• తాజా వార్తలు
  •  

గూగుల్ మ్యాప్స్ సాయంతో త‌ప్పిపోయిన అమ్మాయిని కుటుంబంతో క‌లిపిన‌ పోలీసులు

టెక్నాల‌జీ ఏమైనా చేసేస్తుందిప్పుడు. మ‌న జీవితంలోకి ప్ర‌వేశించి ఎన్నో మార్పులు కూడా తీసుకొచ్చింది. టెక్నాల‌జీ ఒక్కోసారి కీల‌క స‌మ‌యాల్లో గొప్ప‌గా ఉపయోగ‌ప‌డుతుంది. అందుకు  ఉదాహ‌ర‌ణే ఈ దిల్లీ సంఘ‌ట‌న‌.  త‌న కుటుంబంతో స‌హా పెళ్లికి వ‌చ్చిన తప్పి పోయిన అమ్మాయిని ఆ ఫ్యామిలీతో తిరిగి క‌ల‌ప‌డానికి టెక్నాల‌జీ ఎంతో ఉప‌యోగ‌ప‌డంది. 

గూగుల్ మ్యాప్స్ ద్వారా..
గూగుల్ మ్యాప్స్ మ‌న‌కు దారి  చూపిస్తాయ‌ని తెలుసు  కానీ పోలీసుల‌కు మాత్రం ఒక కేసును ట్రేస్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి. ద‌క్షిణ దిల్లీలోని మాల‌వ్య న‌గ‌ర్‌లో జ‌రిగింది ఈ సంఘ‌ట‌న. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి పెళ్లికి వ‌చ్చిన ఏడేళ్ల ర‌ష్మీ (పేరు మారింది) బ‌య‌ట ఆడుకుంటూ త‌ప్పిపోయింది. పెళ్లి అయిన త‌ర్వాత త‌మ అమ్మాయి త‌ప్పిపోయింద‌నే విష‌యాన్ని వారి కుటుంబ స‌భ్యులు తెలుసుకున్నారు.  ర‌ష్మీని క‌నుగొన్న పోలీసులు టెక్నాల‌జీ సాయం తీసుకున్నారు. గూగుల్ మ్యాప్స్ సాయంతో వారి త‌ల్లిదండ్రుల‌ను క‌నిపెట్టారు.

ఎలా ఉప‌యోగించారంటే..
గూగుల్ మ్యాప్స్ వాడ‌డ‌టానికి ముందు పోలీసులు ర‌ష్మీ నుంచి చాలా వివ‌రాలు సేక‌రించారు. త‌మ‌కు పెళ్లికి రావ‌డానికి నాలుగు గంట‌లు ప‌ట్టింద‌ని ఆమె చెప్ప‌డంతో దిల్లీకి నాలుగు  గంట‌ల  స‌మ‌యం ప‌ట్టే ఏరియాను గుర్తించారు. ఆ దారి వెంట గూగుల్ మ్యాప్స్‌ను ఆన్ చేసుకుని ర‌ష్మీని వెంట తీసుకుని బ‌య‌ల్దేరారు. చాలా ఏరియాల‌ను ఆమె గుర్తు ప‌ట్టింది. అలా ముందుకు వెళుతూ ఆమెకు సంబంధించిన విలేజ్‌ను చేరుకున్నారు.  మ‌ధ్య‌లో గ్రామ స‌ర్పంచ్‌లు, ఇత‌రుల నుంచి కూడా పోలీసులు హెల్ప్ తీసుకున్నారు, మీర‌ట్ నుంచి 44 కి.మీ దూరంలో ఉన్న కోల్ విలేజ్‌కు చెందింది అని పోలీసులు గుర్తించారు. 

జన రంజకమైన వార్తలు