• తాజా వార్తలు
  •  

భ‌ర్త‌తో స‌హా మ‌రో ఏడుగురిని 60 ల‌క్ష‌ల‌కు బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ

ఆన్‌లైన్ ఫ్యాషన్ బిజినెస్ పేరుతో  ఓ మాయ లేడి  ఎనిమిది మందిని బురిడీ కొట్టించి 64 ల‌క్ష‌ల రూపాయ‌లు కొట్టేసింది. ఆమె చేతిలో మోస‌పోయిన‌వారిలో ఆమె భ‌ర్త కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.  ఆన్‌లైన్ ఫ్యాష‌న్ స్టార్ట‌ప్ మొద‌లుపెట్టి ఏడుగురు వ్య‌క్తుల నుంచి త‌న అకౌంట్లో మ‌నీ డిపాజిట్ చేయించుకుని వాటిని త‌న‌కు తెలియ‌కుండానే త‌న అకౌంట్‌లో నుంచి ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసి వాడేసుకుంద‌ని స్వ‌యంగా ఆమె భ‌ర్తే కంప్ల‌యింట్ ఇచ్చారు. 
ఇదీ మోసం
ఈట్‌. షాప్‌.ల‌వ్ కో ఫౌండ‌ర్ అయిన ఓయిండ్రిలా దాస్‌గుప్తా అనే బెంగ‌ళూరు మ‌హిళ త‌న అకౌంట్ ద్వారా మోసానికి పాల్ప‌డింద‌ని ఆమో భ‌ర్త షాయ‌క్ సేన్ పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశారు.  ఈట్‌. షాప్‌.ల‌వ్ పేరుతో ఓ ఆన్‌లైన్ ఫ్యాష‌న్ స్టోర్ బిజినెస్ న‌డుపుతున్న ఓయిండ్రిలా ఈ మార్చి నెల‌లో  ఒక యూకే బేస్డ్ కంపెనీ ద్వారా 22 కోట్ల పెట్టుబడులు సంపాదించింది. త‌ర్వాత ఆ సైట్‌ను టాటా గ్రూప్ ఆన్‌లైన్ వెంచ‌ర్ కొనుగోలు చేసింది.  జంషెడ్‌పూర్‌కు చెందిన ఓయిండ్రిలా బెంగ‌ళూరు ఐఐఎంలో సోష‌ల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ చేసి ఈ బిజినెస్ ప్రారంభించింది. అయితే త‌న బిజినెస్‌లో షేర్ అంటూ  ఆమె కొంత మంది ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసింది. వాటిని త‌న భ‌ర్త అకౌంట్‌లో వేయ‌మ‌ని, అక్క‌డి నుంచి ఆయ‌న‌కు తెలియ‌కుండానే త‌న అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుని సొంతానికి వాడుకుంది. దీనిమీద ఓయిండ్రిలా  భ‌ర్త  షాయ‌క్ సేన్ కంప్ల‌యింట్ చేశారు.  
బిజినెస్ వెంచ‌ర్ల‌లో పెట్ట‌బడి పేరిట మోసం
మొత్తం ఏడుగురిని ఆమె చీట్ చేసిన‌ట్లు పోలీసులు ఎంక్వ‌యిరీలో గుర్తించారు.  వీరిలో కొంత మంది  ఓయిండ్రిలా, ఆమె భ‌ర్త క‌లిసి  త‌మ డబ్బులు కొట్టేసి నాట‌కం  ఆడుతున్నార‌ని అంటున్నారు.  అయితే పోలీసులు ఈ విష‌యంలో షాయ‌క్ సేన్‌కు ఏమీ తెలియ‌ద‌ని, ఓయిండ్రిలానే మోసం చేసింద‌ని తేల్చారు.  మొత్తం 68 ల‌క్ష‌లు ఫ్రాడ్ జ‌రిగిద‌ని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువే ఇచ్చామ‌ని చాలామంది కంప్ల‌యింట్లు ఇచ్చారు. మోస‌పోయిన‌వారిలో బిజినెస్‌మ‌న్‌తోపాటు సినీ రంగంవాళ్లు కూడా ఉన్నారు. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు