• తాజా వార్తలు

ఆధార్‌, సిమ్ కార్డు లింకేజి అని కంగారు పెట్టి ల‌క్షా ముప్పై వేలు కొట్టేశారు.. జాగ్ర‌త్త‌! 

మీ సిమ్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోండి. లేక‌పోతే మీ సిమ్ డీ యాక్టివేట్ అయిపోతుంద‌ని మెసేజ్‌ల మీద మెసేజ్‌లు, కాల్స్ మీద కాల్స్ వ‌చ్చేస్తున్నాయా? క‌ంపెనీలు కంగారుపెడుతున్నాయ‌ని మీరు కంగారు ప‌డితే నిండా మునిగిపోయే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా సిమ్‌, ఆధార్ కార్డ్ లింకేజి కోసం ఎవ‌రైనా ఫోన్ చేసి మీ వివ‌రాలు అడిగితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఎందుకంటే అలా చెప్పి ఒకాయ‌న ల‌క్షా ముప్పై వేల రూపాయ‌లు పోగొట్టుకున్నారు.  

ముంబ‌యికి చెందిన శాశ్వ‌త్ గుప్తా ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్‌.  రీసెంట్‌గా ఆయ‌న‌కు ఓ కాల్ వ‌చ్చింది.  మీ ఎయిర్‌టెల్ సిమ్ కార్డును ఆధార్ కార్డుతో వెంట‌నే లింక్ చేయ‌క‌పోతే సిమ్ డీ యాక్టివేట్ చేసేస్తామ‌ని వార్న్ చేశాడు కాల్ చేసిన వ్య‌క్తి.  కంగారుప‌డిన శాశ్వ‌త్.. దానికి ఏం చేయాల‌ని అడిగారు.   మీ సిమ్‌కార్డు నెంబ‌ర్‌ను 121 కి ఎస్ఎంఎస్ పంప‌మ‌ని చెప్పాడు ఫోన్ చేసిన వ్య‌క్తి. 121 అనేది ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ కావ‌డంతో  శాశ్వ‌త్ న‌మ్మేశారు. అయితే త‌న సిమ్ నెంబ‌ర్ త‌న‌క తెలియ‌ద‌ని చెప్ప‌డంతో అవ‌త‌లి వ్య‌క్తి తానే  ఆ నంబ‌ర్ పంపిస్తాన‌ని, దాన్ని 121కి మెసేజ్ చేయ‌మ‌ని స‌జెస్ట్ చేసి ఓ నెంబ‌ర్ పంపాడు. వెంట‌నే శాశ్వ‌త్ ఆ నెంబ‌ర్‌ను 121కి ఎస్ఎంఎస్ చేశాడు. అంతే  శాశ్వ‌త్ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌లోంచి ల‌క్షా ముప్పై వేల రూపాయ‌లు విత్ డ్రా అయిపోయాయి.
 ఫ్రాడ్ ఎలా జ‌రిగింది? 
శాశ్వ‌త్ 121కి ఎస్ఎంఎస్ చేసింది కొత్త సిమ్ నెంబ‌ర్‌. దీంతో వెంట‌నే అతని ఒరిజిన‌ల్ సిమ్ క్లోన్ అయిపోవ‌డంతోపాటు అది డిస్‌కనెక్ట్ అయిపోయింది.  ఫోన్ చేసిన ఫ్రాడ్‌స్ట‌ర్  ఆ కొత్త సిమ్‌తో అప్ప‌టికే ఆ మొబైల్ నెంబ‌ర్‌తో లింక‌ప్ అయి ఉన్న శాశ్వ‌త్ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లోంచి డ‌బ్బు కొట్టేశాడు.  దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్‌కు, ఎయిర్‌టెల్‌కు కూడా కంప్ల‌యింట్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేద‌ని శాశ్వ‌త్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.    
ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోండి  
సిమ్ కార్డ్‌, ఆధార్ లింకేజి చేయ‌క‌పోతే సిమ్ డీయాక్టివేట్ అవుతుంద‌న‌గానే శాశ్వ‌త్ కంగారుప‌డ‌డ‌మే ఈ ఫ్రాడ్‌కు మెయిన్ రీజ‌న్‌. కాబ‌ట్టి ఇలాంటి కాల్స్‌, మెసేజ్‌లు వ‌చ్చినా కంగారుప‌డ‌కండి. ఎందుకంటే సిమ్‌, ఆధార్ లింకేజి గ‌వ‌ర్న‌మెంట్‌ను సూచించిందే త‌ప్ప అదేమీ త‌ప్ప‌నిస‌రి కాదు. సుప్రీంకోర్టులో కేసు న‌డుస్తోంది  కాబ‌ట్టి మీద ఇంకా క్లారిటీ రాలేదు.  కాబ‌ట్టి మీరు లింకేజి గురించి కంగారు ప‌డొద్దు.  ఒక‌వేళ చేయించుకోవాల‌నుకుంటే ఆన్‌లైన్‌లో టెలికం ప్రొవైడ‌ర్ అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిగానీ లేదంటే  కంపెనీ ఆథ‌రైజ్డ్ స్టోర్ల‌కు వెళ్లి చేయించుకోండి. అంతే త‌ప్ప ఫోన్లో ఎవ‌రో చేసిన కాల్స్‌కు అటెండ‌యి వాళ్లు చెప్పిన‌ట్ల‌ల్లా చేసి చిక్కుల్లో ప‌డొద్దు.  

జన రంజకమైన వార్తలు