• తాజా వార్తలు
  •  

ఫ్లిప్‌కార్ట్‌ని 17 ల‌క్ష‌ల‌కు బురిడీ కొట్టించిన కిలాడీ సెల్ల‌ర్స్ 

త‌మ సైట్ ద్వారా ప్రొడ‌క్ట్స్ అమ్ముకునే సెల్ల‌ర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ..  సెల్ల‌ర్ ప్రొటెక్ష‌న్ ఫండ్  (SPF)ను ఏర్పాటు చేసింది.  సెల్ల‌ర్లు పంపిన ప్రొడ‌క్ట్స్ ట్రాన్సిట్‌లో మిస్స‌యినా, డ్యామేజి అయినా లేక‌పోతే క‌స్ట‌మ‌ర్లు రిట‌ర్న్ చేసేస్తే  తిరిగి రాక పోయినా ఈ ఫండ్ ద్వారా సెల్ల‌ర్ల‌కు ఫ్లిప్‌కార్టే డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఆస‌రాగా చేసుకుని ఓ గ్యాంగ్ సెల్ల‌ర్లుగా రిజిస్ట్రేష‌న్ చేసుకుని ఫ్లిప్‌కార్ట్‌ను 17 లక్ష‌ల‌కు బురిడీ కొట్టించింది.  
ఇలా దోచేశారు..
    ఫ్లిప్‌కార్ట్ పోలీసులకు ఇచ్చిన కంప్ల‌యింట్‌లోని వివ‌రాల ప్ర‌కారం వెస్ట్ బెంగాల్ నుంచి ఓ గ్యాంగ్ తాము సెల్ల‌ర్ల‌మంటూ డిఫ‌రెంట్ ప్రొడ‌క్ట్‌లు అమ్ముతామ‌ని రిజిస్ట‌ర్ చేసుకుంది.  ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్ స‌ర్వీస్ ద్వారా ఈ సెల్ల‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రొడ‌క్ట్‌లు పంపేవారు. ఈ క‌స్ట‌మ‌ర్లు కూడా గ్యాంగ్ మెంబ‌ర్లే. వాళ్లు ప్ర‌తిసారి  రిట‌ర్న్ చేసేస్తున్నామ‌ని చెప్ప‌డం,  అవి త‌మ‌కు చేరలేద‌ని సెల్ల‌ర్లు ఫ్లిప్‌కార్ట్‌కు కంప్ల‌యింట్ చేయ‌డం, ఫ్లిప్‌కార్ట్ వాటికి సెల్ల‌ర్ల‌కు డ‌బ్బులిచ్చేయ‌డం జ‌రుగుతోంది. మ‌రోవైపు క‌స్ట‌మ‌ర్లు కూడా తాము ప్రొడ‌క్ట్ రిట‌ర్న్ చేసేశాం కాబ‌ట్టి మ‌నీ ఇచ్చేయాల‌ని డిమాండ్ చేయ‌డంతో ఫ్లిప్‌కార్ట్ వాటికి కూడా మ‌నీ క‌స్ట‌మ‌ర్ అకౌంట్‌కు రిటర్న్ చేసేది. ఇలా త‌ర‌చూ జ‌ర‌గ‌డం, అదీ వెస్ట్ బెంగాల్ బేస్డ్‌గా ఉన్న సెల్ల‌ర్ల విష‌యంలోనే ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డంతో ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఎంక్వ‌యిరీ  మొద‌లుపెట్టింది.  ఇలా మొత్తం 17 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు దోచుకున్న‌ట్లు గుర్తించారు. దీనిపై పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేసింది. 
ఇదీ ట్విస్ట్ 
అయితే ఫ్లిప్‌కార్ట్ ఎంక్వ‌యిరీ  మొద‌లుపెట్ట‌గానే గ్యాంగ్‌లో మెంబ‌రైన ఒక వ్య‌క్తి త‌న‌ను, త‌న సోద‌రుణ్ని ఈ విష‌యం నుంచి త‌ప్పించాలంటూ అపాల‌జీ లెట‌ర్ రాసిఫ్లిప్‌కార్ట్‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాడు. అయితే  ఆ త‌ర్వాత అత‌ని సోద‌రుడు వ‌చ్చి తాము మోసం చేసింది 5 ల‌క్ష‌ల‌కే అని, త‌న త‌మ్ముడు కంగారుప‌డి 10 ల‌క్ష‌లు ఇచ్చేశాడ‌ని, వాటిలో 5 ల‌క్ష‌లు తిరిగివ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ విష‌యంపై ఏమీ మాట్లాడ‌డం లేద‌ని తెలిసింది.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు