియోలు, పోస్ట్‌లు చూపిస్తూ  వాటిని క్లిక్ లేదా లైక్ లేదాషేర్ చేయిస్తూ మీమీద బిజినెస్ చేసుకుంటాయి. 
ఇలాంటివి ఏం జ‌రగ‌కూడ‌దంటే మ‌నం ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ చ‌దివాకే ఐ యాక్సెప్ట్ బ‌ట‌న్ నొక్క‌డం మంచిది 

జన రంజకమైన వార్తలు