• తాజా వార్తలు
  •  

స్మార్ట్‌ఫోన్ సెన్స‌ర్ల‌తోమీ పాస్‌వ‌ర్డ్‌ల‌కు గండం.. ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలుసా?

 


స్మార్ట్‌ఫోన్ కొనేట‌ప్పుడు ఫీచ‌ర్ల‌న్నీ చూస్తాం.  యాక్సిల‌రోమీట‌ర్‌, గైరోస్కోప్‌, బారోమీట‌ర్‌, ప్రాక్సిమిటీ లైట్ సెన్స‌ర్ వంటివ‌న్నీ ఉంటే హై ఎండ్ ఫోన్ కిందే లెక్కే. ఒక్కోటి ఒక్కో ఫీచ‌ర్‌ను ఎన్‌హేన్స్ చేసే ఈ ఫీచ‌ర్ల‌తో మీ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌కు గండం ఉంది. ఈ సెన్స‌ర్ల ద్వారా హ్యాక‌ర్లు మీ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌లు గుర్తుపట్టేస్తున్నారని రీసెంట్‌గా ఓ రీసెర్చ్ తేల్చింది. 
భార‌తీయ సంత‌తి సైంటిస్ట్ డాక్ట‌ర్ శివ‌మ్ బాసిన్ స్మార్ట్‌ఫోన్‌లో మీరు ర‌క‌ర‌కాల ట్రాన్సాక్ష‌న్ల కోసం ఎంట‌ర్ చేసే పిన్ నెంబ‌ర్లు, పాస్వ‌ర్డ్‌ల‌ను స్మార్ట్‌ఫోన్ల సెన్స‌ర్ల ద్వారా  హ్యాక్ చేయొచ్చ‌ని రీసెర్చ్ చేసి నిరూపించారు.  గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్స‌ర్స్ లాంటి సెన్స‌ర్లు సెక్యూరిటీ థ్రెట్‌కు ఎక్కువ అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.  వీటి ద్వారా  ఓ ఆండ్రాయిడ్ ఫోన్‌ను జ‌స్ట్ మూడు ప్ర‌య‌త్నాల్లో అన్‌లాక్ చేశారు.  స్మార్ట్‌ఫోన్ సెన్స‌ర్లు,  మెషిన్ లెర్నింగ్ ఆల్గ‌రిథ‌మ్స్ ద్వారా హ్యాక‌ర్లు ఇలా చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని తేల్చారు.  స్మార్ట్‌ఫోన్ లాక్ చేయ‌డానికి నాలుగు డిజిట్ల పిన్ నెంబ‌ర్ పెడ‌తాం. ఈ కొత్త టెక్నిక్ ద్వారా ఇలా నాలుగు డిజిట్ల తో వ‌చ్చే 10 వేల కాంబినేష‌న్ల‌ను  తెలుసుకుని అన్‌లాక్ చేసేయొచ్చ‌ట‌.  
సెన్స‌ర్ల ద్వారా ఎలా గుర్తిస్తారు? 
యాక్సిల‌రోమీట‌ర్‌, గైరోస్కోప్‌, మాగ్నెటోమీట‌ర్‌, ప్రాక్సిమిటీ సెన్స‌ర్‌, బారోమీట‌ర్‌, యాంబియంట్ లైట్ సెన్స‌ర్ అని స్మార్ట్‌ఫోన్‌లో ఆరు ర‌కాల సెన్స‌ర్లున్నాయి. యూజ‌ర్లు పిన్ లేదా పాస్‌వ‌ర్డ్ టైప్ చేసేట‌ప్పుడు ఫోన్‌ను ఎంత తిప్పారు. వాళ్ల వేళ్లు లేదా థంబ్ ఇంప్రెష‌న్ వ‌ల్ల ఎంత లైట్ బ్లాక్ అయింది హ్యాక‌ర్లు లెక్కేసి పాస్‌వ‌ర్డ్ ను అంచ‌నా వేసేస్తార‌ట‌. అదే పిన్ నెంబ‌ర్ అయితే ఏ ప్లేస్‌లో స్క్రీన్‌ను మ‌నం ట‌చ్ చేశామో దాన్ని బ‌ట్టి  ఆ డిజిట్స్ ఏమిటో ప‌ట్టేస్తారు.  ఆండ్రాయిడ్ ఫోన్ల మీద జ‌రిగిన రీసెర్చిలో ఈ విష‌యాన్ని గుర్తించారు.  
ఎలా కాపాడుకోవాలి?  
* నాలుగు కంటే ఎక్కువ డిజ‌ట్ల‌తో పిన్ నెంబ‌ర్ పెట్టుకోండి
* పిన్  కంటే ఆల్ఫా న్యూమ‌రిక‌ల్ (లెట‌ర్స్‌, నెంబ‌ర్స్ క‌లిసి ఉన్న‌ది) పాస్‌వ‌ర్డ్ సేఫ్. 
* ఓటీపీలాంఇ అథెంటికేష‌న్ మెథ‌డ్స్‌ను యూజ్ చేయండి 
* టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ వాడండి  
* ఫింగ‌ర్‌ప్రింట్స్‌, ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ లాంటి బ‌యోమెట్రిక్ సెన్స‌ర్స్ యూజ్ చేయ‌డం బెట‌ర్‌.  

జన రంజకమైన వార్తలు