• తాజా వార్తలు

మ‌న జీవితంలోని ప్ర‌తి అంశాన్ని ట్రాక్ చేయ‌డానికి గూగుల్ కుట్ర చేస్తుందా!

ప్ర‌త్య‌ర్థుల నుంచి పోటీ ఎదుర‌వుతున్న కొద్దీ గూగుల్ కూడా తాను ఇప్ప‌టిదాకా ట‌చ్ చేయ‌ని రంగాల్లోనూ అడుగుపెడుతోంది. ముఖ్యంగా యాపిల్ నుంచి పోటీని త‌ట్టుకుని నిల‌దొక్కుకునేందుకు ఫోన్ రంగంలోనూ ప్రవేశించిన గూగుల్‌.. తాజాగా హార్డ్‌వేర్‌పైనా దృష్టి పెట్టింది. గతంలో ఈ రంగంలోకి వ‌చ్చి అంత క్లిక్ కాలేక‌పోయిన గూగుల్‌.. ఇప్పుడు మాత్రం హార్డ్‌వేర్‌లో దూసుకుపోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇటీవ‌ల పిక్స‌ల్ 2 లాంచ్‌లో ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది ఈ సంస్థ‌. మ‌రి గూగూల్ తాజా ప‌రిణామం వ‌ల్ల మ‌న జీవితంలోని ప్ర‌తి అంశం మీద ఈ సెర్చ్ ఇంజ‌న్ ప్ర‌భావం చూపించ‌నుందా? 

ఏఐ టెక్నాల‌జీ మీదే  దృష్టి
ఇప్పుడు ప్ర‌పంచం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అగ్‌మెంటెడ్ టెక్నాల‌జీ (ఏఐ) మీదే గూగుల్ పూర్తిగా దృష్టి పెట్టింది.  దీనిని డెవ‌ల‌ప్ చేసి ప్ర‌త్య‌ర్థుల‌కు షాక్ ఇవ్వాల‌నే వ్యూహంతో ముందుకెళుతోందీ సంస్థ‌. యాపిల్ ఐ ఫోన్‌, శాంసంగ్‌ల‌కు పోటీగా పిక్స‌ల్ 2ను రంగంలోకి తీసుకొచ్చిన గూగుల్‌.. ఇప్పుడు  మ‌రింత మెరుగైన టెక్నాల‌జీతో ఈ రెండు సంస్థ‌లకు అంద‌నంత ఎత్తులో నిల‌వాల‌నే సంక్పంతో ఉంది. దీనిలో ఇప్ప‌టికే న్యూ క్రోమ్ బుక్‌, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీక‌ర్‌, గో ప్రో లైక్ కెమెరా లాంటి టెక్నాల‌జీని తీసుకొచ్చిన గూగుల్ వ‌ర్చువ‌ల్ రియాల్టీని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.  అందుకే రిఫైండ్ వెర్ష‌న్ ఉన్నవ‌ర్చువ‌ల్ రియాల్టీ హెడ్ సెట్‌ను అందిస్తోంది గూగుల్‌. 

గూగుల్ అసిస్టెంట్‌
ఇప్పుడు గూగుల్ దృష్టి మొత్తం హార్డ్‌వేర్ మీదే ఉంది. ఎందుకంటే భ‌విష్య‌త్‌లో హార్డ్‌వేర్‌ది కీల‌క‌పాత్ర అని ఆ సంస్థ న‌మ్ముతోంది. అందుకే ఇటీవ‌లే ఆ సంస్థ హెచ్‌టీసీ ఫోన్ల త‌యారీ కోసం 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డి పెట్టింది.  అయితే కీల‌క స‌మ‌యాల్లో ఎక్కువ ఉత్ప‌త్తుల‌ను అందించ‌డంలో గూగుల్‌కు మంచి రికార్డు లేదు. ఈ విష‌యంలో యాపిల్ ముందంజ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఉత్ప‌త్తుల విష‌యంలోనూ సీనియ‌స్‌గా దృష్టి పెట్ట‌నుంది ఈ సెర్చ్ ఇంజ‌న్‌. అమెజాన్ అలెక్సా,  యాపిల్ సిరిలాగే గూగుల్  అసిస్టెంట్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డానికి ఆ సంస్థ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ డెవ‌ల‌ప్ చేస్తే ఎక్కువ‌మంది వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించొచ్చనేది గూగుల్ ఆలోచ‌న‌. అయితే ఇప్ప‌టికే మ‌న‌కు సంబంధించి చాలా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ట్రాక్ చేస్తున్న గూగుల్‌.. ఇక‌పై మ‌రింత ముందుకెళ్లి అన్నింట్లోనూ  త‌ల‌దూర్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.   
                           

జన రంజకమైన వార్తలు