డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కు చెందిన టెలికం ఎన్ఫోర్స్మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ (TERM) సెల్.. దొంగతనానికి గురైన ఓ మొబైల్ ఫోన్ ను ట్రేస్ అవుట్ చేయడానికి IMEI నెంబర్‌ను ఉపయోగించి సెర్చ్ చేసింది. సెర్చ్ రిజల్ట్స్ చూస్తే TERM సెల్ అధికారులకే దిమ్మదిరిగిపోయింది. ఆ ఒక్క IMEI నెంబర్ మీద ఏకంగా 18వేల మొబైల్ ఫోన్లు రన్ అవుతుండడంతో వాళ్లంతా నివ్వెరపోయారు. ఇది కేవలం ఓ మొబైల్ ఫోన్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. అలా డూప్లికేట్ ఈఎంఐ నెంబర్లున్న ఫోన్లు ఉగ్రవాదుల వంటి వారికి చేరితే దేశ భద్రతకే ముప్పన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమైంది. అలా ఒక్క ఐఎంఈఐ నెంబర్‌పైనే ఇన్ని వేల నెంబర్లు పని చేస్తే వాటిని ట్రేస్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇలాంటి వాటిని నివారించే చర్యల్లో భాగంగా ఫోన్ దొంగతనాలను కంట్రోల్ చేయడంపైనా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (DoT) దృష్టి పెట్టింది. రూల్స్‌ను బాగా టైట్ చేసింది. ఐఎంఈఐ నెంబర్‌ను ట్యాంపరింగ్ చేస్తే జైలు శిక్ష ఖాయం.
ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్‌కు సవరణలు
ఫోన్ దొంగతనాలను, ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్ చేయడం వంటి వాటిని అడ్డుకునేందుకు DoT స్ట్రిక్ట్ యాక్షనే ప్రారంభించింది. ఇందుకోసం130 ఏళ్ల కిందటి Indian Telegraph Act, 1885కు చాలా అమెండ్మెంట్స్ చేసింది. దీని ప్రకారం ఏ సెల్‌ఫోన్ IMEI నెంబర్నయినా ట్యాంపరింగ్ చేయడం లేదా మార్చడం శిక్షార్హమైన నేరం. దీనికింద మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
IMEI నెంబర్ మీ ఫోన్‌ను దొంగల నుంచి రక్షించగలదా?
IMEI అంటే International Mobile Equipment Identity నెంబర్. దీనిలో 15 డిజిట్స్ ఉంటాయి. ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌కు ఒక IMEI నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఉంటే చాలు ఆ ఫోన్ ఎక్కడుంది.. ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్‌కు ఎక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి? ఎవరికి కాల్ చేస్తున్నారో సమస్త వివరాలు తెలుసుకోవచ్చు. టెలికం ప్రొవైడర్స్ ఈ IMEI నెంబర్‌ను బేస్ చేసుకుని ఫోన్‌ను ట్రేస్ అవుట్ చేస్తాయి. అయితే చైనా కంపెనీల ఫోన్లకు ఐఎంఈఐ నెంబర్లే ఉండడం లేదు. ఇది దేశభద్రతకు కూడా ప్రమాదమని భావించిన ప్రభుత్వం ఇలా ఐఎంఈఐ నెంబర్లు లేని ఫోన్లను నిషేధించింది. దీంతో ఐఎంఈఐ నెంబర్ లేని వేలాది సెల్ఫోన్లు బయటపడుతున్నాయి.