• తాజా వార్తలు
  •  

మీకూ ఈ మెసేజ్ వ‌చ్చిందా?కంగారు ప‌డ‌కండి.. అది న‌యా స్పామ్‌

డియ‌ర్ క‌స్ట‌మ‌ర్ ఈ జ‌న‌వ‌రి 7 నుంచి మీ మొబైల్ నెంబ‌ర్‌కు వాయిస్ కాల్స్ ఆగిపోతాయి. మీరు ఈ నెంబ‌ర్‌ను కంటిన్యూ చేయాల‌నుకుంటే యూపీసీ(యూనిక్ పోర్ట్ కోడ్‌) ను జ‌న‌రేట్ చేసుకుని ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు మైగ్రేట్ అవ్వండి...
ఈ  మెసేజ్ ఇప్పుడు చాలా మందికి వ‌స్తోంది. జియో నుంచి ఎయిర్‌టెల్ వ‌ర‌కు దాదాపు అన్ని నెట్‌వ‌ర్క్‌ల మొబైల్ యూజ‌ర్లకు ఇదే మెసేజ్ వ‌స్తోంది. దేశంలోని అన్ని స‌ర్కిల్స్‌లోని మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల్లోనూ ఈ మెసేజ్ స‌ర్క్యూలేట్ అవుతుంది.  వాయిస్‌కాల్స్ ఆగిపోతాయ‌న‌డంతో యూజ‌ర్లు కంగారుప‌డి త‌మ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ల‌ను సంప్ర‌దిస్తున్నారు. అయితే కంపెనీలు అలాంటిదేమీ లేద‌ని ఇదొక స్పామ్ కాల్ అని తేల్చారు. ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ తదిత‌ర నెట్‌వ‌ర్క్‌ల క‌స్ట‌మ‌ర్లు ఇలాంటి మెసేజ్ రావ‌డంతో ట్విట్ట‌ర్‌లో దీన్ని పోస్ట్ చేయ‌డం, అలాంటిదేమీ లేద‌ని  ఇది స్పామ్ మెసేజ్ అని వారు తిరిగి ట్వీట్ చేయ‌డం జ‌రుగుతోంది.
ప‌ర్ప‌స్ ఏమిటో?
పోర్ట్ పెట్టి ఏదైనా నెట్‌వ‌ర్క్‌కు మైగ్రేట్ అవ్వండి అని మాత్ర‌మే ఆ మెసేజ్‌లో ఉంది. అంతే త‌ప్ప ఫ‌లానా నెట్‌వ‌ర్క్‌కే వెళ్లండి అని స్పెసిఫిక్‌గా లేదు. దీంతో ఈ మెసేజ్ ప‌ర్ప‌స్ ఏమిటో అర్ధం కావ‌డం లేదంటున్నాయి టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీలు.
ఆధార్ డేట్ కూడా అది కాదు
ఆధార్‌తో సిమ్ రీవెరిఫికేష‌న్ చేసుకోవాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్స్ ఇచ్చింది.దానికి కూడా గ‌డువు జ‌న‌వ‌రి 7కాదు. ఫిబ్ర‌వ‌రి 6. ఒక‌వేళ ఇప్ప‌టికీ ఆధార్ లేక‌పోతే అలాంటి వాళ్ల‌కు మార్చి 31 వ‌ర‌కు కూడా గడువిచ్చారు. అలాంట‌ప్పుడు ఈ జ‌న‌వ‌రి 7 తారీఖు డెడ్‌లైన్ పేరిట వ‌చ్చిన ఈ స్పామ్ మెసేజ్ గంద‌ర‌గోళం సృష్టించ‌డానికే అయి ఉంటుందంటున్నారు.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు