• తాజా వార్తలు
  •  

మీ ఫోన్ కొట్టేయ‌కుండా ఉండాలా? అయితే పోలీసులు చెబుతున్న జాగ్ర‌త్త‌లివీ..

ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో తిరిగేవారి మొబైల్ ఫోన్లు కొట్టేసే గ్యాంగ్‌లు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ మెట్రో స్టేష‌న్ల ప‌రిధిలో మొబైల్ ఫోన్లు కొట్టేసే 14 మంది స‌భ్యుల కుటుంబాన్ని పోలీసులు ఇటీవ‌లే ప‌ట్టుకున్నారు. ఉక్రెయిన్ అంబాసిడ‌ర్  ఇగోర్ పొలికా రెడ్‌ఫోర్ట్ ఫొటో తీసుకుంటుంటే ఆయ‌న సెల్ దొంగ‌లు కొట్టేశారు. ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌తా, హైద‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాల్లో ఫోన్లు కొట్టేసే గ్యాంగులు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌న్న పోలీసులు మీ ఫోన్ పోకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. అవేంటో చూడండి.  
 1.బ్యాక్ ప్యాక్‌ను వెన‌కాల త‌గిలించుకోకండి
బ్యాక్‌ప్యాక్ లో మొబైల్‌, వాలెట్ లాంటివి పెట్టి వెన‌కాల త‌గిలించుకోకండి. ర‌ద్దీ ప్ర‌దేశాల్లో మీ వెన‌కే నిల‌బ‌డే దొంగ‌లు బ్యాగ్ ఓపెన్ చేసి వాటిని కొట్టేస్తారు.  
2.ఇయ‌ర్ ఫోన్స్ మొబైల్‌కు పెట్టుకోండి
 మొబైల్‌కు ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకోవ‌డం కూడా మంచి ప‌ద్ధ‌తే. ఎందుకంటే ఎవ‌రైనా ఫోన్ కొట్టేస్తే మ్యూజిక్ ఆగిపోతుంది. వెంట‌నే ప‌సిగ‌ట్టొచ్చు.  
3.లూజ్ పాకెట్స్‌లో ఫోన్ పెట్టుకోకండి 
లూజ్ పాకెట్స్ ఉన్న ప్యాంట్స్ లేదా లోయ‌ర్స్‌లో ఫోన్ పెట్టుకుంటే దొంగ‌ల‌కు అవ‌కాశ‌మిచ్చిన‌ట్లే. కాబట్టి ఫోన్ మీ బాడీకి ట‌చ్ అవుతున్న‌ట్లుగా ఉండే ప్యాంట్లు అయితేనే ఫోన్ అందులో పెట్టండి.  
4. ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ఫోన్ మాట్లాడ‌కండి
ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ఫోన్ మాట్లాడుతుంటే మీ దృష్టి అంతా కాల్ మీదే ఉంటుంది. అప్పుడు దొంగ‌లు చ‌టుక్కున ఫోన్ కొట్టేసి ప‌క్క‌నున్న త‌మ గ్యాంగ్ మెంబ‌ర్‌కు అందించేస్తారు.  మీరు వెంట‌నే అలర్ట‌యినా ఫోన్ అప్ప‌టికే చేతులు మారిపోయే ప్ర‌మాదం ఉంది. క్రౌడెడ్ ప్లేస్‌ల్లో ఫోన్‌తో ఫొటోలు తీస్తున్నా ఇలాగే కొట్టేస్తారు. 
5. ఫైండ్ మై ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజ‌ర్‌ను అనేబుల్ చేయండి 
ఇన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా ఫోన్ కొట్టేస్తే అదెక్క‌డుందో ప‌సిగ‌ట్టేందుకు ఈయాప్‌లు ఉప‌యోగ‌ప‌డతాయి. మీ ఫోన్ ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయి ఉన్నంత‌వ‌ర‌కు ఈ యాప్స్ ద్వారా మీ ఫోన్‌ను ట్రేస్ చేయొచ్చు. వాళ్లుదాన్ని మిస్ యూజ్ చేయ‌కుండా రిమోట్ ప‌ద్ధ‌తిలో లాక్ కూడా చేయొచ్చు.
6. ఫోన్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ తీసుకోండి 
ఫోన్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ఫోన్ పోయినా ఇన్సూరెన్స్ క్లెయిం చేయ‌వ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు